అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ఫ-2 చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. దేశ వ్యాప్తంగా ఊహకందని అంచనాలు ఉన్నాయి. దక్షిణాది మాత్రమే కాదు, బీహార్ సహా యావత్ ఉత్తర భారతదేశం అల్లు అర్జున్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. హిందీ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్‌లో 24 గంటల్లోనే లక్ష టికెట్స్ అమ్ముడు పోవటం దీనికి నిదర్శనం. ఈ మధ్యకాలంలో ఏ పాన్ ఇండియా సినిమాకు రానంత హైప్ పుష్ప 2కి వచ్చింది. 670 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ అయింది. ఇక ఆడియో రైట్స్, డిజిటల్ రైట్స్, ఓటీటీ రూపంలో 400 కోట్లు వచ్చినట్టు ఇండస్ట్రీ టాక్. దాదాపు 1060 కోట్ల బిజినెస్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. నెల రోజుల ముందే ఓవర్సీస్ లో టికెట్ బుకింగ్ఫ్ మొదలయ్యాయి. గంటలలో అన్నీ అమ్ముడుపోయాయి. బాక్సాఫీస్ వద్ద అత్యంత వేగంగా ఒక మిలియన్ టికెట్స్ అమ్ముడైన చిత్రంగా ఇది నిలిచింది. కేవలం బుక్ మై షోలోనే ఇన్ని టికెట్లు అమ్ముడు పోవడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో ఈ చిత్రం సుమారు 12 వేల 500పైగా థియేటర్లలో విడుదలకాబోతంది. తొలి రోజే 55 వేల షోస్ వేస్తున్నారు. ఈ ఘనత పుష్ప 2కు మాత్రమే దక్కింది. 80 దేశాల్లో ఆరు భాషల్లో ఈ నెల 5న రిలీజ్ అవుతోంది.
పుష్పతో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ఆ చిత్రం ద్వారా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కూడా గెలుచుకున్నారు. ఆ తరంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, చిరంజీవి, ఈ తరంలో ఏ తెలుగ హీరో ఆ అవార్డు దక్కించుకోలేకపోయారు. ఇక పుష్ప-2 కు ఎందుకు ఇంత క్రేజ్ ఏర్పడింది అనేది విశ్లేషకులకు సైతం అంతుబట్టడం లేదు. ఒకే రోజు 55 వేల షోస్ అంటే మాటలు కాదు. ఫస్ట్ డే కలెక్షన్ ప్రపంచ వ్యాప్తంగా 250- 270 కోట్లు ఉంటుందని బాక్సాఫీస్ పండితుల అంచనా. నిజానికి ఈ క్రేజ్ ఊహించనిదేమీ కాదు. చేతిలో చిల్లిగవ్వ లేని దశనుంచి వ్యవస్థను శాసించే స్థాయికి ఎదిగే పాత్ర పుష్ప రాజ్ . సహజంగా ఇందులో ప్రేక్షకులను ఆకట్టుకునే హీరోయిక్ అండ్ ఎమోషనల్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. సగటు సినిమా అభిమాని కోరుకునేది ఇదే. ఇలాంటి పాత్రలు..సినిమాలు ఇప్పుడు బాలీవుడ్ లో రావట్లేదు. ఈ గ్యాప్ ని దక్షిణాది సినిమా బర్తీ చేస్తోంది. అందుకే భాషా బేధం లేకుండా ఉత్తరాది వారు కూడా వాటిని ఆదరిస్తున్నారు.
టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్ వంటి మాస్ హీరోలు యాక్షన్ తో అలరించినా .. వారి పాత్రల్లో లు సగటు ఇండియన్ సినిమా హీరో పడే కష్టాలు, కన్నీళ్లు, తెగువ, సాహసం వంటి కనిపించవు. ఇందుకు భిన్నంగా పుష్పలో అల్లు అర్జున్, కేజీఎఫ్ లో యష్ తమ నటనతో ప్రేక్షకులను ఎక్కడ టచ్ చేయాలో అక్కడ టచ్ చేశారు. ఇలాంటి సినిమాలు హీరోయిజానికి అసలైన ప్రామాణికతను తీసుకువస్తాయి. వీటాలో నాయకులు తమ సంకల్ప బలంతో ఏమీ లేని స్థితి నుంచి పైపైకి ఎగిసిపడతారు. వారి కష్టాలు, విజయాలు ప్రేక్షకునికి నిజమైన అనుభూతిని కలిగిస్తాయి. సగటు సినీ అభిమాని తమను తాము అందులో చూసుకుని మురిసిపోతారు. పుష్ప: ది రైజ్‌లో అల్లు అర్జున్ ను సెల్ఫ్‌మేడ్ మ్యాన్ చూపిన పాత్ర అటువంటిదే. అతని మొండితన ..తెగువ.. తిరుగుబాటు వైఖరి, లోతైన ఎమోషన్ “రాగ్స్ టు రిచ్స్” ఫార్ములకు తిరిగి జీవం పోసాయి. మరి పుష్ప 2 దీనిని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళుతందా? అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.