Site icon NTV Telugu

Peddi Exclusive :’పెద్ది’ 60 % కంప్లీట్.. రేపటి నుంచి అక్కడ సాంగ్ షూట్!

Peddi

Peddi

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుచ్చిబాబు సానా ఈ సినిమాని ఒక రేంజ్‌లో చెక్కుతున్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో అప్‌డేట్ వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన 60 శాతం షూటింగ్ పూర్తి కావచ్చింది. ఇప్పటికే దాదాపుగా ఫస్ట్ హాఫ్ పూర్తి అయినట్లుగా సమాచారం. ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని చూసిన సుకుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా సెప్టెంబర్‌కు ఈ ప్రక్రియ అంతా ముగిసింది.

Also Read :Rashmika : కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేయడంపై స్పందించిన రష్మిక

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, టీమ్ ఒకపక్క సినిమా షూటింగ్ చేస్తూనే, మరోపక్క ఎడిటింగ్ కూడా చేస్తూ, ఎక్కడా లాగ్ లేకుండా చూసుకుంటున్నట్లుగా సమాచారం. ఇక రేపు ఈ సినిమాకి సంబంధించిన ఒక సాంగ్ షూటింగ్ మొదలు కాబోతోంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ సాంగ్‌ని మహారాష్ట్రలోని పూణేలో షూట్ చేయడానికి టీమ్ పూణే పయనమౌతోంది.

Also Read :Deepika Padukone : హిజాబ్ ధరించిన దీపిక.. ఓ రేంజ్ లో ట్రోల్స్..

రామ్ చరణ్‌తో పాటు జాన్వి కపూర్‌ మీద ఈ సాంగ్ ఉండబోతున్నట్లుగా సమాచారం. ఇది ఒక విజువల్ ట్రీట్‌లాగా ప్లాన్ చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సాంగ్స్ ఇచ్చాడని, అందులో ఒక సాంగ్ రేపు షూటింగ్ మొదలు కాబోతోందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో శివ రాజకుమార్ కీలక పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా వృద్ధి సినిమాస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు.

Exit mobile version