Off The Record: చుట్టూ ఉన్నవాళ్ల వల్లే ఆ ఎమ్మెల్యేకు సమస్యలు పెరుగుతున్నాయా?
- వరుస వివాదాలతో తల బాదుకుంటున్న ఎమ్మెల్యే దగ్గుపాటి..
- టిక్కెట్, గెలుపు తేలిగ్గా దొరికినా.. అసలు కష్టాలు ఆ తర్వాతే..
- ప్రతి చిన్న ఘటనకు ఎమ్మెల్యేనే బాధ్యుడంటూ ప్రచారం..
- టీడీపీ అధిష్టానం దాకా వెళ్ళిన వ్యవహారాలు..
- జూనియర్ ఎన్టీఆర్‌ని తిట్టారన్న ఎపిసోడ్లో బాగా ఇబ్బంది..
- తాజాగా వైద్యురాలి భర్తను దూషించారన్న ఆడియో బయటికి..
- ఎమ్మెల్యే చుట్టూ ఉన్నవాళ్ళ వల్లే సమస్యలు పెరుగుతున్నాయా?..
- దగ్గుపాటి చుట్టూ ట్రబుల్ షూటర్స్‌కు బదులు మాంగర్స్ ఉన్నారా?..
- సగం మేటర్ చెప్పి చేతికి ఫోన్ ఇవ్వడంతోనే సమస్యలు వస్తున్నాయా?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే అయితే చాలా ఈజీగా అయ్యారు గానీ…… అసలు మేటర్ ఆ తర్వాతే తెలిసొస్తోందట. ఒకదాని వెంట ఒకటిగా తలెత్తుతున్న వివాదాలు, ఎదురవుతున్న ఇబ్బందులతో ఇవెక్కడి రాజకీయాలు, వీళ్ళెక్కడి నాయకులురా… బాబూ అని తలబాదుకునే పరిస్థితి వస్తోందట. రాప్తాడు మండలం బండమీదపల్లికి చెందిన దగ్గుపాటి అనుకోకుండా అనంతపురం అర్బన్ టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. కూటమి వేవ్ కలిసొచ్చి చాలా తేలిగ్గా అసెంబ్లీ మెట్లెక్కారు. అనంతపురం అర్బన్‌లో 23వేల మెజార్టీ అంటే మంచి గెలుపేనని చెబుతాయి రాజకీయవర్గాలు. ఆ స్థాయిలో విజయం సాధించినన్న ఆనందంలో ఉండగానే….ఆయనకు అసలు సినిమా స్టార్ట్ అయిపోయింది. గెలిచిన రెండు నెలల నుంచే ఇబ్బందులు మొదలయ్యాయి. నియోజకవర్గంలో…. ఎక్కడ ఏం జరిగినా, ప్రతి చిన్న ఘటనకు కూడా ఎమ్మెల్యే లేదా ఆయన ప్రధాన అనుచరుడు గంగారాం బాధ్యులంటూ ప్రచారం మొదలైంది. చివరకు బాధితులు పోలీస్ కంప్లయింట్స్ ఇవ్వడం, విషయాన్ని పార్టీ అధిష్టానం దాకా తీసుకెళ్లడం లాంటి వ్యవహారాలతో అంతా రచ్చరచ్చగా మారింది.
