Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Chandrababu Strategy Change In Kuppam

తనదాకా వస్తే కానీ…

NTV Telugu Twitter
Published Date :January 12, 2022 , 7:52 pm
By NTV WebDesk
తనదాకా వస్తే కానీ…
  • Follow Us :
  • google news
  • dailyhunt

తనదాకా వస్తే కానీ.. చంద్రబాబుకు తెలియలేదా? ఇప్పటి వరకు కేడర్‌ ఇబ్బంది పడింది. తమ్ముళ్లు ఎంత మొత్తుకున్నా ఆయన చెవికి ఎక్కించుకోలేదు. కుప్పంలో దిమ్మతిరిగాక కానీ బాబుకు ఆ ఇద్దరి ఎఫెక్ట్‌ ఏ లెవల్లో ఉందో తెలిసొచ్చిందట. అంతే కట్ చేసేశారు చంద్రబాబు. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.

బాబులో మార్పు వచ్చిందని కేడర్‌లో సంతోషం..!
టీడీపీ అధినేత చంద్రబాబుకు కుప్పం పర్యటన కొత్త కాకపోయినా.. పార్టీ కేడర్‌కు మాత్రం ఈసారి చంద్రబాబు టూర్‌లో స్పెషల్‌ ఉందని చెవులు కొరుక్కుంటున్నాయి. అధినేతలో మార్పు వచ్చిందని ఓపెన్‌గానే సంతోషం వ్యక్తం చేస్తున్నారు తమ్ముళ్లు.

ఎన్నికల ఫలితాలు.. కుప్పంలో డబ్బుల పంపిణీ బాధించాయట
పంచాయతీ.. జడ్పీటీసీ.. ఎంపీటీసీ.. మున్సిపల్ ఎన్నికలలో వరస ఓటముల తర్వాత చంద్రబాబు రావడంతో.. ఆయన ఎలా స్పందిస్తారా అని టీడీపీ కేడర్‌ ఆసక్తిగా ఎదురు చూసింది. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని లైట్‌ తీసుకున్నవాళ్లకు మాత్రం అంచనాలు తప్పాయి. కొత్త రూట్‌లో వెళ్లడం మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి సహా పార్టీ నేతలకు కేడర్‌కు షాక్‌ ఇచ్చినట్టు సమాచారం. ఎప్పటిలాగే ఓటమికి మీదే బాధ్యత అనిచెప్పిన చంద్రబాబు రెండు అంశాలపై ఆవేదన వ్యక్తం చేశారు. అవి.. ఒకటి మొన్నటి ఎన్నికల ఫలితాలు. రెండోది కుప్పంలో డబ్బులు పంచడం. కుప్పంలో ఓటమి అని తనను ఎగతాళి స్తే.. మిమ్మల్ని అన్నట్టు కాదా అని ఎదురు ప్రశ్నించారు బాబు.

కేడర్‌ చెప్పిన వాళ్లను.. కోవర్టులను పక్కన పెడతానని ప్రకటన
కుప్పం జనం కూడా ప్రలోభాలకు లొంగిపోతే ఎలా అని మరో ప్రశ్న సంధించారు చంద్రబాబు. ఇకపై బాగా పనిచేయాలని.. కుప్పంలో కోవర్టులు పంపేసి.. పార్టీని ప్రక్షాళన చేస్తానని ఆయన తెలిపారు. ముఖ్యంగా పార్టీ కేడర్‌కు ఎప్పటి నుంచో తలనొప్పిగా మారిన PA మనోహర్‌, గౌరివాణి శ్రీనివాసులు, మునిరత్నంలను పక్కన పెట్టాలని డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో చేద్దాం.. చూద్దాం అని నాన్చిన చంద్రబాబు.. ఈసారి మాత్రం వారితోపాటు మరో ముగ్గురిని.. కొందరు కోవర్టులను ఇంటికి పంపుతానని చెప్పడంతో కేడర్‌ షాక్‌ తిందట. వరస ఓటములు చంద్రబాబును ఇంతిలా మారుస్తాయని అనుకోలేదని చెబుతున్నారు టీడీపీ తమ్ముళ్లు.

