Site icon NTV Telugu

Off The Record: కవిత సవాల్ తో బీఆర్ఎస్ ఉలిక్కి పడుతుందా?

Kavitha

Kavitha

Off The Record: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త కొత్తగా పొలిటికల్‌ స్టెప్స్‌ వేస్తున్నారా? ఆ సౌండ్‌తో గులాబీ పెద్దలకు నిద్ర కరవవుతోందా? లోకల్‌ ఎలక్షన్స్‌తోనే జాగృతి పొలిటికల్‌ వార్‌ మొదలవబోతోందా? పంచాయితీ పెట్టుకుందాం..రా… అంటూ బీఆర్‌ఎస్‌కు సవాల్‌ విసరబోతున్నారా? ఇంతకీ కవిత వ్యూహం ఏంటి? బీఆర్‌ఎస్‌ ఎందుకు ఉలిక్కిపడుతోంది?

Read Also: Off The Record: ఆకుల లలితకు వ్యతిరేకంగా జిల్లా కాంగ్రెస్ నేతలు జట్టుకట్టారా?

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. కోర్ట్‌ కేసు కారణంగా ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న అనుమానాలు ఉన్నాయి అది వేరే సంగతి. ప్రస్తుతానికైతే…అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్‌ మూడ్‌లోకి వచ్చేశాయి. నామినేషన్ల దగ్గర నుంచి ఫలితాల వెల్లడి దాకా… షెడ్యూల్‌ ప్రకటించేసింది స్టేట్‌ ఎలక్షన్ కమిషన్‌. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ… రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందున ఇప్పుడు గ్రామాల్లో ఆ కోటా ప్రకారం ఎవరెవరు ఎక్కడెక్కడ అన్న చర్చలు జరుగుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు గ్రౌండ్ లెవల్లో గట్టిగా ఉండాలంటే… ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెల్చుకోవాలన్న ప్లాన్‌లో ఉన్నాయి అన్ని పార్టీలు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ కూడా ఇదే ఆలోచనతో, సేమ్‌ ప్లాన్‌లో ఉంది. ఆ క్రమంలోనే… సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను తమ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్‌లకు అప్పగించింది గులాబీ హైకమాండ్‌. అంతవరకు బాగానే ఉందని అనుకుంటున్నా… ఆ తర్వాతే అసలు చిక్కొచ్చి పడుతోందట. ఈసారి స్థానిక ఎన్నికల బరిలో మేము సైతం అని ఇప్పటికే ప్రకటించింది కవిత నేతృత్వంలోని తెలంగాణ జాగృతి. ఆ ప్రకటనే బీఆర్‌ఎస్‌ శ్రేణుల్ని గందరగోళంలో పడేస్తున్నట్టు తెలుస్తోంది.

Read Also: Dussehra 2025: దసరా రోజు పాలపిట్టను చూస్తే మంచిదా? అసలు మ్యాటరేంటంటే..

అయితే, పోటీ విషయంలో కోర్టు తీర్పు తర్వాత కీలక నిర్ణయం తీసుకుంటామని కవిత చెప్తున్నప్పటికీ… గ్రామస్థాయిలో మాత్రం ఆల్రెడీ తమ అభ్యర్థులను సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. జాగృతి తరపున పోటీ చేసేందుకు తమకు అప్లికేషన్లు కూడా వస్తున్నాయని ఇప్పటికే చెప్పారు సంస్థ అధ్యక్షురాలు. దీంతో కచ్చితంగా తెలంగాణ జాగృతి అభ్యర్థులు బరిలో ఉంటారని అంచనా వేస్తోందట బీఆర్‌ఎస్‌. అదే గనుక జరిగితే…మిగతా పార్టీల కన్నా ముందు తమకే డ్యామేజ్‌ అవుతుందని బీఆర్ఎస్‌ ముఖ్యులు లెక్కలేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అదే సమస్య కావచ్చంటున్నారు. బీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ ఆశించి దక్కని వాళ్ళు జాగృతి వైపు మొగ్గితే… ఓట్లు చీలిపోయి బాగా ఇబ్బంది పడతామని అనుకుంటున్న సమాచారం. వాళ్ళు కూడా… ప్రధానంగా బీఆర్‌ఎస్‌ ఐడియాలజీకి దగ్గరగా ఉన్న స్థానిక నాయకులు…. మిగతా పార్టీలకంటే జాగృతి వైపే మొగ్గు చూపే అవకాశం ఉందంటున్నారు. ఇక తెలంగాణ జాగృతి కూడా కేసీఆర్ బొమ్మ పెట్టుకునే జనంలోకి వెళ్తుంది కాబట్టి… ఆయన అభిమానులు, బీఆర్‌ఎస్‌లోఉన్నవాళ్లు జాగృతి తరపున పోటీ చేయడానికి వెనుకాడకపోవచ్చన్న అంచనాలున్నాయి. ఎక్కువ మంది చివరి నిమిషం వరకు బీఆర్ఎస్ తరఫున పోటీ చేయడానికి ప్లాన్ చేస్తారని, ఒకవేళ ఆ టికెట్ దక్కకపోతే జాగృతి నుంచి పోటీకి సై అంటారన్న మాటలు గ్రౌండ్లో వినిపిస్తున్నాయి.

Read Also: NCRB Report: దేశంలో మహిళలపై అత్యధిక నేరాలు జరుగుతున్న రాష్ట్రం ఇదే.. తాజా నివేదిక..

ఇప్పటికే, బీసీ రిజర్వేషన్లలో సక్సెస్ అయ్యామన్న ధీమాతో కాంగ్రెస్ పార్టీ దూసుకు వెళ్తుంటే… ఇప్పుడు జాగృతి రూపంలో కూడా షాక్ తగిలే అవకాశం ఉందన్న భయం గులాబీ వర్గాల్లో ఉందట. బీఆర్‌ఎస్‌ నుంచి బయటికి వచ్చాక జరుగుతున్న మొదటి ఎన్నిక కాబట్టి… తెలంగాణ జాగృతి తరపున కవిత కూడా దీన్ని సీరియస్ గా తీసుకునే అవకాశం ఉండవ్చచు. అప్పట్లో కేసీఆర్‌ పార్టీ పెట్టినప్పుుడు మొదట స్థానిక సంస్థల ఎన్నికల్లోనే పోటీ చేసి సత్తా చాటారు. ఎమ్మెల్యే, ఎంపీలు లేని నాటి టీఆర్ఎస్‌ తేలిగ్గానే జడ్పీ పీఠాల్ని దక్కించుకోగలిగింది. అప్పుడు తండ్రి చూపిన బాటలోనే ఇప్పుడు కుమార్తె కూడా నడవాలనుకుంటున్నట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. కవిత కూడా తాము కచ్చితంగా స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తామని, తమతో కలిసి నడవాలనుకున్న వాళ్ళు వచ్చి జాగృతి తరఫున పోటీ చేయొచ్చని చెబుతున్నారు. దీంతో… జాగృతి వేయబోతున్న లోకల్‌ స్టెప్స్‌ బీఆర్‌ఎస్‌ గుండెల్లో దడ పుట్టిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.

Exit mobile version