Site icon NTV Telugu

Off The Record: బీఆర్ఎస్ పార్టీ యాక్షనేంటి?

Maxresdefault (2)

Maxresdefault (2)

అసంతృప్త…అసమ్మతి నేతల అంశాన్ని బీఆర్ఎస్ ఏం చేయనుంది ? అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో…ఆ నేతలను గులాబీ పార్టీ బుజ్జగిస్తుందా ? అవసరం లేదనుకుని లైట్ తీసుకుంటుందా ? ఈ నేతల విషయంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలన్న దానిపై…టిఆర్ఎస్ పెద్దలు వెయిట్ చేస్తున్నారా ?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు…షెడ్యులు ప్రకారం ఈ ఏడాది చివరిలో జరగనున్నాయ్. వచ్చే ఏడాది పార్లమెంట్‌ ఎన్నికలు ఉన్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీలో…అప్పడే అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఎమ్మెల్యేలు నియెజకవర్గాల్లో … విస్తృతంగా పర్యటించే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు వైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా అభివృద్ది కార్యక్రమాలను వడివడిగా పూర్తి చేసే పనిలో ఉంది. దీంతో అధికార బీఆర్ఎస్ పార్టీలోని నేతలు…అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత…కొంతకాలం సైలెంట్‌గా ఉన్న అసంతృప్త నేతలు మళ్లీ యాక్టివ్ అవుతున్నారట. ఇప్పుడు కాస్త స్వరం పెంచి…తాము ఏం చేయాలనుకుంటున్నారో చెప్పకనే చెప్పే పనిలో ఉన్నారట. దీంతో అధికార పార్టీలో… ఈ నేతల తీరుపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని కొందరు నేతలు డిసైడ్ అయ్యారట. ఉన్న పార్టీ నుంచి టికెట్‌ సాధించి పోటీ చేయాలా లేదంటే…మరో పార్టీనా అన్నది మాత్రం సదరు నేతలు బయటికి చెప్పకుండా జాగ్రత్త పడుతున్నారట. ఉమ్మడి మహబుబ్ నగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల బీఆర్ఎస్‌ నేతలు…శ్రేణులతో యాక్టివ్‌గా వ్యవహరిస్తున్నారట. కొంత కాలంగా ఈ జిల్లాల్లోని అసంతృప్త నేతలు…తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల వరకు సొంతంగా నియెజకవర్గాల్లో పట్టునిలుపుకుంటే…ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవచ్చన భావనంలో నాయకులు ఉన్నారట. సొంతంగా జనంలోకి వెళ్తున్న నేతలు…తమ రాజకీయ ప్రయాణంపై నర్మగర్బ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.

బీఆర్ఎస్‌లోని అసంతృప్త, అసమ్మతి నేతల తీరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగా మారుతోందట. ఒక వైపు అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమయ్యే క్రమంలో…సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు ఎదురవుతుండటంతో…శాసనసభ్యులకు మింగుడు పడడం లేదట. వీలైనంత తొందరగా అసంతృప్తుల విషయంలో… పార్టీ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోందట. తాజాగా అసంతృప్త, అసమ్మతి నేతల వ్యవహారశైలిపై… గులాబీ పార్టీ అధిష్టానం లెక్కలు వేసుకుంటోందట. వీరిపై సరైన సమయంలో నిర్ణయం తీసుకునే యోచనలో బీఆర్ఎస్ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆ నిర్ణయం పార్టీకి నష్టం జరగకుండా ఉండేలా అడుగులు వేయాలన్న అలోచనలో.. బీఆర్ఎస్ అధిష్టానం ఉందట. మరి అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో…బీఆర్‌ఎస్‌ వ్యూహాలు ఎలా ఉంటాయన్నది వేచి చూడాలి.

Exit mobile version