Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Chandrababu Support To Pawan Kalyan Off The Record

వకీల్‌సాబ్‌ కు చంద్రబాబు వకాలత్‌..బాబు రియాక్షన్‌తో కొత్త సందేహాలు !

NTV Telugu Twitter
Published Date :April 13, 2021 , 8:23 pm
By Premchand Chowdary
వకీల్‌సాబ్‌ కు చంద్రబాబు వకాలత్‌..బాబు రియాక్షన్‌తో కొత్త సందేహాలు !
  • Follow Us :
  • google news
  • dailyhunt

వకీల్‌సాబ్‌కు గట్టిగానే వకాలత్‌ పుచ్చుకున్నారు టీడీపీ అధినేత. రాజకీయంగా వేర్వేరు మార్గాల్లో ప్రయణిస్తున్న తర్వాత చంద్రబాబు ఎంచుకున్న ఈ లైన్‌ రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఎపిసోడ్‌ను రాజకీయ నాయకుల మాటలకు అర్థాలే వేరని భావించాలా?  తిరుపతి ఉపఎన్నిక బ్యాక్‌డ్రాప్‌లో వినిపిస్తున్న కొత్త నేపథ్య సంగీతాన్ని ఎలా చూడాలి?  

భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పవన్‌పై కర్చీఫ్‌ వేశారా?

వకీల్‌సాబ్‌ సినిమా టికెట్ల రేట్ల పెంపు విషయంలో చంద్రబాబు స్పందన ఇది. వాస్తవానికి తీవ్ర దుమారం రేపిన ఈ అంశంపై చిత్రానికి సంబంధించిన వాళ్లు ఎవరూ రియాక్ట్‌ కాలేదు. హీరో పవన్‌ కల్యాణ్‌ సైతం పెదవి విప్పింది లేదు. కానీ.. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని భుజనకెత్తుకున్నారు టీడీపీ అధినేత. ఆయన వైఖరిని చూసిన వాళ్లంతా వకీల్‌సాబ్‌ విషయంలో చంద్రబాబు దూకుడుగా ఉన్నారు అని అనుకునే పరిస్థితి కల్పిస్తున్నారు. భవిష్యత్‌ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పవన్‌ కల్యాణ్‌కు ఏదైనా కర్చీఫ్‌ వేస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

బాబు రియాక్షన్‌ ముందు బీజేపీ నేతల స్పందన తేలిపోయిందా?

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు మద్దతు ఇచ్చారు జనసేనాని పవన్‌ కల్యాణ్‌. బీజేపీ, జనసేన మిత్రపక్షాలు గా ఉన్నాయి.  రత్నప్రభకు సపోర్ట్‌గా తిరుపతిలో పాదయాత్ర చేశారు.. బహిరంగ సభ నిర్వహించారు జనసేనాని. ఈ స్థాయిలో రెండు పార్టీలు వేర్వేరుమార్గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో చంద్రబాబు వకీల్‌సాబ్‌ గురించి మాట్లాడటమే ఆసక్తి కలిగిస్తోంది. టికెట్ రేట్ల పెంపు విషయంలో బీజేపీ నేతలు కూడా స్పందించారు. కానీ.. టీడీపీ అధినేత రియాక్షన్‌ ముందు కమలనాథులు తేలిపోయారనే టాక్‌ ఉంది.

తాజా ఎపిసోడ్‌పై వైసీపీ బ్యాటింగ్‌ మొదలైందా?

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక కాకుండా.. సాధారణ సందర్భం అయి ఉన్నట్టయితే.. వకీల్‌సాబ్‌పై చంద్రబాబు రియాక్షన్‌ను పెద్దగా ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఏపీ రాజకీయాల్లో తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక వేడి రాజేస్తోంది. ఇలాంటి తరుణంలో ప్రత్యర్థి పార్టీ నేత సినిమా గురించి చంద్రబాబు నిగ్గదీసి అడగటం ప్రాధాన్యం సంతరించుకుంది. అధికారపార్టీ వైసీపీ వెంటనే యక్షన్‌లోకి దిగిపోయింది. ఎవరు ఏ పార్టీయో.. ఎవరు ఎవరికి మద్దతిస్తున్నారో తెలియడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు వైసీపీ నాయకులు.

