Telugu Girl Susroonya Koduru health Critical: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని లా పోర్టేలోని శాన్ జాసింటో మాన్యుమెంట్ వద్ద పిడుగుపాటుకు గురై అమెరికాలో చదువుకుని అక్కడే సెటిల్ అవ్వాలని వెళ్లిన భారతదేశానికి చెందిన 25 ఏళ్ల తెలుగు విద్యార్థిని సుస్రూణ్య కోడూరు తీవ్రంగా గాయపడింది. శాన్ జాసింటో మాన్యుమెంట్ పార్క్‌లోని చెరువు వద్ద షికారు చేస్తుండగా పిడుగు పడడంతో సుస్రూణ్యకు తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. పిడుగుపాటుకు గురై సుస్రూణ్య గాయపడి పక్కనే ఉన్న ఒక చెరువులో పడింది. వెంటనే ఆ పక్కనే ఉన్న ఒక వ్యక్తి దూకి ఆమెకు సహాయం చేసి ఒడ్డుకు తీసుకొచ్చారు. అయితే ఆమెకు ఫస్ట్ ఎయిడ్ అందించడానికి ప్రయత్నించిన వారు ఆమెకు సీపీఆర్ ఇచ్చారు. అయితే సుస్రూణ్యకు 20 నిమిషాల పాటు గుండె ఆగిపోవడం వల్ల మెదడు తీవ్రంగా దెబ్బ తినడంతో ఆమె కోమాలోకి వెళ్లిందని తెలుస్తోంది.
Adivi Sesh: మళ్లీ డైరెక్షన్ చేయబోతున్న అడివి శేష్?
సుస్రూణ్యకు ప్రస్తుతం వెంటిలేటర్ సపోర్ట్ అలాగే ఫీడింగ్ ట్యూబ్ అవసరం అని వైద్యులు తేల్చారు. MRI రిపోర్టుల ప్రకారం ఆమెకు అనాక్సిక్ ఎన్సెఫలోపతి వచ్చిందని అంటున్నారు. ఈ పరిస్థితి మెదడుకు ఎక్కువ కాలం ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ కష్ట సమయంలో తమ కుమార్తెతో కలిసి ఉండాలని అనుకుంటున్నా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సుస్రూణ్య తల్లిదండ్రులకు పలువురు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. అత్యవసర వీసాల కోసం తక్షణ ప్రయత్నాలు జరుగుతున్నాయి, సుస్రూణ్య తన మాస్టర్స్ డిగ్రీ చదివి అమెరికాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో మరింత ముందుకు వెళ్లాలని కలలు కన్నదని ఆమె స్నేహితులు చెబుతున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థుతుల్లో ఆమెను తిరిగి ఇండియా తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఫండ్ రైజింగ్ జరుగుతోంది.
