Site icon NTV Telugu

BJP: ఆదిలాబాద్ బీజేపీలో తారాస్థాయికి విభేదాలు..!

Bjpnnn

Bjpnnn

ఆదిలాబాద్ జిల్లా బిజెపిలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎన్నికలు ఇప్పడప్పుడే లేకున్నా టికెట్ కోసం ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. అదిష్టానం మెప్పు కోసం వేర్వేరుగానే కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఐతే ఉన్నట్టుండి బిజెపీ నాయకురాలు, మాజీ జెడ్పి చైర్‌పర్సన్ సుహాసిని రెడ్డి టిఆర్ఎస్‌లో చేరబోతున్నారని ప్రచారం షురూ చేశారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న ఫొటో కలిపి ఓ న్యూస్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. ఇది సుహాసిని రెడ్డి వ్యతిరేక వర్గం వాట్సాప్ స్టేటస్‌లో..అటు సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతోంది.

ఇక…దీనిపై సుహాసిని రెడ్డి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత బిజెపి సీనియర్ నేతలతో టచ్‌లో ఉండి తనకే టికెట్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస్ రెడ్డి. ఆయన కూడా పార్టీ మారుతున్నట్టుగా న్యూస్ స్ప్రెడ్ చేశారు. ఫొటో పెట్టి దాని కింద కాంగ్రెస్‌లోకి కంది శ్రీనివాస్ రెడ్డి అంటూ క్యాఫ్షన్ ఇచ్చి వైరల్ చేస్తున్నారట.
ఐతే…ఈరెండు పోస్టులు ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా బిజెపి నేతలను కలవరానికి గురిచేస్తున్నాయట. సోషల్ మీడియా న్యూస్‌కు సంబందించిన ఓ యాప్‌లో ఇది వచ్చినట్టుగా క్రియేట్ చేసి ప్రచారం చేస్తున్నారు. తమ వ్యతిరేక వర్గానికి సంబందించిన న్యూస్ అంటూ ఇంకో వర్గం వైరల్ చేయడం..వాట్సాప్‌లో స్టేటస్‌లు పెట్టుకోవడం కలకలం రేపుతోంది.

మరోవైపు…పబ్లిసిటి కోసమే ఇందంతా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీలో ఇమేజ్ డ్యామేజ్ కోసం ఇలా చేస్తున్నారనే చర్చ కూడా సాగుతోంది. రెండు పోస్టులపై ఇద్దరు నేతలూ పోలీసులను ఆశ్రయించారు.
-బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్‌పై కొంత కాలంపాటు అధికార పార్టీ సోషల్ మీడియా వేదికగా కొన్ని వీడియోలను ప్రచారం చేసింది. ఆడియోలు ఆ మధ్య వైరల్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా టికెట్ రేసులో ఉన్నామనుకునే మిగిలిన ఇద్దరు నేతలపైనా ఇలాంటి పోస్టులు వైరల్ కావడంపై ఆరా తీస్తున్నారు. వ్యతిరేక వర్గమే ఇలా చేస్తోందని సొంత పార్టీల నేతలే అనుమానిస్తున్నారట. సుహసిని రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిపై ఇలాంటి ప్రచారం రావడం వెనుక ఓ సీనియర్ నేత హస్తం ఉందనే అనుమానాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఫేక్ న్యూస్ ఆ ఇద్దరు నేతలకు తలనొప్పిగా మారింది. అధిష్టానం సైతం దీనిపై ఆరా తీస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.

Exit mobile version