అదే ఊపులో ఎమ్మెల్యే దగ్గుపాటి జూనియర్ ఎన్టీఆర్‌ని దూషించినట్టుగా ఉన్న ఆడియో లీక్ అయింది. అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రెండు రాష్ట్రాల్లోని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక రేంజ్లో విరుచకుపడ్డారు. ఇటీవల వరుసగా ఎగ్జిబిషన్ నిర్వాహకులపై దాడి, వైన్ షాప్‌కు నిప్పు పెట్టడం, టీడీపీ నాయకురాలి ఆస్తిని కబ్జా చేసే ప్రయత్నం లాంటి ఆరోపణలు, వ్యవహారాలు ఎమ్మెల్యే ఇమేజ్‌ని బాగా డ్యామేజ్ చేశాయి. అలాగే…. ఎమ్మెల్యే దగ్గుపాటి అంతకుముందు అస్రా ఆసుపత్రి వివాదంలో వైద్యురాలి భర్తను దూషించిన ఆడియో ఇప్పుడు బయటకొచ్చింది. అటు జూనియర్ ఎన్టీఆర్, ఇటు వైద్యురాలి భర్తను దూషించారన్న వ్యవహారాలు పార్టీలో హాట్ డిస్కషన్ అయ్యాయి. అసలెందుకు ఆయన్నే వివాదాలు వెదుక్కుంటూ వస్తున్నాయని అంటే…చుట్టూ ఉన్నవాళ్ళేనన్నది ఎక్కువ మంది సమాధానం. ఎమ్మెల్యే చుట్టూ ఉన్నవాళ్ళు అసలు ఆయనకు ఏం సలహాలు ఇస్తున్నారు, ఆయన్ని ఏం చేయాలనుకుంటున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి. వాస్తవంగా ఏ నాయకుడి దగ్గరైనా…. ట్రబుల్ షూటర్స్ ఉంటారు. ఏదైనా సమస్య వస్తే వాటిని నీట్‌గా డీల్ చేసి నాయకుడి దగ్గరకు రాకుండా చూసుకుంటారు. ప్రత్యేకించి కొత్త ఎమ్మెల్యేలు ఇలాంటి వారిని కావాలని దగ్గర పెట్టుకుంటారు. కానీ… ఇప్పుడు దగ్గుపాటి చుట్టూ ఉన్న వాళ్ళంతా ట్రబుల్ షూటర్స్ కాదు ట్రబుల్ మాంగర్స్ అన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. వాళ్ళు ప్రతి చిన్న విషయంలో తలదూర్చి.. తమ నాయకుడికే తలపోటు వచ్చేలా చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది అనంతపురంలో.
Also Read
- Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
- OTR: నరసాపురంలో కాపుల అసంతృప్తికి అసలు కారణం ఇదేనా..?
- Off The Record: వనపర్తి కాంగ్రెస్‌లో రగులుతున్న లొల్లి! ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన చిన్నారెడ్డి
- OTR: నెల్లూరు వైసీపీలో మొదలైన అసంతృప్తి రగడ.. అధిష్టానం తీరుపై నేతల గుస్సా..
అసలు సమస్యను ఎమ్మెల్యేకి వివరించకుండా… సగం మేటర్ చెప్పి ఆయన చేతిలో ఫోన్ పెట్టడం, ఆ ఊపులో దగ్గుపాటి ఆగ్రహంతో నోటికి పనిచెప్పి ఇరుక్కుపోవడం కామన్‌గా మారిపోయాయట. ఇలాంటి వాటివల్లే సమస్యలు పెరుగుతున్నాయట. రెండు వారాలుగా ఎమ్మెల్యే అనుచరుల్లో గంగారాం సహా మరి కొందరు వరుసగా అరెస్ట్ అవుతున్నారు. వీటన్నింటి వెనుక సొంత పార్టీ నేతలే ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ఆడియో లీక్‌లు, కబ్జాల వ్యవహారాలు ఇంత పీక్స్‌కు చేరడానికి కారణం మనోళ్ళేనంటూ ఇటీవల సన్నితుల దగ్గర వాపోయారట ఎమ్మెల్యే. ఎమ్మెల్యే కావడం ఈజీనే కానీ.. డీల్ చేయడం అంత ఈజీ కాదని దగ్గుపాటి మా సార్‌కి ఇప్పుడిప్పుడే బోధపడుతోందని అంటున్నారు దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు.
తాజావార్తలు
-
Prabhas : ప్రభాస్- ఓం రౌత్ .. అంతా ఒట్టిదే
-
Mahua Moitra: కోర్టు విచారణకు డుమ్మా.. మహువా మొయిత్రాపై అరెస్ట్ వారెంట్ జారీ
-
Homemade Olive Oil: ఖరీదైన ఆలివ్ ఆయిల్‌కు గుడ్‌బై.. ఇంట్లోనే తయారు చేసుకునే సింపుల్ పద్ధతి ఇదే!
-
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్‌లో ఆ 22 నిమిషాలు.. పాక్ స్పందించేలోపే సుఖోయ్ దాడి పూర్తి!
-
Telangana: సినిమా టికెట్లపై సరికొత్త జీవో: ‘స్పెషల్ థియేటర్స్’ కేటగిరీ.. రోజూ 5 షోలకు గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!