Site icon NTV Telugu

Spirit : అక్కడున్నది ప్రభాస్.. సందీప్ రెడ్డి అంత ధైర్యం చేస్తాడా..?

Spirit

Spirit

Spirit : రెండు సినిమాలతోనే సెన్సేషనల్ డైరెక్టర్ అయిపోయాడు సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల్లో హీరోల పాత్రలను మరీ బోల్డ్ గా డిజైన్ చేసేశాడు. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా తీస్తున్నాడు. స్పిరిట్ కోసం అంతా రెడీ అయిపోయింది. త్రిప్తి డిమ్రీ హీరోయిన్. కానీ ఇక్కడే కొన్ని డౌట్లు రైజ్ అవుతున్నాయి. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల్లో ఓ రేంజ్ లో బూతు, బోల్డ్ డైలాగులు ఉన్నాయి. ఒక రకంగా ఆ రెండింటికీ అవే క్రేజ్ తెచ్చిపెట్టాయి. యూత్ ను ఓ ఊపు ఊపేశాయి. కానీ ఇప్పుడు చేస్తోంది ప్రభాస్ తో. డార్లింగ్ కు క్లీన్ ఇమేజ్ ఉంది.

Read Also : Param Sundari Trailer : రజినీకాంత్, బన్నీని ఇమిటేట్ చేసిన జాన్వీకపూర్

ఇప్పటి వరకు ఎలాంటి బోల్డ్, బూతు డైలాగులకు ఆయన ఛాన్స్ ఇవ్వలేదు. పక్కా యాక్షన్, ఎమోషన్ తోనే ఆయన సినిమాలు ఉంటాయి. అలాంటిది ప్రభాస్ తో బూతు డైలాగులు సందీప్ చెప్పిస్తాడా.. అంత ధైర్యం చేస్తే డార్లింగ్ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా అన్నది అనుమానమే. ఎందుకంటే ఇన్నేళ్లు ప్రభాస్ ను మోస్తున్న అభిమానులు.. ఆయన్ను ఎలాంటి వివాదాలు లేని హీరోగానే కీర్తిస్తున్నారు. అదే ఆయన స్థాయిని కూడా పెంచింది. కానీ అవతల ఉన్నది సందీప్. ఎలాంటి హీరో అయినా తన దారిలోకి తెచ్చేసుకుంటాడు.

ఈ సారి పోలీస్ పాత్రలో ప్రభాస్ కనిపిస్తున్నాడు. ఒక పబ్లిక్ సర్వీస్ లో ఉండే పోలీస్ పాత్రలో ఇలాంటి బూతు డైలాగులు ఉంటాయా ఉండవా.. ఒకవేళ ఉంటే అవి ఏ స్థాయి విమర్శలకు తావిస్తాయి అన్నది తెలియాలి. అసలే అర్జున్ రెడ్డి, యానిమాల్ సినిమాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. బూతు డైలాగులు, బోల్డ్ సీన్లు డిలీట్ చేయాలంటూ చాలా మంది నిరసన తెలిపారు. బట్ అవేవీ సందీప్ పట్టించుకోలేదు. మరి ప్రభాస్ విషయంలో అలాంటి డైలాగులు పెడుతాడా లేదా అన్నది చూడాలి.

Read Also : Faria Abdullah : ఫరియా అందాల మంటలు.. చూస్తే అంతే..

Exit mobile version