Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Manchireddy Kishan Reddy

Manchireddy Kishan Reddy : ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ లో ముసలం..! ఎమ్మెల్యే పాత్ర పై హైకమాండ్ ఆరా ?

Published Date :July 23, 2022 , 4:53 pm
By Premchand Chowdary
Manchireddy Kishan Reddy : ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ లో ముసలం..! ఎమ్మెల్యే పాత్ర పై హైకమాండ్ ఆరా ?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Manchireddy Kishan Reddy : ఆ ఎమ్మెల్యేకు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ రూపంలో ముప్పు పొంచి ఉందా..? నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలకుతోడు.. హైకమాండ్‌కు ఛైర్‌పర్సన్‌ ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోందా..? కౌన్సిల్ మొత్తం పార్టీ పెద్దలను కలిసి ఏమని ఫిర్యాదు చేసింది? పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎందుకు సీరియస్‌ అయ్యారు? ఇంతకీ ఏంటా నియోజకవర్గం?

ఇబ్రహీంపట్నం టీఆర్‌ఎస్‌లో రాజకీయ ముసలం ముదిరింది. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ స్రవంతిల మధ్య ఉప్పు నిప్పులా మారిపోయింది పరిస్థితి. మున్సిపల్‌ కమిషనర్‌ దగ్గర మొదలైన గొడవ.. అటు తిరిగి ఇటు తిరిగి గాలి దుమారంగా మారి.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ KTRకు ఫిర్యాదుల వరకు వెళ్లింది. ఆయన ఆరా తీయడం.. ఇబ్రహీంపట్నం టీఆర్‌ఎస్‌ పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో గులాబీ శిబిరంలో హాట్ టాపిక్‌గా మారిపోయింది.

మున్సిపల్‌ కమిషనర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నది ఛైర్‌పర్సన్‌ స్రవంతి.. టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ల ఆరోపణ. ఉన్నట్టుండి.. స్రవంతి అవినీతికి పాల్పడ్డారని 14 మంది కౌన్సిలర్లు తిరుగుబాటు చేయడంతో రాజకీయ వేడి రగిలింది. కలెక్టర్‌కు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. దాంతో అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ మున్సిపల్‌ ఆఫీసును సందర్శించి రికార్డులు సీజ్‌ చేసి తీసుకెళ్లారు. ఆపై స్రవంతికి షోకాజ్‌ నోటీసు జారీ అయ్యింది. దీంతో ఇబ్రహీంపట్నం టీఆర్‌ఎస్‌ రాజకీయాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి.

మున్సిపల్ కమిషనర్‌ యూసఫ్‌ అధికారిగా కాకుండా రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తున్నారనేది ఛైర్‌ పర్సన్‌ స్రవంతి ఆరోపణ. తాను ఎస్టీ సామాజికవర్గం కావడంతో గౌరవం ఇవ్వడం లేదని ఆమె వాపోతున్నారు. అయితే తాజా ఎపిసోడ్‌ వెనక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పాత్ర ఉందని స్రవంతి అనుమానిస్తున్నారట. సమస్యను అక్కడితో వదిలిపెట్టకూడదని నేరుగా.. టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌.. మంత్రి KTRకు ఆమె ఫిర్యాదు చేశారు. అన్నీ అంశాలు విన్న తర్వాత.. బుడగ జంగాలు సామాజికవర్గానికి చెందిన ST మహిళా ప్రజాప్రతినిధిని వేధించడం సరికాదని భావించిన ఆయన.. సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారట. మున్సిపల్‌ కమిషనర్‌ రాజకీయాలకు అతీతంగా పనిచేసేలా చూడాలని మున్సిపల్‌ ఉన్నతాధికారులను కేటీఆర్ ఆదేశించినట్టు తెలుస్తోంది.

తాజా రగడలో విపక్షాలు కూడా ఎంట్రీ ఇచ్చేశాయి. టీఆర్‌ఎస్‌లోని కొందరు 2 కోట్ల అవినీతి అని ఆరోపణలు చేయడంతో.. కాంగ్రెస్‌, బీజేపీలకు అవి అస్త్రాలుగా మారాయి. దాంతో టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇంతలో పాలనా వ్యవహారాల్లో కమిషనర్‌ తనకు సహకరించడం లేదని అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌కు ఫిర్యాదు చేశారు ఛైర్‌పర్సన్‌ స్రవంతి. మీడియా ముందు కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. CDMA నుంచి వచ్చే ఉత్తర్వుల సమాచారం కూడా ఇవ్వడం లేదన్నది స్రవంతి వాదన. కమిషనర్‌ ఎప్పుడు ఆఫీసుకు వస్తున్నారో.. ఎప్పుడు వెళ్తున్నారో తెలియడం లేదని చెప్పారామె. ఇదంతా ఎమ్మెల్యే వెనకుండి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. దీంతో ఈ ఎపిసోడ్‌లో ఎమ్మెల్యే పాత్రపై పార్టీ అధిష్ఠానం ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. మరి.. సమస్యకు ఎలాంటి ముగింపు పలుకుతారో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ibrahimpatnam
  • K. T. Rama Rao
  • Manchireddy Kishan Reddy
  • Pratik Jain
  • Sravanthi

తాజావార్తలు

  • Instagram Subscription Trend: సబ్‌స్క్రైబర్లకు మాత్రమే.. ఇలా బరితెగిస్తే ఎలా?

  • Crude Oil: హర్మూజ్ సంక్షోభం.. చమురు ధరలు భారీగా పెంపు..

  • Tollywood : టాలీవుడ్ హీరో తండ్రి సినీ రంగ ప్రవేశం

  • Salman Khan: ఇదేం ఫ్యాషన్ భాయ్? సల్మాన్ ఖాన్ ఖరీదైన బూట్ల చెరిగినట్లు ఉన్నాయే!

  • Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలకు కేంద్ర రైల్వే శాఖ ఆమోదం.. మారనున్న ఆ రైల్వే స్టేషన్ రూపురేఖలు..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions