చంద్రబాబును, లోకేష్‌ను తిట్టిపోస్తున్న మంత్రి కొడాలి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి కొడాలి నాని మైక్ ముందుకు వస్తే.. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌లను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోస్తున్నారు. నాని విమర్శలకు టీడీపీ నుంచి కౌంటర్లు లేవు. మాజీలు, సీనియర్లు సైలెంట్. తెలుగుదేశంలో ఉన్న అదే సామాజికవర్గం నేతలూ పెదవి విప్పడం లేదు. మనకెందుకులే అని అనుకుంటున్నారా? నానితో పెట్టుకుంటే కష్టమని డిసైడ్ అయ్యారా? కొడాలికి కౌంటర్ ఇవ్వడంపై పార్టీలో ఏమనుకుంటున్నారు?
టీడీపీ నుంచి మంత్రి కొడాలికి కౌంటర్ లేదు
Also Read
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లపై మంత్రి కొడాలి నాని ఎప్పుడూ ఘాటు వ్యాఖ్యలే చేస్తుంటారు. మాజీ సీఎం పేరు ఎత్తితే చాలు.. కొడాలి కస్సుమంటారు. ఇక లోకేష్ గురించి అయితే చెప్పేదే లేదు. సాధారణ రాజకీయ విమర్శలు కాకుండా.. కొన్ని సందర్భాల్లో కంట్రోల్ తప్పారా? అన్నట్టు తీవ్ర వ్యాఖ్యలు చేస్తారు. రానురాను వాటి మోతాదు కూడా మించి పోతుంది. కర్నూలు జిల్లాలో హత్యకుగురైన టీడీపీ నేతల కుటుంబాల పరామర్శకు వెళ్లిన లోకేష్ సీఎం జగన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇలా లోకేష్ అనడం.. మంత్రి నాని రంగంలోకి దిగడం.. తనదైన స్టయిల్లో దుమ్ముదులిపేశారు. లోకేష్‌లాగే.. నానీ కూడా డోస్ పెంచేశారు. అయితే ఇంత జరుగుతున్నా టీడీపీ నుంచి మాత్రం మంత్రికి కౌంటర్ దొరకడం లేదు.
ఎవరూ పట్టించుకోవడం లేదన్న బాధే టీడీపీ కేడర్‌లో ఎక్కువగా ఉందా?
దేవినేని ఉమా మాట్లాడినా.. జనాల్లోకి వెళ్లడం లేదు
నాని వ్యాఖ్యలను టీడీపీ నాయకులు లైట్ తీసుకోవడంపై కార్యకర్తలు బాగా ఫీల్ అవుతున్నారట. మంత్రి వ్యాఖ్యలకు రియాక్ట్ అవ్వాల్సిన స్థాయిలో టీడీపీ నేతలు నోరెత్తడం లేదు. నాని తిట్టిన వాటికంటే.. పార్టీలో ఎవరూ పట్టించుకోవడం లేదు అనే లెక్కే వారిని ఎక్కవ బాధిస్తుందట. ముఖ్యంగా టీడీపీలో ఉండే సీనియర్ నేతలు, అదే సామాజికవర్గానికి చెందిన నాయకులు పూర్తిగా మౌనం దాల్చుతున్నారు. తిట్టింది మనల్ని కాదు.. అధినేతనే కదా.. అంటూ వారు తప్పించుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. మంత్రి కొడాలి ఏస్థాయి కామెంట్స్ చేసినా సీనియర్ నేతలు కిక్కిరుమనడం లేదు. అప్పుడప్పుడు దేవినేని ఉమా మాట్లాడినా అవి పెద్దగా జనంలోకి పోవడం లేదు. పార్టీలోను రాజకీయంగానూ ప్రాధాన్యమూ లభించడం లేదు. అసలు కొడాలికి కౌంటర్ ఇచ్చే నేతలే పార్టీలో దొరకడం లేదట. యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావు లాంటివాళ్లు నానీపై ప్రతివిమర్శలు చేయడానికి సీనియారిటీని సాకుగా చెబుతుంటారు. అందుకే వాళ్లు కొడాలిపై మాట్లాడలేరు. సీనియర్ల సంగతి అలా ఉంటే.. ఇతర మాజీ మంత్రులు, నాయకులు తమకెందుకులే అని సైలెంట్‌గా ఉంటున్నారు.
