Komatireddy Brothers are Simultaneously creating Political Heat …! : భవిష్యత్ రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య పోరాటం తప్పదా? వారు చేస్తున్న కామెంట్స్ వ్యూహాత్మకమా లేక కాకతాళీయమా? తమ్ముడు బీజేపీలోకి వెళ్లడం.. అన్న కాంగ్రెస్ కోసం పాదయాత్ర చేయడం ద్వారా ఎలాంటి సంకేతాలు వెళ్తున్నాయి? లెట్స్ వాచ్..!
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని చర్చ జోరందుకుంది. కాంగ్రెస్‌ను వీడీ బీజేపీలో చేరబోతున్నట్టు స్వయంగా రాజగోపాల్‌రెడ్డే చెప్పడంతో చేరే ముందు ఆ ప్రకటన కూడా ఉంటుందని భావిసస్తున్నారు. కొద్దిరోజులుగా ఊగిసలాటగా మారిన ఈ ఎపిసోడ్‌కు ఎండ్‌కార్డు ఎప్పుడన్నది ఆయన చేతిలోనే ఉంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రెండు నెలల్లోనే మునుగోడుకు ఉపఎన్నిక వస్తుందనేది కొందరి లెక్కలు. ఇదే సమయంలో రాజగోపాల్‌రెడ్డి అన్న కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దసరాకు భూదాన్ పోచంపల్లి నుంచి పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు. ఇలా అన్నదమ్ములిద్దరూ ఒకేసారి రాజకీయాల్లో కాక రేపుతున్నారు.
తెలంగాణలో టీఆర్ఎస్‌ను ఎదుర్కొనే బలం కాంగ్రెస్ దగ్గర లేదని.. ఆ సత్తా బీజేపీకే ఉందని రాజగోపాల్‌రెడ్డి చెబుతున్నారు. ఇంచుమించు వెంటరెడ్డి సైతం ఇలాంటి ప్రకటనలే చేస్తున్నారు. కాకాపోతే అన్నది కాంగ్రెస్ పార్టీ లైన్. తెలంగాణ కోసం వందల మంది బలిదానం చేశారని.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో టీఆర్‌ఎస్ సర్కార్ విఫలమైందని.. వాటిని ప్రశ్నిస్తూ పాదయాత్ర చేస్తానని అన్న చెబుతున్నారు. ఇక్కడే మెలిక ఉందనేది పొలిటికల్ సర్కిళ్లలో జరుగుతున్న చర్చ. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేస్తే అక్టోబరులో ఉపఎన్నిక వస్తుందన్నది ఒక అంచనా.. అదే నెలలో దసరా. అంటే అన్నదమ్ములిద్దరూ చేరో అంశంపై రోడ్డుక్కుతారన్నమాట.
ఉపఎన్నిక జరిగితే పీసీసీ స్టార్ క్యాంపైయినర్‌గా ఉన్న వెంకటరెడ్డిని రంగంలోకి దింపాలని కాంగ్రెస్ చూస్తోంట. ఇది ఆయన్ని ఇరుకున పెట్టేలా పార్టీలో ఒక వర్గం వేస్తున్న ఎత్తుగడగా అనుమానిస్తున్నారు. అందుకే వారి వ్యూహానికి చిక్కకుండా అన్న పాదయాత్రకు ప్లాన్ చేసుకుంటున్నారా అనే సందేహాలు ఉన్నాయట. పైగా సోదరులు ఇద్దరూ వేర్వేరుగా ప్రకటనలు చేసినా.. వారి ఉద్యమ సారాంశం ఒకటే కావడంతో.. వారి అడుగులు వ్యూహాత్మకమా.. లేక అంతర్గతంగా కలిసే అడుగులు పడుతున్నాయా అనే ప్రశ్నలు ఉన్నాయట.
రాజకీయాలలో కోమటిరెడ్డి బ్రదర్స్‌ను వారి అనుచరులు.. ప్రజలు వేర్వేరుగా చూడరనే టాక్ ఉంది. అందుకే వారు విడివిడిగా ప్రకటనలు చేసినా.. అందులోని సారాంశం ఒకటే కావడంతో .. ఆ పోరాటాలను ఒక్కటిగానే చూస్తున్నారట. తమ్ముడి నిర్ణయం.. అన్న పాదయాత్ర కాకతాళీయం కాకపోవచ్చని అభిప్రాయ పడుతున్నారట. మొత్తానికి ఒక రోజు అటూ ఇటూగా కోమటిరెడ్డి సోదరులు చేసిన ప్రకటనలు వెనక భవిష్యత్ రాజకీయ ఎత్తుగడ ఉందనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. అందుకే రోజులు గడిచే కొద్దీ అన్నదమ్ముల మధ్య రాజకీయం ఆసక్తికరంగా ఉంటుందని.. మరింత రసవత్తంగా మారుతుందని భావిస్తున్నారట. మరి.. అన్నదమ్ముల పోరాటం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.