NTV Telugu Site icon

Tollywood: ఒకే రోజు పది సినిమాలు.. ఇంకెప్పుడు మారేది?

Tollywood

Tollywood

అయితే అతివృష్టి లేకుంటే ఆనావృష్టిగా తయారైంది తెలుగు సినీ పరిశ్రమ పరిస్థితి. వస్తే వరుస పెట్టి సినిమాలు రిలీజ్ అవుతాయి లేదంటే ఒక్క సినిమా కూడా రిలీజ్ కానీ పరిస్థితి ఏర్పడుతుంది. రేపు అంటే నవంబర్ 22వ తేదీన ఏకంగా 10 సినిమాలను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. నిజానికి గత వారం అంటే నవంబర్ 14వ తేదీన ఒక డబ్బింగ్ సినిమా కంగువతో పాటు మరో స్ట్రైట్ తెలుగు సినిమా మట్కా మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఆరోజు రిలీజ్ కావాల్సిన దేవకీ నందన వాసుదేవ సినిమాని ఈ వారానికి వాయిదా వేశారు. అలా వాయిదా వేయకుండా ఉన్న ఏమైనా వర్కౌట్ అయ్యేదేమో ఎందుకంటే ఆ రెండు సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఈ వారం మొత్తానికి ఏకంగా 10 సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి.

Spotless Face Tips: ముఖంపై మొటిమలు, మచ్చలు మాయం కావాలంటే ఈ పద్ధతులను అనుసరిస్తే సరి
అందులో విశ్వక్సేన్ హీరోగా నటించిన మెకానిక్ రాకి, అశోక్ గల్లా హీరోగా నటించిన దేవకీ నందన వాసుదేవ, సత్యదేవ్ హీరోగా నటించిన జీబ్రా, రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన కేసీఆర్ సినిమాలు కాస్త చెప్పుకోదగ్గవి. ఇవి కాకుండా రోటి కపడా రొమాన్స్ అనే సినిమా, ఉద్వేగం సినిమా, పిచ్చోడు, ఝాన్సీ ఐపీఎస్, కనకమహాలక్ష్మి లాంటి సినిమాలు కూడా రిలీజ్ కి రెడీ అయ్యాయి. అదే విధంగా గతంలో తమిళంలో రిలీజ్ అయి తెలుగులో ఇప్పుడు డబ్బింగ్ అయ్యే రిలీజ్ అవుతుంది సన్నీ లియోన్ మందిర అనే సినిమా. అయితే వీటిలో రోటి కపడ రొమాన్స్ సినిమాతో పాటు ఝాన్సీ ఐపీఎస్ అనే రెండు సినిమాలను థియేటర్లు లేకపోవడంతో వచ్చే వారానికి వాయిదా వేశారు. ని

జానికి ఇలాంటి పద్ధతి మార్చుకోకపోతే ఒక్క సినిమాకి కూడా పూర్తిస్థాయి ధియేటర్లు దొరక్కపోయే పరిస్థితులు ఏర్పడతాయి. నిజానికి విశ్వక్సేన్ సినిమాతో పాటు దేవకీ నందన వాసుదేవ, జీబ్రా, కేసిఆర్ లాంటి సినిమాలు కాస్త చెప్పుకోదగ్గవే. వారానికి రెండు సినిమాలు రిలీజ్ అయితే పర్వాలేదు ఏకంగా చెప్పుకోదగ్గ సినిమాలు నాలుగు రిలీజ్ అవుతూ మరో ఐదు ఆరు సినిమాలు చిన్నవి రిలీజ్ అవుతూ ఉండడంతో ఏ సినిమాకి పూర్తిస్థాయిలో థియేటర్లు దొరకవు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిర్మాతలు ఇప్పటికైనా ఈ ప్లానింగ్ విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బంది తప్పదు అని చెప్పక తప్పదు.

Show comments