మెగాబ్రదర్‌ సన్నాయి నొక్కులు?

మొత్తానికి సమస్య పొలిటికల్‌ కలర్‌ ఇచ్చుకుంది. సినిమాను సినిమాగానే చూడాలని అనుకున్నారో ఏమో.. మెగా బ్రదర్‌ నాగబాబు సన్నాయి నొక్కులు మొదలుపెట్టారు. సీఎం జగన్‌కు తెలిసి సినిమా టికెట్ల పెంపును అడ్డుకుని ఉండబోరని తనదైన శైలిలో ఓ కామెంట్‌ పాస్‌ చేశారు.

పంచాయతీ, పురపోరులో జనసేనకు కొన్నిచోట్ల టీడీపీ మద్దతు?

రాజకీయ రగడను కాసేపు పక్కన పెడితే.. చంద్రబాబు వకీల్‌సాబ్‌ సినిమాకు వకాలత్‌ పుచ్చుకోవడం వెనక బలమైన వ్యూహం ఉందన్న టాక్‌ వినిపిస్తోంది. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో పలుచోట్ల ఓపెన్‌గానే జనసేనకు టీడీపీ నేతలు సపోర్ట్‌ చేశారు. గతంలోలా జనసేనాని పై విమర్శలు లేవు. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ కూటమికి పవన్‌ కల్యాణ్‌ మద్దతు ఇచ్చాక.. కొన్నాళ్లపాటు బంధం సజావుగానే సాగింది. జనసేనానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు చంద్రబాబు. మధ్యలో రాజకీయ వైరుధ్యాలు వచ్చాయి. మళ్లీ పవన్‌ కల్యాణ్‌తో కలిసి నడవాలని అనుకుంటున్నారో ఏమో మాజీ సీఎం స్వయంగా రంగంలోకి దిగారని అనుకుంటున్నారు. మరి.. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక.. వకీల్‌సాబ్‌ సినిమా ఎలాంటి రాజకీయ స్క్రిన్‌ప్లే రచిస్తాయో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • chandrababu
  • off the record
  • pawan kalyan
  • Support

తాజావార్తలు

  • Off The Record: వైఎస్ జగన్‌ భద్రతకు ఢోకా లేదని కేంద్రం చెప్పినా.. వైసీపీ నేతల్లో భయమెందుకు?

  • Off The Record: జగన్‌ క్షేత్రస్థాయిలో తిరుగుతున్నా.. ఆ వైసీపీ సీనియర్ గుమ్మం దాటట్లేదా..?

  • Kannappa Preview : కన్నప్ప ప్రివ్యూ

  • Manchu Vishnu : పవన్ కు కన్నప్ప అప్పుడే చూపిస్తా.. విష్ణు కామెంట్స్..

  • Off The Record: కాంగ్రెస్‌ పీఏసీలో జగ్గారెడ్డి హాట్‌ కామెంట్స్‌.. ఆంతర్యమేంటి..?

ట్రెండింగ్‌

  • Best Smartphones: రూ.15,000లోపు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫోన్లు ఇవే..!

  • BSNL 1499: ‘దేశానికి తోడుగా’ అంటూ.. కొత్త ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్..!

  • Controversy Marriage: సభ్యసమాజానికి షాక్: 65ఏళ్ల అమ్మమ్మను పెళ్లి చేసుకున్న 21ఏళ్ల మనవడు!

  • Credit Card: క్రెడిట్ కార్డున్న వ్యక్తి మరణిస్తే.. బకాయి ఎవరు చెల్లించాలి..? రూల్స్ ఏం చెబుతున్నాయంటే..!

  • Fairphone Gen 6: 5 ఏళ్ల వారంటీ, మరమ్మతులకు అనుకూలంగా ఉండేలా మొబైల్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions