GHMC బీజేపీ కార్పొరేటర్ల ఓవర్ యాక్షన్..డబ్బు కోసం బెదిరింపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ నుంచి 48 కార్పొరేటర్లు గెలిచారు. గతంతో పోల్చితే ఈ సంఖ్య ఎక్కువే. ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా.. ఆనాడు టికెట్లు ఇచ్చింది పార్టీ. అప్పుడు కొత్తగా బీజేపీ కండువా కప్పుకొన్నవాళ్లూ GHMC ఎన్నికల్లో కార్పొరేటర్లు అయ్యారు. దీంతో హైదరాబాద్‌లో బీజేపీ బలపడటానికి అవకాశాలు ఉన్నాయని కమలనాథులు లెక్కలేసుకుంటున్నారు. అయితే క్షేత్రస్థాయిలో కొందరు కార్పొరేటర్లు చేస్తున్న పనులు అసలుకే ఎసరు పెట్టేలా ఉన్నాయని ఆందోళన చెందుతున్నారట నాయకులు.
వాస్తవానికి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంటే ఇటీవల కాలంలో అర్థం మారిపోయింది. చిన్న చిన్న పనులకు కూడా కొందరు డబ్బులు తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. కొన్నిచోట్ల ఇలాంటి ఘటనలు రచ్చ అవుతున్నాయి కూడా. ఏదైనా పర్మిషన్ కావాలంటే అక్కడి కౌన్సిలర్ లేదా కార్పొరేటర్‌కు ఎంతో కొంత సమర్పించుకోవాలని కథలు కథలుగా చెప్పుకొంటారు లోకల్ జనం. ఈ జాబితాలో బీజేపీ కార్పొరేటర్లు కూడా చేరడంతో ఉలిక్కి పడుతున్నారట పార్టీ నేతలు. నగరంలో కొత్త భవన నిర్మాణాలు జరుగుతుంటే కార్పొరేటర్లో.. లేక వారి మనుషులో అక్కడ వాలిపోతున్నారట. వాటిపై పార్టీ ఆఫీసుకు ఫిర్యాదులు వస్తున్నాయట. ఇలాగే ఉపేక్షిస్తే క్షేత్రస్థాయిలో బీజేపీ డ్యామేజీ తప్పదని.. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం పడుతుందని టెన్షన్ పడుతున్నారట నాయకులు.
Also Read
ఇటీవల GHMCకి చెందిన బీజేపీ కార్పొరేటర్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో సమావేశం అయ్యారు. అప్పటికే కొందరు కార్పొరేటర్ల చిలక్కొట్టుడుపై సమాచారం అందడంతో.. మీటింగ్‌లో సీరియస్ అయ్యారట కిషన్‌రెడ్డి. ఎవరో ఇల్లు కట్టుకుంటుంటే అక్కడికి వెళ్లి ఎందుకు డబ్బులు అడుగుతున్నారని నేరుగా ప్రశ్నించారట. మీతోపాటు.. పార్టీ కూడా బద్నాం అవుతుందని.. ఇప్పటికే చాలా ఫిర్యాదులు వచ్చాయని కేంద్రమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారట. పద్ధతి మార్చుకోవాలని.. గట్టిగానే తలంటినట్టు సమాచారం.
ఇన్నాళ్లూ బీజేపీ కార్పొరేటర్లకు ఎలా చెప్పాలా అని పార్టీ నేతలు తలపట్టుకున్నారట. ఇప్పుడు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డే ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని.. ప్రస్తావించడంతో కొంత రిలాక్స్ అయ్యారట నాయకులు. అయితే కిషన్‌రెడ్డి హెచ్చరికలు కార్పొరేటర్లపై పనిచేస్తాయా? వారిలో మార్పు వస్తుందా అన్నది అనుమానంగానే ఉందట. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తేనే రాజకీయ క్షేత్రంలో నిలుస్తామని మరికొందరు నేతలు హితవు పలుకుతున్నారట. ఇక్కడ ఇంకో గమ్మత్తు ఉంది. GHMC ఎన్నికల్లో కార్పొరేటర్లుగా పోటీ చేసిన వారిని.. ఆ తర్వాత గెలిచిన వాళ్లతోనూ అవినీతికి పాల్పడబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రమాణం చేయించారు. అయినప్పటికీ.. కొందరు బీజేపీ కార్పొరేటర్లు చిలక్కొట్టుడు షురూ చేయడం చర్చగా మారింది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు