Budi Mutyala Naidu : డిప్యూటీ సీఎం బూడి చిర్రుబుర్రులు..మిస్టర్ కూల్ తీరులో ఆ మార్పెందుకు ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్యేగా ఉన్నంత సేపూ మిస్టర్ కూల్..! డిప్యూటీ సీఎం అయ్యాక మిస్టర్ ఫైర్..!! ఈ సెకండ్ షేడ్ చూసిన పార్టీ నేతలు… నియోజకవర్గం ప్రజలు ఆశ్చర్యపోతున్నారట. ఇంతకీ డీప్యూటీ సీఎంలో ఎందుకీ మార్పు? ఫస్ట్రేషన్ ఫీక్స్‌కు వెళ్లిపోయిందా?
బూడి ముత్యాలనాయుడు. మాడుగుల నుంచి రెండోసారి ఎమ్మెల్యే. ఇటీవల కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో మంత్రి కావడంతోపాటు.. ఏకంగా డిప్యూటీ సీఎం హోదా దక్కింది. పొలిటికల్‌గా ఊహించని శిఖరాలకు వెళ్లారంటారు అనుచరులు. కాకపోతే ఎమ్మెల్యేగా ఉన్న ముత్యాల నాయుడు వేరు.. డిప్యూటీ సీఎంగా ఆయన తీరు వేరన్నది దగ్గరగా చూస్తున్నవారి మాట. ఉమ్మడి విశాఖ జిల్లాలో తనదైన మార్కు వేసుకోవాలనే తాపత్రయం ఉన్నప్పటికీ.. బూడికి సంధు దొరకడం లేదట. దీంతో ఉంటే మాడుగుల.. లేదంటే విజయవాడ అన్నట్టుగా మారిపోయింది. మీడియాకు కూడా దూరమే. అలాంటి డిప్యూటీ సీఎంలో ఇప్పుడు మరో కోణం కనిపిస్తోందట.
Also Read
శాఖాపరమైన వ్యవహారాలు.. రాజకీయాలపై ప్రశ్నలు వస్తే సహించలేకపోతున్నారట డిప్యూటీ సీఎం. ఆగ్రహం వ్యక్తం చేయడం.. లేనిపోని సవాళ్లు విసరడం.. చేతనైంది చేసుకోవాలని పరుషంగా మాట్లాడటం చేస్తున్నారట. ఇటీవల జడ్పీ సమావేశంలో నీటి ఎద్దడిపై వేసిన ప్రశ్నలకు పూనకం వచ్చినట్టు ఊగిపోయారు. అక్కడే ఉన్న అధికారులు అవాక్కైన పరిస్థతి. మాడుగులలోనూ బూడి వ్యవహారం ఇదే విధంగా ఉంటోందట. పార్టీ నేతలు కార్యకర్తలపై ఎన్నడూ లేనివిధంగా చిర్రుబుర్రులు ఆడుతున్నారట.
రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాక కొన్ని సామాజికవర్గాలను ముత్యాల నాయుడు పూర్తిగా పక్కన పెట్టేశారనే అసంతృప్తి పార్టీ వర్గాల్లో ఉందట. పదవుల పంపిణీలో ఈక్వేషన్లు పట్టించుకోలేదని సమాచారం. ఇవి క్రమంగా డిప్యూటీ సీఎంపై వ్యతిరేకత పెంచుతున్నాయనే వాదన ఉంది. రాజకీయంగానూ ఇబ్బంది పడుతున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. చోడవరం, మాడుగుల ఇరుగు పొరుగు నియోజకవర్గాలు. ఇక్కడి పరిణామాలు రెండు నియోజకవర్గాలపైన ప్రభావం చూపుతాయి. అటువంటి చోట చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీతో బూడికి విభేదాలు ఉన్నాయి. డిప్యూటీ సీఎం అయ్యాక చోడవరంపైన తనకు ప్రాధాన్యం పెరుగుతుందని బూడి వర్గం లెక్క లేసుకుంది. అనూహ్యంగా హైకమాండ్ ధర్మశ్రీకి డబుల్ ప్రమోషన్ ఇచ్చింది. ప్రభుత్వ విప్‌గా.. అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించింది. పార్టీ పరంగా ప్రాధాన్యం ధర్మశ్రీకే దక్కుతోంది.
ఇతర నియోజకవర్గాల్లో సమస్యలు కూడా డిప్యూటీ సీఎం దగ్గరకు వచ్చే పరిస్థితి లేదట. అందరూ సీనియర్లు కావడం నేరుగా తమకు కావాల్సిన పనులు చేయించుకునే సామర్ధ్యం ఉంది. గ్రేటర్ విశాఖ జిల్లాకు మంత్రి లేనప్పటికీ ఆ ఖాళీని ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ భర్తీ చేసేశారు. అరకు, పాడేరు ప్రాంతాలకు ఇన్ఛార్జ్ మంత్రిగా అమర్నాథ్ వ్యవహరిస్తున్నారు. దీంతో సహజంగానే ముత్యాల నాయుడు స్పేస్ బాగా తగ్గిపోయిందనే చర్చ ఉంది. పైగా వచ్చే ఎన్నికల నాటికి హైకమాండ్ అవకాశం ఇస్తే ఎంపీగా వెళ్లే యోచనలో ఉన్నారట ముత్యాల నాయుడు. ఈ క్రమంలో జిల్లా మొత్తం మీద తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకోవడం ఆయనకు అనివార్యం. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం స్టైల్ మార్చారా…?.అనే చర్చ జరుగుతోంది.
తాజావార్తలు
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
-
Suriya vs SK : సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ ట్వీట్ వార్
-
Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
-
Ameesha Patel: అమీషా పటేల్ ఇంట్లో నగలు చోరీ.. పని మనిషి అరెస్ట్!
-
Release Postpone : పెద్ద హీరోల సినిమా అంటే వాయిదా పడాల్సిందేనా?”
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!