Off The Record: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టినా…. చివరికి ప్లస్సే అయిందా? ఊహించని వ్యవహారాలు ఆ పార్టీకి కలిసొచ్చాయా? సభలో అడుగు పెట్టని ప్రతిపక్ష పార్టీకి పరిస్థితులు ఎలా అనుకూలించాయి? లోపల ఏం జరిగింది? దాన్ని ఫ్యాన్ పార్టీ తనకు అనుకూలంగా ఎలా మలుచుకుంటోంది?
Read Also: PIB Fact Check: నిరుద్యోగులకు మోడీ కానుక..?
Off The Record: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సమ్‌థింగ్ స్పెషల్ అన్నట్టుగా జరిగాయి. ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం భీష్మించుకు కూర్చుని వైసీపీ సభ్యులు డుమ్మా కొట్టడంతో కూటమి సభ్యులు కొందరు ఆ పాత్ర పోషించారు. మొదట్లో బాగానే ఉన్నా.. రానురాను అదే… ప్రభుత్వానికి, ప్రత్యేకించి టీడీపీకి తలనొప్పిగా మారిందన్న అభిప్రాయం బలంగా ఉంది పొలిటికల్ సర్కిల్స్‌లో. పలువురు కూటమి ఎమ్మెల్యేలు అసలు సమస్యల్ని వదిలేసి పర్సనల్ అజెండాలను ముందుకు తీసుకురావడంతో.. సర్కార్ ఇరకాటంలో పడాల్సి వచ్చిందంటున్నారు. అన్నిటికీ మించి కామినేని శ్రీనివాసరావు వర్సెస్ బాలకృష్ణ ఎపిసోడ్ సర్కార్‌ని బాగానే డ్యామేజ్ చేసిందన్న చర్చలు నడుస్తున్నాయి. అలాగే… కూటమి పార్టీల మధ్య అనుమాన బీజాలు నాటడానికి ఉపయోగపడిందన్న అభిప్రాయంతో ఉన్నారట వైసీపీ నాయకులు. చంద్రబాబు దగ్గర మంచి మార్కుల కోసం ప్రయత్నించిన కామినేని జగన్ పేరు తీసుకువచ్చారని, అందులోకి బాలకృష్ణ ఎంట్రీతో రచ్చ రంబోలా అయిపోయి.. తమకు ప్లస్‌గా మారిందన్న మాటలు వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.
Read Also: Off The Record: రాజోలులో రసవత్తరంగా రాజకీయం.. టీడీపీ ఇంచార్జిగా వైసీపీ ఇంచార్జి కుమార్తె
అయితే ఈ వివాదంలోకి చిరంజీవి ఎంట్రీ ఇచ్చి… తనకు అవమానం జరగలేదంటూ క్లారిటీ ఇవ్వడం, ఆర్. నారాయణమూర్తి లాంటి సీనియర్ యాక్టర్ దానికి బలం చేకూరేలా మాట్లాడటంతో..మర్యాదకు సంబంధించి ఇన్నాళ్ళు కూటమి నేతలు మాట్లాడినవన్నీ అబద్దాలేనని తేలిపోయిందని అంటున్నారు ఫ్యాన్ లీడర్స్. చిరంజీవి జనసేనలో లేకపోయినా… ఆయనను తమ వాడిగానే భావిస్తుంటారు ఆ పార్టీ సభ్యులు.. ఆయన కూడా ఆ మధ్య ఒకప్పటి ప్రజారాజ్యమే ఇప్పటి జనసేన అన్నట్టు మాట్లాడారు. అలాంటి తమ అధినేత సోదరుడిని టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీలో సంభోధించిన విధానంపై మెగా అభిమానులు, జన సైనికులు కూడా సీరియస్‌గానే ఉన్నట్టు సమాచారం. కొంత కాలంగా టిడిపి, జనసేన మధ్య క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు ఉన్నా… అగ్ర నాయకత్వాలు సర్ది చెప్పుకుంటూ వస్తున్నాయి. కానీ ఈ తాజా వివాదంలో ఎవర్నీ.. ఎటూ సముదాయించలేక సతమతం అవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇదే సమావేశాల్లో కాలుష్య నియంత్రణ విషయమై టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమా, డిప్యూటీ సీఎం పవన్ మధ్య తేడాలు వచ్చినట్టు కనిపించింది. మరోవైపు టిడిపి సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి, జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్‌కి మధ్య కూడా అసెంబ్లీలో ఇలాంటి సీనే రిపీట్ అయింది.
