Munugode By Election : మునుగోడు అభ్యర్థిని టీఆర్ఎస్ ప్రకటించబోతోందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Munugode By Election :
మునుగోడు అభ్యర్థి ఎంపికపై టిఆర్ఎస్ కసరత్తు పూర్తి చేసిందా?పార్టీ అంతర్గతంగా చేయించిన సర్వేలలో ఏ నేతకు జనం పట్టం కట్టారు?ఆశావహులను బుజ్జగించి…మునుగోడు అభ్యర్థిని టిఆర్ఎస్ ప్రకటించబోతోందా?
Also Read
మునుగోడు బై ఎలక్షన్‌పై టిఆర్ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ఒక అంచనాకు వచ్చింది. అభ్యర్థి ఎంపిక విషయంలోనూ కసరత్తు దాదాపు పూర్తి చేసిందట గులాబీ పార్టీ. పలువురి పేర్లను అభ్యర్థులుగా పెట్టి సర్వేలు చేయించి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో వారికున్న ఇమేజ్‌పై ఒక అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. మునుగోడు బై ఎలక్షన్‌కు అభ్యర్థి విషయంలో టిఆర్ఎస్ దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన సీనియర్ నేతలతో చర్చలు జరిపిన తర్వాత అధికారికంగా అభ్యర్థిపై ప్రకటన చేసే అవకాశం ఉందట.
మునుగోడు అభ్యర్థి ఎంపికపై పలు రకాలుగా నివేదికలు తెప్పించుకుంది టిఆర్ఎస్. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, కర్నే ప్రభాకర్ పేర్లతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో సర్వేలు చేయించిందని సమాచారం. టిఆర్ఎస్ చేయించిన సర్వేలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డివైపే జనం మొగ్గు చూపారట. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, ఆ తర్వాత నియోజకవర్గం వదలకుండా కూసుకుంట్ల పర్యటనలు చేయడం ఆయనకు కలిసి వచ్చిందట.ఇటు నియోజకవర్గ ప్రజలకు కూసుకుంట్ల తెలిసిన ఫేస్‌గా తేలిందట. ఇటు పార్టీ అధిష్టానం కూసుకుంట్ల విషయంలో సానుకూలంగా ఉందని టాక్. దీంతో ఆశావహుల బుజ్జగింపులు పూర్తయిన తర్వాత మునుగోడు అభ్యర్థిని టిఆర్ఎస్ ప్రకటించేందుకు సిద్ధం అవుతుందట.
ఇప్పటికే పోటీకి సిద్ధం కావాలని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టిఆర్ఎస్ సంకేతాలు పంపిందట. దీంతో మునుగోడు అభ్యర్థిగా కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరు అధికారికంగా ప్రకటించడమే మిగిలిఉంది.
తాజావార్తలు
-
Kitchen Hacks: ఫ్రిజ్‌లో పెట్టిన కొత్తిమీర త్వరగా పాడవుతోందా? ఇలా చేస్తే వారాల తరబడి ఫ్రెష్‌గా ఉంటుంది!
-
SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
-
Tollywood: ఫేక్ హౌస్‌ఫుల్స్… డమ్మీ కలెక్షన్స్! టాలీవుడ్లో కొత్త “మైండ్ గేమ్”!
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
-
Plastic Currency Notes: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మార్కెట్లోకి ప్లాస్టిక్ రూ.10, రూ.20 నోట్లు..! మరి పాత నోట్ల పరిస్థితి ఏంటి..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!