Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Ias Officers Cadre Problems In Ap And Telangana

Off The Record: సామాను సర్దుకోవాల్సిందేనా?

Published Date :January 17, 2023 , 7:10 pm
By NTV WebDesk
Off The Record: సామాను సర్దుకోవాల్సిందేనా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

సీనియర్‌ IAS సోమేష్‌ కుమార్‌ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు.. తెలంగాణలోని మిగతా IASలలో ఆందోళనకు కారణమైందా? తమకూ అదే తీర్పు వస్తుందని కలవర పడుతున్నారా? కేంద్రం ప్రభుత్వం కూడా సీరియస్‌గా ఉండటంతో ఆ IASలు సర్దుకోక తప్పదా? ఇంతకీ ఎవరా IASలు?

క్యాట్‌ను ఆశ్రయించి వెసులుబాటు పొందిన అధికారులు
రాష్ట్ర విభజన సమయంలో IAS అధికారులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇందుకోసం కోసం ప్రత్యేక కమిటీని వేసి.. ఆ కమిటీ సూచనల ప్రకారం కేటాయింపులు చేశారు. అయితే ఏపీకి వెళ్లాల్సిన కొందరు IAS అధికారులు ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌.. క్యాట్‌ను ఆశ్రయించారు. దాంతో క్యాట్‌లో పిటిషన్‌ వేసిన ఆఫీసర్లకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. ఇదే విధంగా తెలంగాణకు వెళ్లాల్సిన అధికారులు సైతం వెళ్లకుండా క్యాట్‌ను వెళ్లి ఏపీలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ తరహా పిటిషన్లను కేంద్ర ప్రభుత్వం, DOPT హైకోర్టులో సవాల్‌ చేసింది. మొత్తం15 మంది IAS, IPSలపై కోర్టులో విచారణ జరుగుతోంది.

Also Read

  • Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
  • Off The Record : పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య మంటలు
  • Off The Record : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా గ్రీన్ సిగ్నల్ వస్తుందా?
  • Off The Record : ఎమ్మెల్యే పేరు చెప్పి పత్తిపాడు నియోజకవర్గంలో కమీషన్ల దందా

హైకోర్టు తీర్పుతో మిగతావాళ్ల సంగతేంటి?
ఇటీవల సీనియర్ IAS సోమేష్‌కుమార్‌ విషయంలో హైకోర్టులో స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అప్పీలుకు వెసులుబాటు చిక్కలేదు. తీర్పు వచ్చిన కొన్ని గంటల్లోనే సోమేష్‌కుమార్‌ను ఏపీకి వెళ్లాలని DOPT కూడా ఆదేశాలు జారీ చేసింది. దాంతో సోమేష్‌కుమార్‌ ఏపీకి వెళ్లక తప్పలేదు. ఇప్పుడు మిగతా IAS, IPS అధికారులపై ఫోకస్‌ మళ్లింది. వారి సంగతి ఏంటి అని చర్చిస్తున్నారు. ఆ అధికారులు కూడా వెళ్లక తప్పదనే అభిప్రాయం అధికారవర్గాల్లో ఉంది.

వెళ్లక తప్పదని మానసికంగా సిద్ధమయ్యారా?
సోమేష్‌ కుమార్‌ కాకుండా తెలంగాణలో పనిచేస్తున్న మరో ఐదుగురు IASలు ఏపీకి వెళ్లాల్సింది ఉంది. వారిలో వాకాటి కరుణ, వాణి ప్రసాద్‌, రోనాల్డ్‌రాస్‌, ప్రశాంతి, ఆమ్రపాలి ఉన్నారు. వీరిలో వాకాటి కరుణ విద్యాశాఖ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. వాణి ప్రసాద్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సెక్రటరీగా పనిచేసి ప్రస్తుతం EPTRIలో ఉన్నారు. రోనాల్‌ రాస్‌ ఆర్థిక శాఖలో పనిచేస్తున్నారు. ప్రశాంతి అటవీశాఖలో ఉన్నారు. సోమేష్‌కుమార్‌ విషయంలో హైకోర్టు తీర్పు చూశాక.. తమ విషయంలోనూ అదే జరుగుతుందని ఈ అధికారులు అనుకుంటున్నారట. ఈ రోజు కాకున్నా.. రేపైనా ఏపీకి వెళ్లక తప్పదని మానసికంగా సిద్ధమైనట్టు సమాచారం.

ఏపీలోని తెలంగాణ కేడర్‌ అధికారులు సర్దుకోవాల్సిందేనా?
ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసేది ఏమీ ఉండబోదని.. కోర్టు కేసులను అధికారులు వ్యక్తిగత హోదాలోనే ఎదుర్కోవాలి… కోర్టు ఖర్చులు సొంతంగానే భరించాలి. ఇప్పుడు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందనే నమ్మకం కూడా పోయిందని వాళ్లు అనుకుంటున్నారట. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ కేడర్‌ అధికారులు కూడా పెట్టేబేడా సిద్ధం చేసుకోవాల్సిందేనని సచివాలయ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ias officers
  • off the record
  • Somesh Kumar
  • telangana

తాజావార్తలు

  • Garuda Purana: చనిపోయిన తర్వాత 13 రోజులు ఆత్మ ఎక్కడ ఉంటుంది? గరుడ పురాణం చెప్పిన నిజం!!

  • Varanasi :మెక్సికోలో రాజమౌళి మేజిక్ షురూ.. CCXP వేదికపై ‘వారణాసి’ ఎక్స్‌క్లూజివ్ గ్లింప్స్!

  • AK47 : ఆదర్శ కుటుంబం’ టీమ్ నుంచి వెదొలగిన హర్షవర్ధన్ రమేశ్వర్.

  • Tamil Nadu Election: 9 గంటలకే తమిళనాడులో భారీ పోలింగ్.. కారణమిదేనా?

  • 8-Week OTT: ఓటీటీ రిలీజ్ గ్యాప్‌పై సౌత్ నిర్మాతల సంచలన నిర్ణయం..

ట్రెండింగ్‌

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions