నాగ చైతన్య నటించిన తాజా చిత్రం ‘తండేల్’. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఆడియన్స్‌ను హుషారెత్తించే అప్ డేట్ వచ్చింది. రేపు తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. తండేల్ జాతర పేరుతో మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ఈవెంట్ వేదిక కూడా ఖరారైంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈవెంట్ జరగనుంది. అల్లు అర్జున్ ముఖ్య అతిథి కావడంతో పర్మిషన్స్ టెన్షన్ పెరిగింది. ఫ్యాన్స్ సహా మీడియాలో అనుమతి నిరాకరించారు. కేవలం కెమెరాలతో రికార్డింగ్ మాత్రమే లైవ్ ఇవ్వనున్నారు.
READ MORE: Top Headlines @5PM : టాప్ న్యూస్
ఇదిలా ఉండగా.. ఇటీవల పుష్ప 2 మూవీ ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందారు. అనే విధంగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీనిపై బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో అల్లు అర్జున్‌ను అరెస్టు చేసిన జైలుకు పంపారు. ఒక రాత్రి మొత్తం అల్లు అర్జున్ జైల్లో గడిపారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సైతం జోక్యం చేసుకోవడంతో వివాదం పెద్దదైంది. ఈ నేపథ్యంలో మారోసారి ఐకాన్ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరవుతుండటంతో సినిమా యూనిట్‌లో టెన్షన్ పెరిగింది. వేదిక ఎంపిక, పర్మిషన్, ఏర్పాట్లు చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. చివరికీ అన్ని అడ్డంకులు తొలగడంతో ఈవెంట్‌ను సక్సెస్ చేసేందుకు నిర్వహకులు ప్రయత్నిస్తున్నారు.