read also : గుడ్ న్యూస్ : భారత్‌లోకి త్వరలో ఫైజర్ టీకా
నాని జోలికి వెళ్లితే చాకిరేవు తప్పదని భయపడుతున్నారా?
పక్క జిల్లాలో ఉన్న పుల్లారావు, యరపతినేని వంటి వారు అస్సలు పట్టించుకోవడం లేదు. మొదట్లో కొద్దిరోజులు మాజీ ఎమ్మెల్యే యరపతినేని ఆ ప్రయత్నం చేసినా ఇప్పుడు వదిలేశారు. ఇక ఇతర జిల్లాల్లో ఉన్న అదే సామాజికవర్గ నేతలు కూడా పట్టి పట్టనట్టు ఉంటున్నారు. మనకెందుకులే అనే భావన ఒకటైతే.. నానికి కౌంటర్ అనగానే నేతలు భయపడుతున్నారు. నాని జోలికి వెళ్తే తమకు ఎక్కడ చాకిరేవు పడుతుందోనని .. లేదా మనదికాని విషయంలో వేలు పెట్టడం అవసరమా? అని నోరెత్తడం లేదట.
నానితో పోటీపడలేమంటున్న అదే సామాజికవర్గం నేతలు!
కొందరేమో నాని ఉపయోగించే రేంజ్‌లో పదాలు మనం మాట్లాడలేం కదా అని ఆ బాధ్యత వేరే వారికి ఇచ్చేస్తున్నారు. వైసీపీ నుంచి ఎవరు మాట్లాడినా టీడీపీ నుంచి రియాక్షన్ ఉంటుంది. కానీ, కొడాలి మాట్లాడితే మాత్రం కౌంటర్ ఉండదు. ఈ పరిణామం పార్టీ క్యాడర్‌లో అసంతృప్తికి కారణం అవుతోంది. ఎవరు ఏం అనుకున్నా మేం మాత్రం నానిపై మాట్లాడలేమంటున్నారు టీడీపీలోని అదేవర్గానికి చెందిన నేతలు. తాము భయపడ్డాం అనుకున్నా పర్వాలేదు కానీ.. నాని లాంటి వ్యాఖ్యలతో, నాని చేసిన కామెంట్స్‌తో తాము పోటీ పడలేమని కామైపోతున్నారు.
టీడీపీ ద్వితీయశ్రేణి నేతల్లో పెద్ద చర్చే జరుగుతోందా?
ఒకవేళ ఎవరైనా కొడాలి విమర్శలపై మాట్లాడినా చిన్నాచితకా నేతలతో సరిపెడుతున్నారు. పదవులు కోసమే తామున్నాం.. పార్టీ లైన్‌లో మాట్లాడటానికి కాదన్నట్టుగా మారిపోయింది టీడీపీలోని ఆ సామాజికవర్గ నేతల పరిస్థితి. ఈ పరిణామాలపై పార్టీ ద్వితీయశ్రేణి నేతల్లో పెద్ద చర్చే జరుగుతోంది. తమకు మంత్రిని తిట్టే స్థాయిలేదని.. స్థాయి ఉన్న మాజీ మంత్రులు, సీనియర్లు పలాయనం చెయ్యడంపై టీడీపీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా.. కొడాలికి కౌంటర్ ఇచ్చేవాళ్లు టీడీపీలో లేరన్నది సుప్పష్టం.
తాజావార్తలు
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!