ZIM vs NZ: బులావయో వేదికగా జింబాబ్వే, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ జట్టు పూర్తి ఆధిపత్యం కనబరిచింది. కేవలం మూడు రోజులలో ముగిసిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో జింబాబ్వేపై గెలుపొందింది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ (Matt Henry) రెండు ఇన్నింగ్స్‌లలో కలిసి 9 వికెట్లు తీసి “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు దక్కించుకున్నాడు.
టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన జింబాబ్వే జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 149 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జింబాబ్వే కేప్టెన్ క్రెగ్ ఎర్వైన్ 39, వికెట్ కీపర్ తఫద్జ్వాట్సిగా 30 పరుగులతో కొంత ప్రతిఘటన చూపినప్పటికీ మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. మ్యాట్ హెన్రీ 6 వికెట్లతో కదం తొక్కగా, నాథన్ స్మిత్ 3 వికెట్లు తీశాడు.
Nimisha Priya Case: నిమిషా ప్రియా ఉరిశిక్షపై కేంద్రం కీలక ప్రకటన..
ఇక ఆ తర్వాత దూకుడుగా ఆడిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే (88), డెరిల్ మిచెల్ (80) కీలక ఇన్నింగ్స్‌లతో మెరిశారు. జింబాబ్వే బౌలింగ్‌లో ముజారాబానీ 3 వికెట్లతో కాస్త మెరుగ్గా రాణించాడు. ఇక భారీ వెనుకంజలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే మరోసారి తడబడింది. సీన్ విలియమ్స్ (49) మినహా ఎవరూ రాణించలేకపోయారు. మిచెల్ సాంట్నర్ 4, మ్యాట్ హెన్రీ మరో మూడు వికెట్లు తీసి జింబాబ్వేను దెబ్బకొట్టాడు. మొత్తంగా జింబాబ్వే 165 పరుగులకే ఆలౌట్ అయింది.
World’s Worst Train Accident: ప్రపంచంలోనే అతిపెద్ద రైలు ప్రమాదం ఇదే.. ఏకంగా 17 వందల మంది మృతి..!
దీనితో కేవలం 8 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు వచ్చిన న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే త్వరగా అవుట్ అయినా, హెన్రీ నికోల్స్, విల్ యంగ్ కలిసి విజయానికి అవసరమైన పరుగులను పూర్తి చేసి విజయాన్ని అందుకున్నారు. మొత్తంగా మూడు రోజుల వ్యవధిలోనే మ్యాచ్‌ను 9 వికెట్ల తేడాతో ముగించేసింది న్యూజిలాండ్.
