Alampur Seat: అలంపూర్ లో అలజడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వారసుడికోసం ఆ ఎమ్మెల్యే ప్లాట్‌ఫారం సిద్ధం చేస్తున్నారు కూడా. ఇంతలో ఏమైందో ఏమో.. అధికారపార్టీకి చెందిన ఇతర నేతలు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. బరిలో ఉంటామని సంకేతాలిస్తున్నారట. మరికొందరైతే అనుచరులను బరిలో దింపేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం. దీంతో నియోజకవర్గంలో అలజడి మొదలైందట.
అలంపూర్‌లో టీఆర్‌ఎస్ నేతల దూకుడు
జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గం టీఆర్ఎస్ రాజకీయం వేడెక్కుతోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం పాత, కొత్త నాయకులు గట్టి ప్రయత్నాలే మొదలుపెట్టారట. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన అలంపూర్‌లో పట్టున్న ఇతర సామాజికవర్గాల నాయకులు కూడా తమ అనుయాయులను పోటీలో నిలిపే పనిలో ఉన్నారు. నియోజకవర్గాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తుండటంతో స్థానికంగా రాజకీయం ఆసక్తిగా మారుతోంది. ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా అబ్రహం ఉన్నారు. టికెట్ కోసం పార్టీలో పోటీ చూశాక.. అబ్రహం వర్గం గుర్రుగా ఉందట. తమ నేతపై దుష్ప్రచారం చేసి.. ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నట్టు అనుమానిస్తోంది ఎమ్మెల్యే వర్గం.
Also Read
అబ్రహం కుమారుడు అజేయ్ గేర్ మార్చారా?
అలంపూర్ రిజర్వ్డ్ నియోజకవర్గంగా మారిన తర్వాత కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు అబ్రహం. 2014లో కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో టీడీపీ నుంచి పోటీ చేసి .. రెండో ప్లేస్‌లో నిలిచారాయన. 2018 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ కండువా కప్పుకొని పోటీ చేసి.. భారీ మెజారిటీతో గెలిచారు. ప్రస్తుతం వయసు మీరడంతో వచ్చే ఎన్నికల్లో అబ్రహం బదులు ఆయన కుమారుడు డాక్టర్ అజేయ్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అజేయ్‌కు ఆసక్తి ఉంటే.. ఆ మేరకు సిద్ధం చేసుకోవాలని పార్టీ పెద్దలు అబ్రహానికి చెప్పినట్టు టాక్. ప్రస్తుతం డాక్టర్ అజేయ్ అలంపూర్‌లో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారట.
ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న మందా జగన్నాథం?
ఇదే సమయంలో టీఆర్ఎస్‌లోని ఇతర నాయకులు కూడా టికెట్ ఆశించి గేర్ మార్చడం చర్చగా మారింది. జడ్పీ మాజీ ఛైర్మన్ బండారి భాస్కర్ మరో కుంపటి పెట్టారట. ఎమ్మెల్యే అబ్రహంను విభేదిస్తున్న పార్టీ కేడర్‌తో బండారి టచ్‌లో ఉంటున్నారట. మాజీ ఎంపీ మందా జగన్నాథం కూడా ఎమ్మెల్యే అనిపించుకోవాలని చూస్తున్నారట. తెలంగాణ ఉద్యమ పోరాటం.. సీఎం కేసీఆర్‌తో ఉన్న పరిచయాలతో ఈసారి టికెట్ ఇస్తారని మందా జగన్నాథం వర్గీయులు ప్రచారం మొదలుపెట్టేశారు. 2014లో జగన్నాథం నాగర్‌కర్నూల్ ఎంపీగా.. ఆయన తనయుడు శ్రీనాథ్ అలంపూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఓటమి తర్వాత ముఖం చాటేశారనే అభిప్రాయం పార్టీలో ఉందట.
అధిష్ఠానం దగ్గర ఇతర నేతల లాబీయింగ్
అలంపూర్‌లో పట్టున్న ఇతర సామాజికవర్గాల నేతలు.. ఎస్సీలలో తమ అనుయాయులకు టికెట్ ఇప్పించుకోవాలని చూస్తున్నారు. పార్టీ యువజన నాయకుడు కిశోర్‌ను తమ శిబిరంలో చేర్చుకుని గద్వాల జడ్పీ ఛైర్‌పర్సన్ సరితా తిరుపతయ్య దంపతులు తమ స్థాయిలో టికెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారట. ఇదే విధంగా మరికొందరు నాయకులు కూడా తమ అనుచరుల కోసం అధిష్ఠానం పెద్దల దగ్గర లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మార్పు ఆశిస్తుందో లేదో కానీ.. పార్టీ నాయకులు మాత్రం లోకల్ పాలిటిక్స్‌ను హీటెక్కిస్తున్నారు. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Team India Squad: ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
-
RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్‌న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్‌బై
-
SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
-
Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!