Site icon NTV Telugu

Telugu Films: ఇక అలాంటి సినిమాలు రాసే డైరెక్టర్‌లకు రక్త కన్నీరే!

Director Shill

Director Shill

అదేంటి అనుకుంటున్నారా? అయితే అసలు సంగతి మొత్తం మీకు చెప్పాల్సిందే. అసలు విషయం ఏమిటంటే, తెలుగు సినీ పరిశ్రమలో ఫ్యామిలీ సినిమాలకు సపరేట్ క్రేజ్ ఉండేది. ఒక ఫ్రేమ్ నిండా ఆర్టిస్టులతో సీన్లు రాసుకునేవాళ్లు మన దర్శకులు. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో, రాను రాను అలాంటి సీన్స్ రాసుకునే దర్శకులకు రక్త కన్నీరే అని చెప్పవచ్చు. ఎందుకంటే, ఈ మధ్యకాలంలో అలాంటి సినిమాలు చాలా తగ్గిపోయాయి. అలాంటి సినిమాలు చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు కూడా. కానీ, అలాంటి సినిమాలు చేసే పరిస్థితి లేదు. ముఖ్యంగా, హీరోలు ప్రస్తుతానికి అలాంటి సినిమాలు ఒప్పుకుంటారా అంటే, అది అనుమానమే.

Also Read:Perni Nani: ఇంట్లో పెళ్లి ఉందని చెప్పినా.. పోలీసులు వినిపించుకోవడం లేదు!

ఎందుకంటే, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాలు ఒప్పుకుంటున్నా, మెగాస్టార్ చిరంజీవి సైతం అలాంటి జానర్ సినిమాలకు ఆసక్తి కనబరుస్తున్నా, మిగతా సీనియర్ హీరోలైన బాలకృష్ణ, నాగార్జున సహా యంగ్ హీరోస్ ఎవరూ ఆ జానర్ వైపు ఆసక్తి కనపరచడం లేదు. దానికి తోడు, అలాంటి కథలు రాసుకుంటున్న దర్శకులకు ఆర్టిస్టుల డేట్స్ మేనేజ్ చేయడం పెద్ద టాస్క్ అయిపోతుంది.

Also Read:Deepika Padukone: హీరో, హీరోయిన్ ఒక్కటేనా? దీపికా!

ఒకవేళ అందరూ ఆర్టిస్టులను ఒకరోజు సెట్ చేసి, సీన్ తీద్దాం అనుకుని కూర్చోవడానికి సిద్ధమవుతున్న సమయంలో, వారిలో ఒక ఆర్టిస్ట్ వచ్చి, “డైరెక్టర్ గారు, నాకు గంటలో మరో షూటింగ్ ఉంది, గంటలో మీరు నన్ను పంపించేయాలి” అంటూ బాంబు పేలుస్తున్నారు. దీంతో, అప్పటివరకు క్రియేటివ్ స్పేస్‌లో ఉందామనుకున్న డైరెక్టర్ ఒక ప్రెషర్ స్పేస్‌లోకి వెళ్లి, ఆ రోజు మంచిగా చేయాల్సిన సీన్‌ని కూడా చెడగొట్టేస్తున్న దాఖలాలు ఈ మధ్య కొన్ని కనిపించాయి ఇండస్ట్రీలో. కాబట్టి, ఇక మీదట దర్శకులు ఇలా ఫ్యామిలీ ఓరియెంటెడ్ కథలు రాసుకున్నా సరే, ఒక ఫ్రేమ్ నిండా ఆర్టిస్టులను పెట్టుకుని సీన్ చేయాలి అనుకుంటే మాత్రం, వారికి రక్త కన్నీరు తప్పదనే చెప్పాలి.

Exit mobile version