Tollywood Ticket Rates: తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత నాగ వంశీ సినిమా టికెట్ రేట్ ల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ పరిశ్రమలో హాట్ టాపిక్ అవుతున్నాయి. నాగ వంశీ మాట్లాడుతూ సినిమాను మించిన చీపెస్ట్ ఎంటర్ టైన్ మెంట్ మరోటి లేదు 1500 పెడితే నలుగురు కలిసి సినిమా ఎంఙాయ్ చేయచ్చు. నలుగురున్న కుటుంబం మూడు గంటల పాటు 1500 రూపాయలతో ఎంజాయ్ చేసి బయటకు వెళ్లే అవకాశం ఉందని వెల్లడించారు. ఇంత తక్కువలో మూడు గంటలు ఎంటర్టైన్ చేసే వేరే ఏ అవకాశం అయినా ఉందా అని ఆయన ఎదురు ప్రశ్నించారు. అయితే ఆయన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అసలు తెలుగు సినీ పరిశ్రమకు టికెట్ రేట్లు పెంచితే ఉపయోగమా లేక తగ్గించితే ఉపయోగమా అనే చర్చ మొదలైంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ధియేటర్లకు ప్రేక్షకులు రావడమే గగనం అయిపోయింది. కల్కి, దేవర లాంటి భారీ బడ్జెట్ సినిమాలు వస్తే మాత్రమే ప్రేక్షకులు థియేటర్ల వరకు కదిలి వస్తున్నారు. అవి కూడా నెలలోపు ఓటీటీలోకి రావు అని కచ్చితంగా సమాచారం ఉంది కాబట్టే థియేటర్ల వరకు వస్తున్నారు.
Matka: లే లే రాజా అంటున్న నోరా.. సాంగ్ భలే ఉందే
అయితే టికెట్ రేట్లు పెంచి అమ్మితే దేవర లేదా కల్కి లాంటి సినిమాలను ఆ పెంచిన టికెట్ రేట్లతో కూడా చూసేందుకు ప్రేక్షకులు ఏమాత్రం వెనుకాడడం లేదు. సినిమా టాక్ మిశ్రమంగా వచ్చినా సరే వాటిని థియేటర్లలో చూస్తేనే కిక్ అని భావిస్తున్నారు కాబట్టి థియేటర్లకు వచ్చి చూస్తున్నారు. అయితే చిన్న సినిమాలు రిలీజ్ చేస్తున్నప్పుడు వాటికి తగ్గట్టుగా భారీగా టికెట్ రేట్లు తగ్గించి అమ్మినా సరే వాటిని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదు. దానికి రెండు ముఖ్య కారణాలు ఉన్నాయి. ఒకటి కుటుంబం అంతా కలిసి వెళ్లి సినిమా చూస్తే నాగవంశీ చెప్పినట్టుగా 1500 నుంచి 2000 వరకు ఖర్చు అవుతుంది. అయితే అదే సినిమా 15 నుంచి 30 రోజులలోపే థియేటర్ల నుంచి ఓటీటీలోకి వచ్చేస్తుంది. కుటుంబం అంతా ఇంట్లోనే కూర్చుని టీవీలో చూడొచ్చు అని భావిస్తూ టికెట్ రేట్లు తగ్గించినా చిన్న సినిమాలను కూడా పక్కన పెట్టేస్తున్నారు.
అలాగే వాటిని ఎక్కడ చూస్తే ఏమిటి? థియేటర్లనే చూడాల్సినంత అవసరం ఏముంది? అని ఫిక్స్ అయి లైట్ తీసుకుంటున్నారు ప్రేక్షకులు. ఓవరాల్ గా టికెట్ రేట్లు పెంచినా తగ్గించినా సినిమా టాక్ బాగున్న బాగోకపోయినా ప్రేక్షకులు థియేటర్లలో కొన్ని సినిమాలు చూడాలని అనుకుంటారు. వాటి స్కేల్ ని బట్టి స్థాయిని బట్టి బ్యాగ్రౌండ్ స్కోర్ ని బట్టి వీటిని థియేటర్లో చూడాలి, వీటిని ఓటీటీలో చూడాలి అనే విషయం మీద ఒక ఖచ్చితమైన అభిప్రాయానికి సినిమా రిలీజ్ సమయానికే వచ్చేస్తున్నారు ప్రేక్షకులు.
కాబట్టి సినిమా టికెట్ రేట్లు పెంచి అమ్మినా తగ్గించి అమ్మిన అది వాళ్ళ మీద పెద్ద ప్రభావం చూపి అవకాశమే లేదు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాకపోతే చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా టికెట్ రేటు పెంచి అమ్మడం వల్ల ధియేటర్ల వ్యవస్థ మీద ఖచ్చితంగా నెగిటివ్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్యూచర్లో పెద్ద సినిమాలను కూడా థియేటర్లలో చూడాలా అనే ఆలోచనకు ప్రేక్షకులు వచ్చినా అందులో ఆశ్చర్యం లేదు. కాబట్టి కాస్త తక్కువ రేట్లతోనే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే కంటెంట్తో వస్తే అది థియేటర్ వ్యవస్థకు ఉపయోగమని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.