OTR : కేటీఆర్ పాదయాత్ర ఎప్పటి నుంచి మొదలవుతుంది..?

  • కేటీఆర్‌ పాదయాత్రపై బీఆర్‌ఎస్‌ వర్గాల్లో చర్చలు
  • జనంలోకి వెళ్ళి మమేకమై భరోసా ఇవ్వాలన్న ప్లాన్‌
  • వచ్చే ఏడాది పాదయాత్ర అని ఇప్పటికే కేటీఆర్‌ హింట్‌
  • 2027 ఫిబ్రవరి లేదా మార్చిలో కేటీఆర్ పాదయాత్రకు ఛాన్స్‌
  • కాంగ్రెస్‌ సర్కార్‌కు మూడేళ్ళు నిండినందున ఇదే రైట్‌ టైమ్‌ అన్న ఫీలింగ్‌
  • 2027 మార్చి నుంచి 2028 మార్చి వరకు ఏడాది పాటు యాత్ర?
  • యాత్రకు ముందే పార్టీ కమిటీలు వేసి వాళ్లనే ముందుపెట్టే వ్యూహం
  • రూట్‌ మ్యాప్‌పై కేటీఆర్‌ టీమ్‌ కసరత్తు?
Otr 1

Otr 1

OTR : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పాదయాత్ర ఖాయమైందా? అయితే…. ఎప్పట్నుంచి మొదలవబోతోంది? దానికి సంబంధించి జరుగుతున్న కసరత్తు ఏంటి? పాదయాత్ర ఎన్నాళ్ళు జరిగే అవకాశం ఉంది? పాత సక్సెస్‌ ఫార్ములాను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొత్తగా ఎలా ప్రజెంట్‌ చేయబోతోంది కేటీఆర్‌ టీమ్‌? తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర పొలిటికల్‌ లీడర్స్‌కు బలమైన సెంటిమెంట్‌. పవర్‌ ఛైర్‌కు అది షార్ట్‌కట్‌ అని నమ్ముతారన్నది రాజకీయ విస్తృతాభిప్రాయం. అందుకు తగ్గట్టే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలు చేసి సక్సెస్‌ అయిన వాళ్ళే అంతా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి తీసుకుంటే…. ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి, ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇలా అంతా… పాదయాత్రల తర్వాత పవర్‌ ఛైర్‌ ఎక్కిన వాళ్ళే. అదే సిరీస్‌లో ఇప్పుడు బీఆర్‌ఎస్‌ టర్న్‌ వచ్చిందంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనాసరే… తెలంగాణలో అధికార పీఠాన్ని దక్కించుకోవాలని పట్టుదలగా ఉన్న గులాబీ పార్టీ ఆ దిశగా గట్టి వ్యూహ రచనే చేస్తోందట. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్ర ప్లాన్‌ కూడా అందులో భాగమేనని అంటున్నారు. ప్రస్తుతం దీని గురించే పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అధికారం కోల్పోయిన తర్వాత… తిరిగి ప్రజల్లో పట్టు సాధించేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది బీఆర్‌ఎస్‌. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు.. హామీల అమలుపై నిలదీతలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళల సమస్యలపై పోరాటాలు.. ఇలా… ఏ అంశాన్ని వదలకుండా
ప్రజాక్షేత్రంలో ఉండేందుకు ప్రయత్నిన్నాయి గులాబీ శ్రేణులు.

ఇవన్నీ ఒక ఎత్తయితే… ప్రజలకు మరింత దగ్గర కావాలంటే…పాదయాత్రతో వాళ్ళ మధ్యకే వెళ్ళి మమేకం అవడం, సమస్యలు తెలుసుకోవడం ద్వారా మీకు నేనున్నానని భరోసా ఇవ్వడం లాంటివి చాలా ముఖ్యమని భావిస్తోందట పార్టీ అధిష్టానం. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్ర చేస్తే గులాబీ దళానికి కొత్త ఊపు వస్తుందని, అదే సమయంలో ప్రజల్లో సానుకూలత పెరుగుతుందని లెక్కలేస్తున్నారట. ఇటు కేటీఆర్ కూడా తన పాదయాత్ర విషయంలో కొన్ని హింట్స్‌ ఇచ్చారు. వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తానని కూడా ఒక సందర్భంలో చెప్పుకొచ్చారాయన. దీంతో… ఇప్పుడు మరోసారి దాని గురించిన చర్చ తెరపైకి వస్తోంది. కొత్త సంవత్సరంలో ఆయన యాత్ర ఉంటుందా? లేక ఇంకా పోస్ట్‌పోన్‌ చేస్తారా అంటూ రకరకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి పార్టీ వర్గాల మధ్య. అయితే…2027 ఫిబ్రవరి లేదా మార్చిలో కేటీఆర్ పాదయాత్ర చేయవచ్చన్నది బీఆర్‌ఎస్‌ వర్గాల ఇంటర్నల్‌ టాక్‌. అందులో భాగంగా… కేవలం రాజకీయ ప్రసంగాలకే పరిమితం కాకుండా.. గ్రామాలు, పట్టణాల్లో ప్రజలతో నేరుగా మమేకమవుతారని చెబుతున్నారు.

ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో బహిరంగ సభల ద్వారా పబ్లిక్‌లోకి వెళ్తున్న కేటీఆర్.. ఇక గ్రామస్థాయిలో కూడా కలవాలని డిసైడ్ అయినట్టు చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు దాటినందున… ఇక ప్రజా వ్యతిరేకత పెరుగుతుందని, పాదయాత్రకు ఇదే కరెక్ట్‌ టైం అని భావిస్తున్నారట బీఆర్‌ఎస్‌ పెద్దలు. వచ్చే మార్చికల్లా నియోజకవర్గాల పునర్విభజనపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి.. ఏ నియోజకవర్గంలో ఎవర్ని హైలైట్‌ చేయాలో కూడా తెలుస్తుందని అంటున్నారు. అందుకే 2027 మార్చిలో మొదలుపెట్టి… 2028 మార్చి వరకు కొనసాగేలా పాదయాత్ర రూట్‌ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నట్టు చెప్పుకుంటున్నాయి గులాబీ వర్గాలు. సాధారణ ఎన్నికలకు ఆరు నెలల ముందు యాత్ర పూర్తి చేసి ఇక మళ్ళీ జనరల్ ఎన్నికల కోలాహలంలోకి దిగే విధంగా ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. మొదలుపెట్టడానికి ముందే… పార్టీకి సంబంధించిన అన్ని కమిటీలను నియమిస్తే…. కొత్త కమిటీల్లోని వారు ఉత్సాహంగా పని చేస్తారని, పాదయాత్రను వాళ్లే ముందుకు తీసుకువెళ్తారని భావిస్తున్నారట పెద్దలు. పాదయాత్ర ప్రారంభానికి ఇంకా నాలుగు నెలల సమయమే ఉన్నందున ఇప్పటినుంచే షెడ్యూల్ తోపాటు రూట్ మ్యాప్‌పై కూడా కేటీఆర్‌ టీమ్‌ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ సూచనలు, సలహాల మేరకే తుది ప్రకటన ఉంటుందన్నది బీఆర్‌ఎస్‌ వాయిస్‌.