Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
- సీఎం పదేపదే హెచ్చరిస్తున్నా మారని కొందరు ఏపీ మంత్రులు
- తాజా కేబినెట్ మీటింగ్లో స్థానిక ఎన్నికల సలహాలపై సీరియస్
- కోర్ట్ పరిధిలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అంశం
- ఇప్పటికిప్పుడు ఎన్నికలకు ఎందుకంటూ కొందరి ఉచిత సలహా
- ఎన్నికల వాయిదా ప్రతిపాదనపై సీఎం సీరియస్?
- ప్రభుత్వ పనితీరుకు పరీక్ష అన్న రీతిలో ఉండాలన్న సీఎం
- అలర్ట్గా ఉండకుండా వాయిదా కోరడమేంటని మంత్రులకు క్లాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఏపీ కేబినెట్ మినిస్టర్స్ కొంత మందిపై సీఎం చంద్రబాబు పదే పదే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శాఖల వారీగా సమీక్షల నుంచి ప్రజలతో సంబంధాల వరకు… రకరకాల అంశాల్లో ఆ బాపతు మంత్రులంతా పని తీరు మార్చు కోవాలని అదే పనిగా చెబుతున్నారాయన. అయినా సరే… వాళ్ళలో మార్పు లేదు సరికదా….ఏమవుతుందిలే అన్న నిర్లిప్తత పెరుగుతున్నట్టు ప్రభుత్వ వర్గాలే చెప్పుకుంటున్నాయి. ఇప్పటికీ కొద్ది మంది అదే స్థితిలో ఉన్నారట. ఇక తాజా కేబినెట్ మీటింగ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా కొంత మంది మంత్రుల మీద ముఖ్యమంత్రి ఫైరైనట్టు తెలిసింది. ఒక దశలో వాళ్ళ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండమని చాలా రోజులుగా టీడీపీ లీడర్స్ని హెచ్చరిస్తూనే ఉన్నారు చంద్రబాబు. కొద్ది మంది మంత్రులు ఆ మాటల్ని పట్టించుకోకుండా… అంతలా మిన్ను విరిగి మీద పడ్డప్పుడు చూసుకుందామన్నట్టు ఉన్నారని అంటున్నారు. ఇక మంత్రివర్గ సమావేశంలో అలాంటివాళ్ళే ఏదో మాట్లాడబోయి ఇరుక్కున్నట్టు తెలిసింది.
స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశం కోర్ట్ పరిధిలో ఉన్నందున ఆ తీర్పు వచ్చిన రెండు వారాల తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందంటూ…. అడక్కపోయినా తమ అభిప్రాయం చెప్పేశారట ఇద్దరు ముగ్గురు మినిస్టర్స్. అక్కడితో ఆగకుండా…. ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్లడం గురించి ఆలోచించాలని ఉచిత సలహా కూడా ఇచ్చేసినట్టు సమాచారం. ఆ మాటలు విన్న సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. లోకల్ ఎన్నికలకు సిద్ధం కండని ఎప్పట్నుంటో చెబుతుంటే….. ఇప్పుడొచ్చి మళ్లీ మాట్లాడుతున్నారా? రెండు వారాలు గడువు ఎందుకని సీఎం ప్రశ్నించినట్టు తెలిసింది. చెప్పడానికంటే ముందే బాధ్యత తీసుకుని ఎన్నికలకు సన్నద్ధం అవ్వాల్సిన… మంత్రులు… ఇలా ఉండడం ఏంటని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. కూటమి రెండేళ్ల పాలన ఈ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో ఇంత అలసత్వంగా ఉంటే ఎలా అంటూ క్లాస్ పీకినట్టు చెప్పుకుంటున్నారు. గ్రామం నుంచి జిల్ల్లా స్థాయి వరకు బలాబలాలు…..వార్డ్ మెంబర్.. నుంచి..మేయర్ వరకు అన్ని స్థాయిలో….ఎన్నికలు ప్రభావితం చూపుతాయని, ఒక రకంగా ప్రభుత్వ పనితీరుకు పరీక్ష అన్నట్టు ఎన్నికలు జరుగుతాయని… అలాంటి సందర్భంలో కొంతమంది మంత్రులు ఇంత ఉదాసీనంగా ఉంటే ఎలాగని సీఎం ప్రశ్నించినట్టు తెలిసింది.
Also Read
ఎన్నికలు పూర్తయితే…. స్థానిక సంస్థలకు కేంద్ర నిధులు వస్తాయని చెబుతూ….. ప్రత్యేక అధికారుల పాలనను ఎంత కాలం కొనసాగిస్తామని ప్రశ్నించినట్టు తెలిసింది. ఇలాంటి సందర్భంలో అలర్ట్గా ఉండకుండా… మంత్రులే ఎన్నికల్ని వాయిదా వేయమని కోరడం కరెక్టేనా అంటూ నిలదీసినట్టు సమాచారం. ఇక ఎన్నికల్లో తటస్థులకు టిక్కెట్స్ ఇచ్చే విషయంలో కూడా ఒకసారి ఆలోచించాలని ఒకరిద్దరు మంత్రులు సూచించారట. పార్టీలో ఎక్కువ కాలం ఉన్న వారిని గుర్తించి సీట్లు ఇవ్వాలనే అభిప్రాయాన్ని కొంతమంది మంత్రులు వ్యక్తం చేసినట్టు సమాచారం. మిగతా వ్యవహారాలు ఎలా ఉన్నా…. బీసీ రిజర్వేషన్ల కేసును బేస్ చేసుకుని ఎన్నికలు వాయిదా వేద్దామన్న సూచనపై మాత్రం సీఎం బాగా సీరియస్ అయ్యారన్నది కేబినెట్ ఇన్సైడ్ టాక్. ముందైతే మీరు సిద్ధంగా ఉండండని మినిస్టర్స్ అందరికీ దాదాపు హెచ్చరికతో కూడిన సందేశం పంపారట సీఎం.
తాజావార్తలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!