కుప్పంలో దీపావళి కల్లా చంద్రబాబుకు ఇల్లు..!
కేడర్‌ డిమాండ్స్‌పైనే కాకుండా ఎప్పటి నుంచో తనపై వస్తున్న విమర్శలకు బాబు చెక్‌ చెప్పారు. కుప్పంలో చంద్రబాబుకు ఇల్లు లేదని వైసీపీ చేసే కామెంట్స్‌కు సమాధానం ఇచ్చారు. టీడీపీ ఆఫీస్‌ ఎదురుగానే ఇంటి స్థలం కోసం పరిశీలించి.. దీపావళి కల్లా నిర్మాణం పూర్తి చేయాలని లోకల్‌ లీడర్లకు చెప్పారట. వచ్చే ఎన్నికల్లో బాబును కుప్పంలో ఓడిస్తామన్న వైసీపీ ప్రకటనకు జవాబిచ్చారు చంద్రబాబు. తాను నియోజకవర్గం మార్చాలా.. ఆ అవసరం ఉందా అని పార్టీ శ్రేణులను ప్రశ్నించారు. తాను కుప్పానికి ముద్దు బిడ్డనని.. కుప్పం వదిలి ఎక్కడికీ పోనని క్లారిటీ ఇచ్చారు.

చంద్రబాబు వెంట కనిపించని మనోహర్‌, గౌరివాణి
చంద్రబాబు ఎప్పుడు కుప్పం వచ్చినా.. ఆయన పర్యటనలో తెగ హడావిడి చేసే పీఏ మనోహర్‌, గౌరివాణి శ్రీనివాసులు.. ఈ దఫా బాబు పర్యటనలో ఎక్కడా కనిపించలేదు. వారిని ఆ సమీపంలోకి రావొద్దని సూచించినట్టు సమాచారం. వీరి స్థానంలో కుప్పానికి తాత్కాలిక ఇంఛార్జ్‌గా మాజీ మంత్రి అమర్నాథరెడ్డిని నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పవన్‌ కల్యాణ్‌తో వన్‌సైడ్‌ లవ్‌.. కుప్పంలో ఇప్పటి వరకు పర్యటించని గ్రామాలకు వెళ్లడం.. అందరితో ఫొటోలు దిగడం.. కేడర్‌ను ఆశ్చర్యపరిచిందట. దీంతో చంద్రబాబుకు తనదాకా వస్తే కానీ.. తెలిసిరాలేదని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. మరి.. మార్పు టీడీపీ అధినేతకు ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap politics
  • babu plan
  • ex cm chandrababu
  • kuppam seat
  • off the record

తాజావార్తలు

  • CM Chandrababu: సీఎంతో ముగిసిన కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్ భేటీ.. ఈ అంశాలపై చర్చ

  • Oil Discovery: జాక్‌పాట్ కొట్టిన భారత్.. అండమాన్ సముద్రంలో భారీగా ఆయిల్ నిల్వలు..

  • Dil Raju : అవార్డు వస్తే ఎంత పెద్ద స్టారైనా రావాల్సిందే.. తప్పు జరిగితే క్షమించండి..

  • RK Roja: పవన్ కళ్యాణ్‌పై రోజా సంచలన వ్యాఖ్యలు..

  • Jagtial: వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా.. 9 మందికి విద్యుత్ షాక్.. ఇద్దరి పరిస్థితి విషమం..

ట్రెండింగ్‌

  • Prepaid and Postpaid Switching: ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మార్పు ప్రక్రియ మరింత సులభతరం.. DoT కొత్త మార్గదర్శకాలు విడుదల..!

  • Samsung Galaxy A55: ఆఫర్ మిస్ చేసుకోవద్దు భయ్యా.. శాంసంగ్ ప్రీమియం మొబైల్ పై ఏకంగా రూ.11,000 తగ్గింపు..!

  • Lava Storm 5G: కేవలం రూ.7,999కే 6.75 అంగుళాల HD+ డిస్ప్లే, 50MP కెమెరాతో వచ్చేసిన లావా స్టోర్మ్ మొబైల్స్ ..!

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions