Site icon NTV Telugu

Off The Record: దశాబ్దం తర్వాత ఆ బడా నేతలను ప్రోటోకాలే కలిపిందా?

Jupallly

Jupallly

Off The Record: భిన్న రాజకీయ ఆలోచనలకు, విభిన్న సంస్కృతులకు నిలయమైన ఆ జిల్లా లో జెండా పండుగ రోజు ఓ కొత్త దృశ్యం ఆవిష్కృతమైంది. దాని గురించే ఇప్పుడు హాట్‌ హాట్‌గా మాట్లాడుకుంటున్నారు పాలమూరు వాసులు. ఇప్పుడు కనిపించిన దృశ్యం ఒక ఎత్తయితే…దీన్ని బేస్‌ చేసుకుని పాత సీన్లన్నీ గిర్రున తిరుగుతున్నాయట జిల్లా వాసుల మనసుల్లో. ఇంతకీ ఏంటంత స్పెషల్‌ సీన్‌? ఎవరికి సంబంధించినది?

Read Also: Top Headlinews @9PM : టాప్‌ న్యూస్‌

పాలమూరు జిల్లా రాజకీయాలను శాసించే ఇద్దరు కీలక నేతలు…. జూపల్లి కృష్ణారావు, డీకే అరుణ. దాదాపు దశాబ్ద కాలం తర్వాత వీళ్ళిద్దరూ ఒకే వేదిక మీద కనిపించడం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ అయింది. గతంలో ఏ ప్రోటోకాల్‌ వివాదంతో అయితే… ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయో… ఇప్పుడు అదే ప్రోటోకాల్‌తో ఇద్దరూ ఒకే వేదిక మీద కనిపించడం గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇద్దరూ ఒకే పార్టీలో మంత్రులుగా కొనసాగి జిల్లాలో చక్రం తిప్పిన నాటి రోజులను జిల్లా ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. నాడు కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగిన ఆధిపత్య పోరు, ప్రోటోకాల్ ఇష్యూలు ఇప్పుడు తెర మీదికి వచ్చాయి. ఇద్దరూ ఒకే పార్టీలో ఉండి ప్రోటోకాల్‌ కోసం కీచులాడుకున్నా… ఆ తరువాత మారిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్‌ను వదిలి వేర్వేరు పార్టీల్లోకి మారిపోయారు. డీకే అరుణ బీజేపీలో చేరిపోగా… జూపల్లి కృష్ణారావు బీఆర్‌లోకి వెళ్ళి… తిరిగి కాంగ్రెస్‌లో చేరి ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు.

Read Also: Deva Katta: ఆదికి ఆయన కథకి ఓ బిగ్ సెల్యూట్!

కాగా, 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేశారు ఈ ఇద్దరు నేతలు. వైఎస్‌ హయాంలో కేబినెట్‌లో ఉండి.. ఆయన చనిపోయాక కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలోనూ కొనసాగారు. ఐతే అప్పట్లో వీరి మధ్య జిల్లా మీద ఆధిపత్యం కోసం కోల్డ్ వార్ నడిచేది. ఇక ప్రోటోకాల్ వివాదాల సంగతైతే చెప్పేపనేలేదు. జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఏటా ఆగస్ట్‌ 15న జెండా ఆవిష్కరణను ఇద్దరూ ప్రెస్టీజ్‌గా భావించేవారు. అప్పట్లో ఏటా అదో పెద్ద రచ్చగా ఉండేది. ఇక మారిన రాజకీయ పరిణామాలతో జూపల్లి కృష్ణారావు గులాబీ మీదుగా….తిరిగి హస్తం తీర్థం పుచ్చుకుని ప్రస్తుత కేబినెట్ మంత్రిగా ఉన్నారు. బీజేపీలో చేరిన డీకే అరుణ మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. ఎవరికి వారు వేరు వేరు పార్టీల్లో ఉండి, తిరిగి ప్రజా ప్రతినిధులుగా మారినా… ఎన్నడూ కలుసుకున్న సందర్భాలు లేవు. మాట్లాడుకోలేదు. పెద్దగా వేదికలు పంచుకోలేదు.

Read Also: Nasser Musa Killed: హమాస్ కీ లీడర్ ఖతం.. వైరల్‌గా మారిన ఐడీఎఫ్ పోస్ట్

అయితే, రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకుంటూ పోయారు. ఈ క్రమంలోనే…ఇప్పుడు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో డీకే, జూపల్లి ఒకే వేదిక మీద కనిపించడం ఆసక్తి రేపింది. ఈసారి ఇద్దరూ వేర్వేరు పార్టీల్లో, వేర్వేరు పొజిషన్స్‌లో ఉండటంతో వివాదం తలెత్తలేదని అంటున్నారు. గతంలో అంటే… ఒకే పార్టీ, ఒకే పొజిషన్‌ ఉండేది కాబట్టి గొడవలు అయ్యాయిగానీ… ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయంటున్నారు ఇదంతా చూస్తున్నవాళ్ళు. గత కొన్నేళ్లుగా ఇద్దరి మధ్య భగ్గుమనే స్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలు సాగినా….. అవన్నీ సమసిపోయినట్టు తాజా పరిణామాలు చెబుతున్నాయంటున్నారు పరిశీలకులు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నా… ఇప్పుడు ప్రజా ప్రతినిధులు గా వేదిక పంచుకోక తప్పలేదా అని కూడా మాట్లాడుకుంటున్నారు కొందరు. ఏదేమైనా…. ఇప్పుడు ఒకే వేదిక మీద కనిపించారు కాబట్టి విభేదాలు వీడి ఇద్దరూ కలిసి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తే మంచిదని అంటున్నారు స్థానికులు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న నానుడిని గుర్తు చేస్తున్నారు.

Exit mobile version