Site icon NTV Telugu

Off The Record: ఉత్తరాంధ్ర నేతలు ఫెయిల్ అవుతున్నారని సీఎం కోపంగా ఉన్నారా?

Uttarndhra

Uttarndhra

Off The Record: ఆ మాజీ మంత్రి విషయంలో టీడీపీ అధిష్టానం సీరియస్‌గా ఉందా? ఆయన్ని కౌంటర్‌ చేయకుంటే కష్టమన్న అభిప్రాయం పార్టీలో పెరుగుతోందా? అసలు మాట్లాడాల్సిన నాయకులు కూడా నోరు మెదపకుండా… మాకెందుకన్నట్టు ఉదాసీనంగా ఉంటున్నారన్న ఫీలింగ్‌ తెలుగుదేశం పెద్దల్లో పెరుగుతోందా? అధికార పార్టీని అంతలా భయపెడుతున్న ఆ వైసీపీ లీడర్‌ ఎవరు? టీడీపీ ఆయన్ని ప్రత్యేకంగా ఎందుకు చూస్తోంది?

Read Also: Vijayawada Double Murder: బెజవాడ వీధుల్లో వీరవిహారం.. ఇద్దరు యువకులను కిరాతకంగా హత్య చేసిన రౌడీ షీటర్..!

బొత్స సత్యనారాయణ.. ఉత్తరాంధ్రలో కీలక నేత.. అక్కడ వైసీపీకి పెద్ద దిక్కు. ఉమ్మడి రాష్ట్రంలోను, విడిపోయాక కూడా పవర్ పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉన్నారాయన. ప్రస్తుతం వైసీపీలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపగలిగిన కొద్దిమంది నేతల్లో ఆయన కూడా ఒకరు. ఎమ్మెల్సీగా… శాసన మండలి సమావేశాల్లో తన రాజకీయ అనుభవాన్ని మొత్తం రంగరించి… వైసీపీ తరపున వాయిస్‌ వినిపిస్తున్నారాయన. అదే సమయంలో అధికార పక్షఆన్ని కూడా గట్టిగానే టార్గెట్‌ చేస్తున్నారు. ప్రభుత్వం మీద, సీఎం చంద్రబాబు మీద సీరియస్‌గానే విమర్శలు చేస్తున్నారు బొత్స. ఛాన్స్‌ దొరికినప్పుడల్లా… ఏ మాత్రం తగ్గడం లేదన్న అభిప్రాయం ఉంది రాజకీయవర్గాల్లో. అయితే, అదే సమయంలో టీడీపీవైపు నుంచి ఆయనకు దీటుగా కౌంటర్స్‌ వేయలేకపోతున్నారన్న అభిప్రాయం ఉంది రాజకీయవర్గాల్లో. ముఖ్యంగా బొత్సది ఉత్తరాంధ్ర ప్రాంతం కాబట్టి.. కనీసం ఆ ప్రాంత నేతలు కూడా ఆయన్ని సరిగా కౌంటర్‌ చేయలేకపోతున్నారన్న అభిప్రాయం ఇటు టీడీపీ వర్గాల్లో సైతం ఉందట. ఆ పరంగా ఉత్తరాంధ్ర నేతలు ఫెయిల్ అవుతున్నారని సీఎం చంద్రబాబు కూడా సీరియస్ అవుతున్నట్టు సమాచారం.

Read Also: Vaishnavi Murder: యువతి వైష్ణవి మర్డర్ మిస్టరీ.. ప్రియుడే చంపేశాడా..? ఈ 2 గంటల్లో ఏం జరిగింది?

బొత్స అలా.. విరుచుకు పడుతుంటే కనీసం సరైన సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నారని ఇటీవల పార్టీ ఉత్తరాంధ్ర నాయకుల మీద ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు చెప్పుకుంటున్నారు. అందరికంటే ముందుగా.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బొత్స మీద గెలిచిన సీనియర్‌ లీడర్‌ కళా వెంకట్రావ్ కనీసం పల్లెత్తు మాట అనడం లేదు ఎందుకంటూ అధిష్టానం ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. గట్టి కౌంటర్స్‌ ఇవ్వాల్సిన కళా వెంకట్రావు…. తీవ్ర విమర్శలు చేస్తున్నా అంటీ ముట్టనట్టుగా ఎందుకు ఉంటున్నారన్న చర్చ జరుగుతోందట టీడీపీ పెద్దల్లో. సరైన సమయంలో దీటుగా బదులివ్వకపోతే… జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని టీడీపీ అధిష్టానం అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. ఒక్క కళానే కాదు… ఉత్తరాంధ్ర నుంచి గంటా శ్రీనివాసరావు, కూన రవికుమార్‌తో పాటు మిత్రపక్షం జనసేన నేతలు కూడా.. మాట్లాడ్డం లేదన్న అసంతృప్తి ఉందట టీడీపీ పెద్దల్లో. ఆ విషయంలో పదే పదే చెబుతున్నా.. ఎవ్వరూ పట్టించుకోవడంలేదన్నది టీడీపీ ఆధిష్టానం ఆగ్రహంగా తెలుస్తోంది.

Read Also: Mahesh Kumar Goud: రాయలసీమను రతనాల సీఎం చేస్తా అన్నది కేసీఆర్ కాదా..?

ముఖ్యంగా బొత్స లాంటి వ్యక్తి ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసినప్పుడు సరైన కౌంటర్లు ఇవ్వాలని, లేకపోతే అసలు ఉత్తరాంధ్ర నుంచి టీడీపీ వాయిస్ లేకుండా పోయే ప్రమాదం ఉందని అధిష్టానం భయపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బొత్స సత్యనారాయణ వైసీపీని జిల్లాల వారీగా బలోపేతంపై దృష్టి పెట్టారు. కేవలం ఉత్తరాంధ్రతో సరిపెట్టకుండా… రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు పెడుతున్నారు.. దీంతో ఆయన్ని సీరియస్‌గా తీసుకుని కౌంటర్స్‌ ఇవ్వకుంటే… పార్టీ డిఫెన్స్‌లో పడటం ఖాయమన్న అభిప్రాయానికి వచ్చిందట టీడీపీ అధిష్టానం. వైసీపీ ఏం మాట్లాడినా కౌంటర్ ఇవ్వకపోతే కష్టమనే అభిప్రాయానికి సీఎం వచ్చినట్టు తెలిసింది. కేవలం.ఒకరో ఇద్దరో మాట్లాడి మిగిలిన వారంతా సైలెంట్‌గా ఉంటే ఎలాగని టీడీపీ నేతల్ని చంద్రబాబు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. బొత్సతో పాటు వైసీపీ నుంచి వచ్చే ప్రభుత్వ వ్యతిరేక మాటలకు తప్పనిసరిగా కౌంటర్లు ఇవ్వాల్సిందేనని గట్టిగా చెబుతున్నారట సీఎం.

Exit mobile version