Site icon NTV Telugu

Off The Record: బీఆర్ఎస్‌కు హ్యాట్రిక్ విజయం సాధ్యమేనా..?

Brs

Brs

Off The Record: తెలంగాణలో హ్యాట్రిక్ విజయం సాధించే దిశగా అధికార బీఆర్ఎస్‌ పావులు కదుపుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం అవుతోంది. షెడ్యూలు ప్రకారం ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాల పేరుతో జనానికి మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది BRS. ఇటీవల జరిగిన సమావేశంలో అసెంబ్లీ ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్. గెలుపు కోసం ఏం చేయాలనేదానిపై నేతలకు క్లారిటీ ఇచ్చారట. మరోవైపు అసెంబ్లీ నియోజకవర్గాలకు BRS ఎమ్మెల్యే లేని చోట ఇంఛార్జ్‌లను నియమించాలని సూచించారు కేసీఅర్. ఈ నియామక ప్రక్రియ రెండు మూడు నెలల్లో పూర్తిచేయాలని చెప్పారని టాక్‌. తెలంగాణలో ప్రస్తుతం MIM మినహా ఎనిమిది నియోజకవర్గాల్లో BRSకు ఎమ్మెల్యే లు లేరు. దీంతో ఎవరికి ఇక్కడ ఇంఛార్జ్‌లుగా అవకాశం దక్కుతుందన్న చర్చ మొదలైంది.

Read Also: Off The Record: దళితబంధులో కమీషన్లపై సీఎం వార్నింగ్‌.. వాళ్లకు నిద్ర పట్టడం లేదా.?

ఇక…అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరుగుతాయి.దీంతో అసెంబ్లీ నియోజకవర్గానికి ఇప్పుడు నియామకం అయ్యే ఇంఛార్జిలే అభ్యర్థులు అవుతారా?అన్న చర్చ మొదలైంది. ప్రస్తుతం బిజెపితో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నచోట…వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేయాలని అనుకుంటోంది అధికార పార్టీ. సికింద్రాబాద్ కంటోన్మెంట్, దుబ్బాక, గోషామహల్ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్నారు గులాబీ ఆశావహులు. ఇప్పటికే సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో గ్రూపు తగాదాలు మొదలయ్యాయి. ఇక దుబ్బాక అసెంబ్లీపై ఫోకస్ పెట్టారు మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డీ. ఇప్పటికే హుజురాబాద్ అసెంబ్లీ నియోజవర్గానికి ఇంఛార్జిని నియమించారు అధినేత కేసీఅర్. ఇలా ఇప్పటి నుంచే ఆయా నియోజకవర్గాలకు ఇంఛార్జిలను నియమిస్తే అక్కడ పార్టీ గాడిలో పడుతుందన్న ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నట్టుగా సమాచారం. అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట ఇంచార్జ్‌ల నియామకం ఆలోచన గులాబీ పార్టీలో హాట్ టాపిక్ అయ్యింది. మరి ఇంఛార్జులుగా ఛాన్స్ దక్కించుకున్న వారు వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులు అవుతారా?లేదా?అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Exit mobile version