Site icon NTV Telugu

NTV Podcast Promo: “ఆగడు” కథ చేసి ఉండకూడదు.. శ్రీను వైట్ల వద్ద రూ. 2000 కోట్లు!!

Srinu

Srinu

NTV Podcast Promo: శ్రీను వైట్ల.. ఒకప్పుడు ఆయన టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్లలో ఒకడు. శ్రీను వైట్ల డైరెక్షన్‌లో సినిమా వచ్చిందంటే బ్లాక్‌ బస్టర్‌ గ్యారెంటీ అనే నమ్మకం తెలుగు ప్రేక్షకుల్లో ఉండేది. కానీ ‘ఆగడు’ తర్వాత ఆయన జాతకం అడ్డం తిరిగింది. ఈ సినిమా అనంతరం వచ్చిన మూవీస్ అనుకున్న రీతిలో ఆడలేదు. అయితే.. శ్రీను వైట్లు తాజాగా పాడ్‌కాస్ట్‌విత్ ఎన్టీవీ(ntvPodcastShow)లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమొ విడుదలైంది. యాక్షన్‌తో కామెడీ మిక్స్ చేసిన “వెంకీ” సినిమా నాటి రోజులను శ్రీను వైట్ల గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాలో ట్రైన్ సీన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆస్తుల విలువ దాదాపు రూ. 2000 కోట్ల వరకు ఉంటుందనే వార్తలు అప్పట్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ వార్తలపై కూడా ఆయన స్పందించారు.

READ MORE: R*ape Victim: ఆడ శిశువుకు జన్మనిచ్చిన 15 ఏళ్ల అత్యాచార బాధితురాలు.. తండ్రిని గుర్తించేందుకు డీఎన్ఏ టెస్ట్

డబ్బుకు లిమిట్ ఉండదన్నారు శ్రీను వైట్ల. ప్రొడక్షన్ చేయడం తనకు పెద్ద కష్టం కాదన్నారు.. దేవుడిని నమ్ముతారా? అనే ప్రశ్నకు సమాధాన మిచ్చారు. ఆస్ట్రాలజీ తన జీవితంలో ఎప్పుడూ చూయించుకోలేదని స్పష్టం చేశారు. సినిమాల బడ్జెట్ పెంపుపై క్లారిటీ ఇచ్చారు. తన జీవితంలో ఒక్కసారిగా కుదుపులు, కొంత మంది నుంచి విమర్శులు రావడంపై వివరణ ఇచ్చారు. బాలకృష్ణతో ఎందుకు సినిమా చేయలేదో చెప్పారు. రిగ్రెట్ అయిన విషయంపై స్పందిస్తూ ఆగడు కథ చేసి ఉండకూడదని కీలక వ్యాఖ్యలు చేశారు. “ఆగడు విషయంలోనే ఎక్కువగా రిగ్రెట్ అవుతా. ఆగడు ఆ కథ చేసి ఉండకూడదు.” అన్నారు.

READ MORE: CPM Letter To Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌కు సీపీఎం లేఖ.. పంచాయితీల సంగతి చూడండి..!

 

Exit mobile version