Site icon NTV Telugu

గులాబీ గూటికి చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పునరాలోచన?

కాంగ్రెస్ నుంచి గులాబీ గూటికి చేరిన ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడ్డారా? కర్టసీ కోసం టచ్‌లోకి వెళ్తున్నారా.. లేదంటే ముందే కర్చీఫ్ వేసుకుంటున్నారా? అప్పట్లో కాదని వెళ్లిన ఎమ్మెల్యేలు ఇప్పుడు వెనక్కి రావాలని ఎందుకు అనుకుంటున్నారు? లెట్స్‌ వాచ్‌!

పార్టీ మారిన ఎమ్మెల్యేలు టచ్‌లోకి వస్తున్నారా?

తెలంగాణలో కాంగ్రెస్‌ సింబల్ మీద గెలిచి.. ప్లేట్‌ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై.. కొత్త పీసీసీ చీఫ్ వచ్చి రాగానే మాటల తూటాలు పెంచారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు.. కౌంటర్ అటాక్ చేసినా… చాలామంది సైలెంట్‌గా ఉండి పోయారు. తొందరపడటం ఎందుకనుకున్నారో లేక.. ఆచితూచి స్పందించాలని నిర్ణయించారో ఏమో వాళ్ల నుంచి సౌండ్‌ లేదు. ఎమ్మెల్యేలు పార్టీ మారినా.. ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ బలంగానే ఉందని పీసీసీ లెక్కలు వేసుకుంటోంది. క్యాడర్‌ని తిరిగి యాక్టివ్ చేయడానికి త్వరలోనే కార్యాచరణ ప్రకటించాలని పీసీసీ పొలిటికల్‌ అఫైర్స్ కమిటీ నిర్ణయించింది. ఇదే సమయంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలలో కొందరు కాంగ్రెస్‌తో టచ్‌లోకి వచ్చారని ప్రచారం జరుగుతోంది. గడిచిన ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి సిఫారసుతో టికెట్‌ పొంది ఎమ్మెల్యేలు అయినవారు టచ్‌లోకి వచ్చిన జాబితాలో ఉన్నారట. వారంతా వెనక్కి రావాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్‌ నేతలతో హరిప్రియ నాయక్‌ మాట్లాడారా?

అప్పట్లో రేవంత్‌ సిఫారసుతో టికెట్‌ పొందినవారిలో ఖమ్మం జిల్లాలో ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్‌ ఉన్నారట. ఇంకొకరు ములుగు ఎమ్మెల్యే సీతక్కగా చెబుతారు. సీతక్క ఇప్పటికే రేవంత్‌ టీమ్‌తో కలిసి పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత హరిప్రియ నాయక్‌ టీఆర్‌ఎస్‌లోకి వెళ్లారు. ఆ సమయంలో రేవంత్‌ మనుషులు కాంగ్రెస్‌ నుంచి వెళ్లిపోతున్నారనే ప్రచారం జరగడంతో ఇల్లందు ఎమ్మెల్యే కూడా సర్దుకున్నట్టు చెబుతారు. కానీ.. రేవంత్‌ పీసీసీ చీఫ్‌గా వచ్చాక ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌ తిరిగి కాంగ్రెస్‌ నాయకులతో మాట్లాడినట్టు ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికిప్పుడు అధికారపార్టీ నుంచి బయటకొస్తారా?

కాంగ్రెస్‌లోకి తిరిగి వెనక్కి వచ్చే ఆలోచనో లేక పాత పరిచయంతో అభినందలు తెలిపారో ఏమో.. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌ గురించి కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది. అయితే.. అధికార పార్టీ నుంచి ఇప్పటికిప్పుడు బయటకు వచ్చే పరిస్థితి ఉంటుందా? ఇంకా రెండున్నరేళ్ల ఎమ్మెల్యే పదవి చేతిలో ఉండగా.. తొందర పడి ఆమె నిర్ణయం తీసుకుంటారా? అనే చర్చ కూడా ఉంది. ప్రస్తుతం పార్టీ నుంచి వెళ్లినవారిని వెనక్కి తెచ్చేందుకు ఘర్‌వాపసీ చేపట్టడంతో ఈ పరిణామం ఆసక్తిగా మారింది.

వెనక్కి వస్తానన్న వారిపట్ల కాంగ్రెస్‌ నేతల బీఅలర్ట్‌!

రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని చాలా మంది నాయకులు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లోకి తిరిగి రావాలంటే కొత్తగా కమిటీలు వేసుకుని.. అక్కడ ఒప్పుకొంటేనే చేర్చుకోవాలనే నిర్ణయం ఉంది. కాంగ్రెస్‌ను వీడిన కొందరు ఎమ్మెల్యేలు.. స్థానికంగా పార్టీకి నష్టం చేకూర్చారనే అభిప్రాయం ఉంది. వారి విషయంలో మాత్రం పీసీసీలోని పెద్దలు గుర్రుగా ఉన్నారట. అందుకే వెనక్కి వస్తామని టచ్‌లోకి వచ్చే వారిపట్ల కొంత అప్రమత్తంగా ఉండాలని అనుకుంటున్నారట. మరి.. అధికార పార్టీని కాదని పాత పరిచయాలతో టచ్‌లోకి వస్తున్న ఎమ్మెల్యేల విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

Exit mobile version