Site icon NTV Telugu

Off The Record: అక్కడ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేలు..!

Anantapur

Anantapur

Off The Record: ఒక పార్టీకి చెందిన నాయకుడు ఎంపీగా ఉండి….. ఆ పరిధిలో వేరే పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉంటే….ఆ లోక్‌సభ నియోజకవర్గం వ్యవహారాలు అంత సవ్యంగా జరగవన్నది సహజం. కానీ… అంతా ఒకే పార్టీ వాళ్ళయి ఉండి కూడా తేడాలు జరుగుతుంటే… దాన్నేమనాలి? అలాంటి ప్రశ్నలే వస్తున్నాయట ప్రస్తుతం అనంతపురం నియోజకవర్గం ప్రజలకు. టీడీపీ నుంచి గెలిచిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు, తన పరిధిలోని అదే పార్టీ ఎమ్మెల్యేలకు మధ్య అస్సలు పొసగడం లేదని చెప్పుకుంటున్నారు. అసలు ఏ ఎమ్మెల్యేతోనూ ఆయనకు పొసగడం లేదని అంటున్నారు. ఇంతకీ ఎందుకింత గ్యాప్ అంటే…. మేటర్‌ చాలానే ఉందన్నది లోకల్‌ వాయిస్‌. అంబికా లక్ష్మీనారాయణ రాజకీయాలకు కొత్త కాదు.. తెలుగుదేశం పార్టీకి కూడా కొత్త కాదు. కాకుంటే అనంతపురానికి కొత్త. హిందూపురం ఏరియాకు చెందిన లక్ష్మీనారాయణ గత ఎన్నికల్లో ఇక్కడికొచ్చారు.వాస్తవానికి ఆయన హిందూపురం ఎంపీ టికెట్ ఆశించారు. అయితే…. పెనుకొండ అసెంబ్లీ సీటు ఇవ్వలేదన్న కారణంతో అసంతృప్తిగా ఉన్న పార్థసారథిని సంతృప్తి పరిచేందుకు ఆ లోక్‌సభ సీటు ఇవ్వాల్సి వచ్చింది. దాంతో అంబికాను అనంతపురం షిఫ్ట్‌ చేశారు. లక్ష్మీనారాయణది బోయ సామాజికవర్గం కావడం, ఈ నియోజకవర్గం పరిధిలో ఆ కులం ఓటర్లే ఎక్కువగా ఉండటం, ఇద్దరు అదే సామాజిక వర్గ నేతలకు అసెంబ్లీ టికెట్స్‌ రావడం లాంటి కారణాలతో పాటు… టీడీపీ వేవ్‌లో అవలీలగా గెలిచేశారాయన. ఎన్నికలకు ముందు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరుగుతూ అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి ప్రచారం చేశారు.

Read Also: Udayabhanu : ఆర్టిస్టుల ఆకలి తీర్చే పాత్రలో నటించా!

అప్పుడంతా… ఆహా, ఓహో అనుకున్నారు. ఈ ఐకమత్యాన్ని చూడ్డానికి రెండు కళ్ళు చాలడం లేదని కూడా చెప్పుకున్నారు. కానీ… అదంతా గెలిచేవరకే. వన్స్‌ ఐ స్టెపిన్‌… అని బాలకృష్ణ సినిమా డైలాగ్‌ చెప్పినట్టుగా… వీళ్ళు కూడా… వన్స్‌ గెలిచేశాక మొత్తం సినిమానే మారిపోయింది. మొత్తం రివర్స్ అయిపోయి ఎవరికి వారే అన్నట్టుగా ఉందట వ్యవహారం. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో కీలకంగా ఉంటున్నారు సరే….అక్కడెక్కడా ఎంపీని అడుగు పెట్టనివ్వడం లేదట. ఎంపీ అయితే ఏంటి? మా సెగ్మెంట్స్‌లో నీకేం పని అని అంటున్నట్టు సమాచారం. అంబికా లక్ష్మీనారాయణకు దాదాపు అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో నో ఏంట్రీ బోర్డ్ పెట్టినంతగా నడుస్తోందట కథ. అనంతపురం అర్బన్, శింగనమల, అప్పుడప్పుడు గుంతకల్లు, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో మాత్రం కాస్తో కూస్తో కనిపించే వారు. ఇక మిగిలిన చోట్లకు వెళ్లిన సందర్భాలను వేళ్ళమీదే లెక్కించవచ్చంటున్నారు. దాంతో ఎంపీ ఇక లాభం లేదనుకుని తన సొంత కార్యక్రమాలు రూపొందించుకుంటున్నారని, అది గ్యాప్‌ను ఇంకా పెంచుతోందని చెప్పుకుంటున్నారు. ఇటీవల అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కొన్ని కార్యక్రమాలకు ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా, ఆయనకు సమాచారం లేకుండా హాజరయ్యాకు ఎంపీ. దాంతో ఇద్దరి మధ్య గ్యాప్ ఇంకా పెరిగినట్టు అంచనా వేస్తున్నారు పరిశీలకులు. ఎంపీ అంబికా కార్యాలయం, నివాసం అన్నీ అనంతపురంలోనే ఉన్నాయి. ఆయన కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే జరుగుతుంటాయి.

Read Also: Chain Snatching: చైన్ స్నాచింగ్ గ్యాంగుల బెడద.. ఏకంగా కాంగ్రెస్ ఎంపీ చైన్ కొట్టేశారు..

కానీ… ఏం చేసినా లోకల్‌ ఎమ్మెల్యేతో సంబంధం లేకుండానే జరుగుతోంది. నియోజకవర్గంలో ఏ ముఖ్య కార్యక్రమం జరిగినా ఎంపీ అటెండ్ అవుతున్నారు. అలాగే ఇటీవల గుంతకల్ సెగ్మెంట్‌లో వ్యక్తిగత కార్యక్రమంతో పాటు గవర్నమెంట్‌ ప్రోగ్రామ్‌లో కూడా పాల్గొన్నారాయన. కానీ ఇక్కడ కూడా స్థానిక నేతలు పాల్గొనకపోవడం చర్చనీయాంశం అయింది. ఇలా… స్థానిక నేతలు, ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా ఎంపీ… సొంత అజెండాతో ముందుకు పోవడం నియోజకవర్గంలో హాట్‌ టాపిక్‌ అవుతోంది. ఈ గ్యాప్ కు గురించి అధిష్టానంకి తెలిసినా…. రెండు వైపుల నుంచి ఫిర్యాదులు లేకపోవడంతో పెద్దలు కూడా చూసీ చూడనట్టు వెళ్తున్నారట. కానీ… ఇలాగే చూస్తూ వదిలేస్తే… ఏదో ఒక రోజు ఉరుములేని పిడుగులా ఏదో ఒక అసెంబ్లీ సెగ్మెంట్‌లో గట్టి తేడా కొడుతుందన్న భయాలు ఉన్నాయి కేడర్‌లో.

Exit mobile version