Site icon NTV Telugu

Off The Record: ఆకుల లలితకు వ్యతిరేకంగా జిల్లా కాంగ్రెస్ నేతలు జట్టుకట్టారా?

Akula

Akula

Off The Record: ఆ మహిళా నేతకు వ్యతిరేకంగా జిల్లా నేతలు మొత్తం జట్టు కట్టారా? జడ్పీ పీఠం కోసం ఆమెకు రిజర్వేషన్స్‌ కలిసొచ్చినా… లోకల్‌ కాంగ్రెస్‌ లీడర్స్‌ మాత్రం కుదరదంటే.. కుదరదంటూ మోకాలడ్డుతున్నారా? కాదు కూడదని పెద్దలు ఆమెనే ఛైర్‌పర్సన్‌గా ప్రొజెక్ట్‌ చేస్తే.. ఓడించి తీరతామని శపథం చేస్తున్నారా? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? ఎందుకలా మారిపోయింది?

Read Also: Off The Record: దానం నాగేందర్ కు ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా పోయేలా ఉందా?

నిజామాబాద్ జిల్లా పరిషత్‌ పీఠం.. ఈసారి బీసీ మహిళకు రిజర్వ్‌ అయింది. ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్‌ తీసుకోకూడదని, దీన్ని కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది అధికార కాంగ్రెస్‌ పార్టీ. అందుకే గెలుపు గుర్రాలపై సీరియస్‌గా ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలోనే.. ప్రధాన పోటీ దారుగా రేస్‌లోకి దూసుకొచ్చారు మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత. నేనున్నానంటూ అగ్ర నాయకత్వానికి కూడా సంకేతాలు పంపారట ఆమె. లలిత సొంత మండలం బీసీ మహిళకు రిజర్వ్ అవడం, జడ్పీ పీఠం కూడా సేమ్‌ కేటగిరీలో ఉండటం తనకు కలిసొస్తుందన్నది మాజీ ఎమ్మెల్యే లెక్కగా తెలుస్తోంది. కానీ, ఇక్కడే ఎక్కాల పుస్తకం ఓపెన్‌ చేస్తున్నారట జిల్లా కాంగ్రెస్‌ నాయకులు. ఆకుల లలిత గతాన్ని తవ్విపోస్తూ.. అన్ని రకాల లెక్కల్ని తెర మీదికి తెస్తున్నట్టు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో లలితను జడ్పీ ఛైర్‌పర్సన్‌ అభ్యర్థిగా అంగీకరించే ప్రసక్తే లేదని.. అంతా కలిసి పీసీసీ అధ్యక్షుడికి తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో, ఇప్పుడు జిల్లా కాంగ్రెస్‌లో మాజీ ఎమ్మెల్యే వర్సెస్‌ అదర్స్‌ అన్నట్టుగా మారిపోయిందట రాజకీయం. అక్కడితో ఆగకుండా.. లలితకు బదులు మరో మాజీ ఎమ్మెల్యే భార్యను ఛైర్‌పర్సన్‌ అభ్యర్ధిగా ప్రకటించాలని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీకి ఝలక్‌ ఇచ్చిన ఆకుల లలితకు బదులు అహర్నిశలు కష్టపడ్డ వారికి అవకాశం కల్పించాలని కోరుతున్నారట.

Read Also: Dussehra 2025: దసరా రోజు పాలపిట్టను చూస్తే మంచిదా? అసలు మ్యాటరేంటంటే..

దీంతో ఆలోచనలో పడ్డ పార్టీ పెద్దలు సైతం ఆచితూచి అడుగులేయాలనుకుంటున్నట్టు సమాచారం. మాజీ ఎమ్మెల్యే అభ్యర్ధనను ఓకే చేయలేక..మిగతా ముఖ్య నేతల వినతిని తిరస్కరించలేక.. సతమతం అవుతున్నారట. అదే సమయంలో అసంతృప్తి చెలరేగకుండా జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ తరపున ఎంపీటీసీగా రాజకీయ ప్రస్ధానం మొదలు పెట్టారు లలిత. 2003లో ఎంపీపీగా, 2005లో జడ్పీటీసీగా ఎన్నికయ్యారామె. 2008 ఉప ఎన్నికల్లో డిచ్‌పల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2015లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు లలిత. జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా, రాష్ట్ర పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయాక… గులాబీ గూటికి చేరిపోవడమే ప్రస్తుత అభ్యంతరాలకు కారణమని చెప్పుకుంటున్నారు. అన్ని రకాలుగా పార్టీ పదవులు అనుభవించి… కష్ట కాలంలో మాత్రం వదిలేసి వెళ్లి కోలుకోలేని దెబ్బతీశారన్నది ఆమె మీద మిగతా నేతల ఆగ్రహం. తర్వాత బీఆర్‌ఎస్‌ నుంచి తిరిగి కాంగ్రెస్‌లో చేరే ప్రయత్నాన్ని అప్పట్లోనే వ్యతిరేకించారు చాలా మంది జిల్లా నాయకులు.

Read Also: కొత్త బ్రేకింగ్ సిస్టమ్, డిజైన్ అప్‌గ్రేడ్లతో వచ్చేసిన 2025 TVS Raider 125

అయితే, ఆమె మాత్రం.. ఢిల్లీ వేదికగా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో 2023లో మరోసారి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆమె కారణంగానే… దివంగత నేత డీఎస్ హస్తం పార్టీకి దూరమయ్యారనే ప్రచారం సైతం ఉంది. ఈ క్రమంలో ఆమె తిరిగి పార్టీలో చేరినా.. ఏ అవకాశం దక్కకుండా చేస్తున్నారట సీనియర్ లీడర్స్‌. అసలామె స్థానిక ఎన్నికల్లో పోటీ చేయబోరని ఓ వర్గం ప్రచారం చేస్తుండగా.. ఇంకో వర్గం మరో అడుగు ముందుకేసి ఆమెకు తప్ప ఎవరికైనా ఓటేయడానికి ఓకే అంటున్నారట. అయినాసరే… వీటన్నిటితో నిమిత్తం లేకుండా… లలిత మాత్రం పోటీకి సిద్ధమవుతున్నట్టు సమాచారం. జడ్పీ ఛైర్మన్ రేస్‌లో నేను ఉన్నానని సన్నిహితులతో చెబుతున్నారట. తాను ఎంత ప్రయత్నించినా ఒకవేళ హస్తం పార్టీ తరపున కుదరకుంటే.. మరో జాతీయ పార్టీ నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందని కూడా ఆలోచిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. దీంతో ఫైనల్‌గా లలిత ఏ పార్టీ తరపున బరిలో ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version