NTV Telugu Site icon

Tollywood: చిన్న సినిమాలకి సెలబ్రిటీలు ఎందుకు సపోర్ట్ చేయాలి?

Rakesh Varre Dil Raju

Rakesh Varre Dil Raju

టాలీవుడ్ లో ప్రస్తుతం ఒక అంశం హాట్ టాపిక్ అవుతుంది. అదే చిన్న సినిమాలను సపోర్ట్ చేయడానికి సెలబ్రిటీలు ఎందుకు రారు అనేది. అసలు విషయం ఏమిటంటే బాహుబలి సినిమాలో కీలకపాత్రలో నటించిన రాకేష్ తర్వాత ఎవరికీ చెప్పొద్దు అనే సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత ఏకంగా నిర్మాతగా పేక మేడలు అనే సినిమా చేశాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన జితేందర్ రెడ్డి అనే సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన సెలబ్రిటీలు సినిమాను సపోర్ట్ చేయడానికి రారండీ వాళ్లను రప్పించడం కంటే ఒక సినిమా చేసేయడం బెటర్ అంటూ హాట్ కామెంట్స్ చేశాడు. నిజానికి ఈ కామెంట్స్ తో సినిమా మీద కూడా ప్రేక్షకుల్లో కొంత ఆసక్తి ఏర్పడింది కూడా, ఆ విషయంలో రాకేష్ సక్సెస్ అయ్యాడు. అయితే ఈరోజు మరో సినిమా సక్సెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ అసలు సెలబ్రిటీలు ఎందుకు రావాలి? ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటే రావాలని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నట్లుగా మాట్లాడారు.

Love Cheating: ప్రేమ పేరుతో యువతిని మోసం చేసి.. మోజు తీరాక..!

అయితే అసలు చిన్న సినిమాలను సపోర్ట్ చేయడానికి సెలబ్రిటీలు రావాలా అక్కర్లేదా అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో మొదలైంది. నిజానికి చిన్న సినిమాలకు సెలబ్రిటీలు సపోర్ట్ చేయడం ఇప్పటి సంగతి కాదు, ఎప్పటినుంచో చిన్న సినిమాలలో కంటెంట్ ఉందనో లేక ఆ సినిమా చేస్తున్న వారు తమకు బాగా కావలసిన వారనో చాలామంది సెలబ్రిటీలు సపోర్ట్ చేస్తూ ఉంటారు. సెలబ్రిటీలు అంటే కేవలం హీరో హీరోయిన్లు మాత్రమే కాదు ఫేమస్ డైరెక్టర్లు, ఫేమస్ ప్రొడ్యూసర్లు సైతం తమ అనుకున్న వారికోసం ముందుకు వచ్చి సపోర్ట్ చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అంత ఎందుకు రాకేష్ ప్రొడ్యూస్ చేసిన పేక మేడల సినిమా విషయంలో కూడా చాలామంది సపోర్ట్ చేశారు. అయితే జితేందర్ రెడ్డి సినిమా విషయంలో సపోర్ట్ చేయలేదని ఇప్పుడు ఆయన ఈ ఆరోపణలు చేస్తున్నారు. జితేందర్ రెడ్డి అనేది ఒక ఏబీవీపీ దివంగత నేత బయోపిక్. అంటే ఒక రకంగా బిజెపి అనుకూలంగా ఉన్నవారు మాత్రమే బాహాటంగా బయటకు వచ్చి సినిమాని సపోర్ట్ చేయగలిగే పరిస్థితి.

దానికి తోడు నక్సలిజాన్ని, వామపక్ష భావాలను జితేందర్ రెడ్డి కి వ్యతిరేకంగా చూపించడంతో బహిరంగంగా వచ్చి సపోర్ట్ చేస్తే తమకు ఏదైనా భావజాలం అంట కడతారేమో అనే ఉద్దేశంతో కొంతమంది వెనకడుగు వేసి ఉండవచ్చు. కానీ అంతమాత్రానికి సెలబ్రిటీలు రారు, వాళ్లను పిలిచినా ఉపయోగం లేదు అంటూ కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ప్యాన్ ఇండియా లెవెల్ లో ఉన్న ప్రభాస్ లాంటి హీరోనే అసలు ఏ సపోర్ట్ లేకుండా సినిమా చేసిన లవ్ రెడ్డి లాంటి సినిమా అని తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో సపోర్ట్ చేసి చిన్న సినిమాకి సెలబ్రిటీల అండ ఎప్పుడు ఉంటుందని ప్రూవ్ చేశాడు. ఇవాల్టి రోజున జితేందర్ రెడ్డి అనే సినిమాకి సెలబ్రిటీలు బాహాటంగా ప్రెస్ మీట్ కి హాజరు కాకుండా పోవడం వల్ల వాళ్ళు చిన్న సినిమాకి సపోర్ట్ చేయడం లేదు అనే మాటలు మాట్లాడడం ఏమాత్రం కరెక్ట్ కాదు. సినిమాకి ఎప్పుడు సెలబ్రిటీల సపోర్ట్ ఉంటుంది కానీ ఇలాంటి బయోపిక్ చేస్తున్నప్పుడు ఎవరైనా తమను ఒక భావజాలానికి పరిమితం చేస్తారేమో అనే భయంతో కాస్త వెనకడుగు వేసే అవకాశం ఉంది. అంతమాత్రాన సెలబ్రిటీలను తప్పుపట్టాల్సిన అవసరం లేదు అనే వాదన సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

Show comments