Read Also: Tilak Varma: “ఆపరేషన్ తిలక్ వర్మ”.. అని దేశమంతా అంటుండటం చాలా గర్వంగా ఉంది..
సరే… అదంతా సర్దుకుంటోందని అనుకునే లోపే… కామినేని పాత పాట పాడటం, అది ఆరున్నొక్క రాగంలో వినిపించడానికి బాలకృష్ణ తన వంతు స్వర, వాద్య సహకారాలు అందించడం… తీవ్ర దుమారం రేపింది. అటు రాజధాని అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 16 నెలలు కావస్తున్నా వైసీపీ ప్రభుత్వ పాలనను తలిపించేలాగే పాలన సాగుతోందంటూ డోస్ పెంచి మాట్లాడాకు సుజనా. ప్రత్యేకించి అమరావతి రైతుల ప్రస్తావన తీసుకు రావడం కూటమిలో కాక రేపింది. అలాగే శాంతిభద్రతల విషయంలో హోం శాఖను టార్గెట్ చేస్తూ కొందరు టీడీపీ ఎమ్మెల్యేలే మాట్లాడ్డం లాంటివి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టినట్టు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యేలే కాకుండా… కొందరు మంత్రులు కూడా ఇష్టానుసారం మాట్లాడి ఇరుకున పెట్టారని, అందుకే చంద్రబాబు రియాక్ట్ అయి క్లాస్‌లు తీసుకోవాల్సి వచ్చిందన్న అభిప్రాయం బలంగా ఉంది రాజకీయవర్గాల్లో. జగన్ హయాంలో 3 లక్షల కోట్ల అప్పులు చేశారని ఈ సెషన్‌లోనే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. కానీ… మండలిలో మాత్రం మంత్రులు టీజీ భరత్, అచ్చెన్నాయుడు వైసీపీ హయాంలో 9 లక్షల కోట్లు అప్పులు చేశారని మాట్లాడ్డం విమర్శలకు తావిచ్చింది. వైసీపీ హయాంలో రోడ్ల నిర్మాణం విషయమై కూడా టీడీపీ సభ్యుల విమర్శలకు, మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి వివరణలకు పొంతన లేకుండా ఉంది.
Read Also: Rashmika Mandanna : జిమ్ లో కత్తిలాంటి అందాలకు చెమటలు పట్టిస్తున్న రష్మిక..
కాగా, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 32 శాతం మేర రోడ్లు నిర్మించారని మంత్రి క్లారిటీ ఇస్తే… సభ్యులు మాత్రం అసలేం జరగలేదన్నట్టు మాట్లాడ్డం చూసిన జనమే డిసైడ్ చేసుకుంటారన్న అభిప్రాయం వైసీపీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఇక మెడికల్ కాలేజీల సంగతి సరేసరి. ఇలా… ప్రతి విషయంలోనూ… తాము లేని అసెంబ్లీలో ఒక రకంగా, ఉన్న శాసన మండలిలో మరో రకంగా ప్రభుత్వం వైపు నుంచి సమాధానాలు వచ్చాయని, ఇదే విషయాన్ని ఇప్పటికే ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు… ఇక ముందు కూడా జనంలో చర్చకు పెట్టి నిర్ణయాన్ని వాళ్ళకే వదిలేయాలని వైసీపీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. గతంలో ఎప్పుడూ ఇంత తీవ్ర స్థాయిలో సభా వ్యవహారాలు వివాదాస్పదం కాలేదని, తొలిసారి చంద్రబాబు ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా సభా నిర్వహణ ఉందన్న అభిప్రాయం బలపడుతోందని అంటున్నారు పరిశీలకులు. ఇలా… వోవరాల్‌గా చూసుకుంటే… తాము సభలో లేకున్నా… అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు తమకు కలిసొచ్చినట్టు భావిస్తున్నారట వైసీపీ లీడర్స్. ప్రతిపక్ష సభ్యుల అవతారం ఎత్తిన కూటమి సభ్యులు ప్రభుత్వానికి లేనిపోని సమస్యలు సృష్టించారని, రికార్డెడ్‌గా బుక్కయ్యారన్నది ఫ్యాన్ పార్టీ పెద్దల భావన అట. అనూహ్యంగా టీడీపీ వర్సెస్ జనసేన.. టీడీపీ వర్సెస్ బీజేపీల అన్నట్టుగా మారి తమ వ్యూహం వంద శాతం వర్కౌట్ అయిందని హ్యాపీగా ఉందట వైసీపీ అధిష్టానం.
