Matka: లే లే రాజా అంటున్న నోరా.. సాంగ్ భలే ఉందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Le Le Raja Lyrical Video: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మట్కా’ రిలీజ్ కు రెడీగా వుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కూడా జోరందుకున్నాయి. మేకర్స్ ఫస్ట్ సింగిల్ లే లే రాజా విడుదల చేసి మ్యూజిక్ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేశారు. జివి ప్రకాష్ కుమార్ మెమరబుల్ రెట్రో పాటను స్కోర్ చేశారు. 70, 80ల స్టైల్‌లోని కంపోజిషన్ థంపింగ్ బీట్‌లతో అద్భుతంగా ఉంది. భాస్కరభట్ల సాహిత్యం రెట్రో అనుభూతిని కలిగిస్తుంది, నీతి మోహన్ వోకల్స్ కట్టిపడేశాయి.
Vettaiyan : నాలుగు రోజుల్లో వేటగాడు ఎంత కొల్లగొట్టాడంటే?
Also Read
ఈ పాటలో వరుణ్ తేజ్ డిఫరెంట్ గెటప్‌లలో ఆకట్టుకున్నారు. కలర్‌ఫుల్ పబ్ బ్యాక్‌డ్రాప్‌లో చిత్రీకరించిన పాటలో నోరా ఫతేహి రెట్రో లుక్‌లో అలరించింది. ఎక్స్ ట్రార్డినరీ డ్యాన్స్ మూవ్స్ తో సోఫియాగా గ్లామర్ క్వీన్‌లా కనిపించి మెస్మరైజ్ చేసింది. జానీ మాస్టర్ చేసిన కొరియోగ్రఫీ వింటేజ్ వైబ్స్ ని తీసుకొచ్చింది. ఇది మ్యూజికల్ ప్రమోషన్‌లకు పర్ఫెక్ట్ స్టార్ట్, నెక్స్ట్ వచ్చే సాంగ్స్ కోసం స్టేజ్ ని సెట్ చేసింది. టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో థియేట్రికల్ ట్రైలర్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా కనిపించనుంది. నవంబర్ 14న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజావార్తలు
-
Kishan Reddy: మేము ఓట్లను చోరీ చేయం.. ప్రజల మనసులను గెలుచుకుంటాం..
-
Aadhaar Biometric Update: ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఫ్రీ అప్డెట్కు సెప్టెంబర్ 30 చివరి తేదీ!
-
CM Vijay: కరూర్ తొక్కిసలాటకు ఏడాది.. ‘ఎప్పటికీ మానని గాయం’ అంటూ సీఎం విజయ్ భావోద్వేగం
-
SS Rajamouli 25 Years: కథలు మారాయి, హీరోలు మారారు.. కానీ జక్కన్న ఆలోచన మాత్రం మారలేదు!
-
Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?