Tollywood : నిర్మాతల్లో మొదలైన మార్పు.. ఇక హీరోలకు నో రెమ్యునరేషన్స్

Tollywood

Tollywood

టాలీవుడ్‌లో నిర్మాణ వ్యయాలు బాగా పెరిగిపోయాయి. ఒకప్పుడు ఎక్కువగా బడ్జెట్‌ను మేకింగ్ కోసం ఖర్చు పెట్టేవారు, కానీ ఇప్పుడు స్టార్ వ్యాల్యూ పెరిగిపోవడంతో సినిమా నిర్మాణంలో దాదాపుగా 60 నుంచి 70 శాతం వరకు డైరెక్టర్ సహా హీరో, హీరోయిన్, ఇతర నటీనటుల రెమ్యూనరేషన్ల కోసమే ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అయితే, ఇదే కోవలో ఒక రేంజ్ వరకు ఖర్చు పెడుతూ వెళ్లిన బాలీవుడ్ ఇప్పుడు పద్ధతి మార్చుకుంది. హీరోలకు రెమ్యూనరేషన్లు కాకుండా లాభాల్లో వాటాలు ఇస్తూ అక్కడ నిర్మాతలు సినిమాలు చేస్తున్నారు. ప్రొడ్యూసర్ పెట్టాలనుకున్న ఖర్చులో ఎక్కువ భాగం మేకింగ్ కోసమే ఖర్చు పెడుతున్నారు.

ఇక త్వరలో టాలీవుడ్‌లో కూడా అలాంటి పరిస్థితులే రాబోతున్నాయంటున్నారు. ఒక టాలీవుడ్ లీడింగ్ ప్రొడ్యూసర్ తాజాగా ఆఫ్ ది రికార్డుగా మాట్లాడారు. భవిష్యత్తులో బాలీవుడ్ తరహా మోడల్ టాలీవుడ్‌లోకి కచ్చితంగా వస్తుందని, ఇప్పటికే కొంతమంది నిర్మాతలు ఈ మేరకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. వాస్తవానికి టాలీవుడ్‌లో కూడా ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కొక్క స్టార్ హీరో 35 కోట్ల నుంచి రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నారు. ఆ అమౌంట్ మేకింగ్ మీద పెడితే ఖచ్చితంగా సినిమా క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఎలాగూ ఆయన రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమాకి వర్క్ చేస్తే, ఖచ్చితంగా తన హండ్రెడ్ పర్సెంట్ సినిమాకి పెట్టే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో, ఈ రకమైన మోడల్‌ను టాలీవుడ్‌లో కూడా అమలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

వాస్తవానికి అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు ఇప్పటికీ ఈ మోడల్ మీదే వర్క్ చేస్తున్నట్లుగా ప్రచారం ఉంది. భవిష్యత్తులో టాలీవుడ్ నిర్మాతలు చేసే సినిమాలు కూడా ఇదే విధంగా ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.