Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Acp Vasool Raja In Hyderabad City

వసూల్ రాజాకు చెక్ పెడతారా?

Published Date :January 7, 2022 , 7:26 pm
By NTV WebDesk
వసూల్ రాజాకు చెక్ పెడతారా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

హైదరాబాద్‌లో అత్యంత ప్రముఖులు ఉండే ఏరియాలో ఆయన పోలీస్‌ అధికారి. ఓ మంత్రి రికమండేషన్‌తో వచ్చారట. ఛార్జ్‌ తీసుకున్నప్పటి నుంచి ఓ రేంజ్‌లో వసూళ్లే వసూళ్లు. సమస్య ఏదైనా ఆయన లెక్క వేరని కథలు కథలుగా చెప్పుకొనే పరిస్థితి ఉందట.

మంత్రి రికమండేషన్‌తో హైదరాబాద్‌లో ఏసీపీగా రాక..!
పోలీస్‌ శాఖలో హైదరాబాద్‌ పరిధిలో పోస్టింగ్‌ అంటే కానిస్టేబుల్ నుంచి అధికారుల వరకు ఒక క్రేజ్‌ ఉంటుంది. పైరవీలు చేసేవాళ్లూ ఎక్కువే. హోదాలను బట్టి ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి రికమండేషన్లు పనిచేస్తుంటాయి. ఆ విధంగా ఒక మంత్రి రికమండేషన్‌పై పదోన్నతిపై ACPగా సిటీకి వచ్చారు DSPస్థాయి అధికారి. నగరం నడిబొడ్డున ప్రముఖులు ఉండే ప్రాంతంలో పోస్టింగ్‌. హైదరాబాద్‌కు వచ్చే వరకూ ఆ అధికారి సిటీ బయటే పనిచేశారట. దాంతో హైదరాబాద్‌లోని సమస్యలు.. ప్రముఖులు ఉండే ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పెద్దగా తెలియవన్నది డిపార్ట్‌మెంట్‌లో వినిపించే మాట.

చేతిలో పైకం పడితేనే పని చేస్తారట..!
ఏదో రికమాండేషన్‌పై ACPగా వచ్చారు. పని నేర్చుకుంటారు.. పోలీసులకు ఆదర్శంగా నిలుస్తారని అనుకుంటే.. అంతా రివర్స్‌. ఛార్జ్‌ తీసుకున్నప్పటి నుంచి ఆయన ఆలోచన ఒక్కటే. వస్తున్న ఆరోపణలు ఒక్కటే. సామాన్యం జనం.. పోలీసులు అనే తేడా లేదట. పని ఏదైనా.. ఆ ACP సార్‌కు చేతిలో బరువైన తాంబూలం పెట్టాల్సిందే. పని అడిగితే ఆయన చేతిలో పైకం పడితేనే ఫైల్‌ అయినా.. కేసు డైరీ అయినా కదులుతుందట. జేబులో దండిగా డబ్బులు లేకుండా ACP ఛాంబర్‌లోకి అడుగుపెట్టడం వేస్ట్‌ అన్నది ఆయన పరిధిలో పోలీసుల టాక్‌.

కేసు క్లోజ్‌ చేయాలన్నా ‘లాభం’ చూసుకోవాల్సిందే..!
కొన్ని కేసుల్లో సాక్ష్యాలు లేకనో.. బాధ్యులు రాజీ పడో.. పిటిషన్‌ వెనక్కి తీసుకోవాలని అనుకుంటారు. దర్యాప్తు అధికారి కేసు నమోదు చేసినా.. ఆ కేసును క్లోజ్‌ చేసే అధికారం DSP స్థాయి అధికారిదే. అలా కేసు క్లోజ్‌ చేయమని తన దగ్గరకు వచ్చే ఫైళ్లను చాలా నిశితంగా పరిశీలిస్తారట. సార్‌.. కేసు క్లోజ్‌ చేయాలని చెప్పగానే.. అయితే నాకేంటి అని మొహమాటం లేకుండా అడగడం ఆయన స్టయిల్. లాభం లేకుండా సంతకం ఎలా పెడతానని చెప్పేస్తారట. ఈ వైఖరి ఆ ACP పరిధిలో పనిచేసే ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలకు ఇబ్బందిగా మారినట్టు సమాచారం. ఎవరైనా పైఆఫీసర్లు.. ఆ ACP పరిధిలో పనిచేసే కిందిస్థాయి సిబ్బంది గురించి ఆరా తీస్తే.. ఆయనకు పండగే. తనను సంతృప్తిపర్చని వాళ్ల గురించి తప్పుడుగా రిపోర్టులు పంపుతారట. ఇప్పటికే అలా కొందరి గురించి రాంగ్‌ రిపోర్ట్స్‌ పంపినట్టు సమాచారం.

ఉన్నతాధికారులు ఆ ఏసీపీని దూరం పెట్టారా?
ఈ ACP గురించి తెలుసుకున్న సిటీలోని కొందరు ఉన్నతాధికారులు ఆయన్ని చాలా వరకు దూరం పెట్టారని సమాచారం. పని తెలియదు.. జిల్లాల నుంచి నేరుగా సిటీకి వచ్చి సొంత దుకాణం తెరిచారని గుర్రుగా ఉన్నారట. మంత్రిగారి రికమండేషన్‌ అనో ఏమో.. పోలీస్‌ బాస్‌లు టచ్‌మీ నాట్‌గా ఉండటం చర్చగా మారుతోంది. సమస్య ముదిరి.. రచ్చకాకముందే వసూల్‌ రాజాకు చెక్‌ పెడతారో లేదోనని పోలీస్‌ వర్గాల్లో ఒక్కటే చర్చ.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • acb chamber
  • acp
  • cases
  • collections
  • hyderabad

తాజావార్తలు

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

  • Chodavaram TDP Clash: టీడీపీ వర్సెస్ టీడీపీగా పంచాయితీ.. చోడవరంలో ఏం జరుగుతోంది?

  • OTR: ఐవీఆర్ఎస్‌ సర్వే రిపోర్ట్స్‌.. బెంబేలెత్తిపోతున్న ఆ ఎమ్మెల్యేలు..!

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions