Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hanuman Ansh: నీమ్ కరోలి బాబా జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’ ఇప్పుడు బాలీవుడ్లోనే కాదు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఊహించని రీతిలో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఐదో వారాన్ని దాటిన తర్వాత కూడా వసూళ్ల జోరు తగ్గకపోగా, ఇండియాలో ఇప్పటికే రూ.200 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఇంతటి సంచలన విజయం సాధించిన సినిమాకు మరో అరుదైన అవకాశం కూడా ఉండేది. అదే ఆస్కార్ రేస్. కానీ ఆ అవకాశం మాత్రం మిస్ అయిపోయింది. అసలు ‘హనుమాన్ అంశ్’ ఆస్కార్‌కు ఎందుకు వెళ్లలేకపోయింది? నిర్మాత స్వయంగా చెప్పిన కారణమేంటంటే?
‘హనుమాన్ అంశ్’ను ఆస్కార్‌కు భారతదేశ అధికారిక ఎంట్రీగా పంపించకపోవడానికి కారణం నిర్మాత నమ్రతా సింగ్ స్పష్టం చేశారు. ఆస్కార్ ఎంట్రీ కోసం భారతదేశం నుంచి గడువు సెప్టెంబర్ 7తో ముగిసిపోయిందని, అయితే ఆ డెడ్‌లైన్ గురించి సరైన సమయంలో మా టీమ్ కు తెలియలేదని ఆమె వెల్లడించారు. సినిమా ఆస్కార్‌కు ఎందుకు పంపలేదని ప్రశ్నిస్తూ తనకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయని కూడా చెప్పారు. తమ టీమ్ చాలా చిన్నదని, ఒకేసారి సినిమా రిలీజ్, ప్రమోషన్స్ పనులను చూసుకోవాల్సి రావడంతో ఈ విషయంలో పొరపాటు జరిగిందని వివరించారు.
Also Read
- Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
- Alias Rukmini : నితిన్ 'అలియాస్ రుక్మిణి' రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
- Prabhas - Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
- Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
నిజానికి ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధిస్తుందని మొదట్లో ఎవ్వరూ ఊహించలేదు. మొదటి నెమ్మదిగా సాగిన వసూళ్లు ఆ తర్వాత మౌత్ టాక్‌తో ఒక్కసారిగా పుంజుకున్నాయి. ఆ తర్వాత రూ.200 కోట్ల మార్క్‌ను కూడా దాటింది. రూ.2 కోట్ల బడ్జెట్‌తో పోలిస్తే ఇది ఏకంగా వంద రెట్లకు పైగాఆ లాభాలను తెచ్చిపెట్టిన సినిమాగా నిలిచింది. అయితే ఈ సినిమా టీమ్ అప్పటికే మరో పెద్ద పనిలో బిజీగా ఉంది. ‘హనుమాన్ అంశ్’ను అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేయడానికి అవసరమైన సెన్సార్ ప్రక్రియ, విదేశాల్లో రిలీజ్‌కు కావాల్సిన మెటీరియల్, డబ్బింగ్ వంటి పనులు వరుసగా సాగుతున్నాయి. ప్రస్తుతం సినిమాను తెలుగులోకి కూడా డబ్ చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సమర్పణలో తెలుగు వెర్షన్ సెప్టెంబర్ 18న థియేటర్లలోకి రానుంది.
ఇక ‘హనుమాన్ అంశ్ 2’లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ కనిపించవచ్చనే ప్రచారం కూడా మొదలైంది. నీమ్ కరోలి బాబాపై వారికి ఉన్న భక్తిని దృష్టిలో పెట్టుకుని వారి కథను సినిమాలో చూపించే ఆలోచన ఉన్నట్లు నిర్మాత వెల్లడించినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. అయితే విరాట్, అనుష్కల నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. మొత్తానికి ‘హనుమాన్ అంశ్’ బాక్సాఫీస్ దగ్గర సాధించిన విజయం ఇప్పుడు మరో చర్చకు దారితీసింది. సినిమా ఆస్కార్‌కు వెళ్లే అవకాశం ఉందా లేదా అన్నది పక్కన పెడితే, కేవలం రూ.2 కోట్లతో రూపొందిన ఒక చిన్న సినిమా దేశవ్యాప్తంగా ఇంతటి ప్రభావం చూపించడం మాత్రం 2026లో అతిపెద్ద సర్ప్రైజ్లలో ఒకటిగా నిలిచింది. ఆస్కార్ డెడ్‌లైన్ మిస్ కావడం నిర్మాతకు బాధ కలిగించినా, ఈ సినిమా సృష్టించిన బాక్సాఫీస్ చరిత్ర మాత్రం ఇప్పటికే ప్రత్యేకంగా నిలిచిపోయింది.
- Tags
- cinema
- Hanuman Ansh
తాజావార్తలు
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!