Site icon NTV Telugu

Tollywood : 9 హిట్లు.. 2025 హాఫ్‌ ఇయర్ విన్నర్ ఆ హీరోనే..!

Tollywood

Tollywood

Tollywood : 2025వ సంవత్సరంలో ఆరు నెలలు గడిచిపోయాయి. ఈ అర్ధ సంవత్సరంలో స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు, యావరేజ్, చిన్నా చితక సినిమాలు బాగానే వచ్చాయి. కానీ అందులో హిట్ కొట్టిన సినిమాలు మాత్రం 9 మాత్రమే. ఈ ఏడాది సంక్రాంతికి సినిమాల జోరు మొదలైంది. విక్టరీ వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం యునానిమస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా రూ.300 కోట్ల వసూళ్లు సాధించి భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఎన్నో అంచనాలతో వచ్చిన రామ్ చరణ్‌ గేమ్ ఛేంజర్ మూవీ ప్లాప్ అయింది. ఆ తర్వాత డాకు మహారాజ్ మూవీ యావరేజ్ హిట్ అందుకుంది. అఖండ రేంజ్ లో ఊహించుకున్న వారికి కొంత నిరాశ కలిగించినా.. ప్రేక్షకులు ఒకసారి చూసేలాగా ఉంది.

read also : HHVM : వీరమల్లు ట్రైలర్ అద్భుతంగా ఉంది.. నాగవంశీ పోస్ట్ వైరల్..

ఇక తండేల్ మూవీ ఎన్నో ఏళ్లుగా హిట్ కోసం వెయిట్ చేస్తున్న నాగచైతన్యను ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేర్చేసింది. ఆ దెబ్బతో చైతన్య మార్కెట్ అమాంతం పెరిగింది. నాని నిర్మించిన కోర్టు మూవీ అనుకున్న దానికంటే డబుల్ హిట్ అయి భారీ లాభాలు తెచ్చిపెట్టింది. అదే నాని హీరోగా వచ్చిన హిట్-3 కూడా వంద కోట్ల క్లబ్ లో చేరి మంచి హిట్ తెచ్చుకుంది. శ్రీ విష్ణు హీరోగా వచ్చిన సింగిల్ మూవీ హైప్ లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇది కూడా భారీ లాభాలను సాధించింది.

మ్యాడ్ కు సీక్వెల్ గా వచ్చిన మ్యాడ్ స్వ్కేర్ మూవీ హిట్ ట్రాక్ లోకి ఎక్కింది. జూన్ లో వచ్చిన కుబేర బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంది. ఏకంగా వంద కోట్ల క్లబ్ లో మూడు రోజుల్లో చేరింది. ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వచ్చిన కన్నప్ప మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా ఆడుతోంది ఈ మూవీ. ఈ ఆరు నెలల్లో చాలా సినిమాలు వచ్చినా ఈ 9 సినిమాలే హిట్ అయ్యాయి.

8 వసంతాలు, సారంగపాణి జాతకం, ఓదెల-2, భైరవం మంచి అంచనాలతో వచ్చి అనుకున్నంతగా ఆడలేకపోయాయి. ఇక ఈ ఆరు నెలల కాలంలో అన్నింటికంటే భారీ హిట్ అయింది మాత్రం సంక్రాంతికి వస్తున్నాం సినిమానే. బడ్జెట్ కంటే నాలుగు రెట్లు లాభాలు తెచ్చిపెట్టింది ఈ సినిమా. ఈ లెక్కన ఆ హాఫ్ ఇయర్ విన్నర్ గా విక్టరీ వెంకటేశ్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఈ సినిమానే నిలిచింది. ఈ ఆరు నెలల్లో పాన్ ఇండియా స్టార్లుగా దూసుకుపోతున్న ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్ బాబు సినిమాలు రాలేదు. ఆగస్టులో ఎన్టీఆర్, డిసెంబర్ లో ప్రభాస్ మూవీలు ఉండబోతున్నాయి.

read also : Kubera : పదేళ్లకే అన్నీ తెలుస్తున్నాయ్.. శేఖర్ కమ్ముల షాకింగ్ కామెంట్స్

Exit mobile version