NTV Telugu Site icon

Nitin Kamat : డబ్బుతో దీన్ని కొనలేరు.. అద్భుతమై స్టోరీ చెప్పిన జెరోధా సీఈఓ

Nikith Kamath

Nikith Kamath

జీరోధా సహ వ్యవస్థాపకుడు, CEO నితిన్ కామత్ సోమవారం తన మామగారితో ఒక చిత్రాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. 70 ఏళ్ల వృద్ధుడు తనకు సంతృప్తిగా ఉండటమే నిజమైన స్వేచ్ఛకు ఏకైక మార్గం అనే పాఠాన్ని ఎలా నేర్పించాడో వివరించాడు. తన మామ, శివాజీ పాటిల్ ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత కర్ణాటకలోని బెల్గాంలో కిరాణా దుకాణం ప్రారంభించారని, తాను మరియు సీమ సాధించిన విజయం తర్వాత కూడా పని మానేయడానికి అతను ఎలా నిరాకరించాడని నితిన్ కామత్ ట్వీట్‌లో చెప్పాడు.

Also Read : Pawan Kalyan: కేరళ బోటు ప్రమాదం విచారకరం.

కామత్ తన జీవనశైలి గురించి మాట్లాడుతూ, అతను స్థానిక మార్కెట్‌కు క్రమం తప్పకుండా వెళ్తుంటాడని మరియు తన మామ పని మానేయడానికి నిరాకరిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. అతనికి 70 సంవత్సరాలు, కానీ దుకాణానికి కిరాణా సామాను కొనడానికి తన పాత స్కూటర్‌పై స్థానిక మార్కెట్‌కు క్రమం తప్పకుండా వెళ్తాడు. అతనికి మా అత్తగారు సహాయంగా ఉంటారు.. దీంతో దుకాణాన్ని నిర్వహించడంలో తోడుగా ఉంటారు.

Also Read : Anasuya: తప్పు చేస్తున్నారు.. విజయ్ ఫ్యాన్స్ ను మరింత రెచ్చగొట్టిన అనసూయ

షాప్‌లోని వివిధ ఉత్పత్తులకు మార్జిన్‌ల గురించి నేను అతనిని అడిగినప్పుడు చురుగ్గా ఆన్సర్స్ ఇచ్చాడని కామత్ వెల్లడించాడు. అతను చిక్కీలపై 25 శాతం మార్జిన్ గురించి మాట్లాడాడు, ₹200కి ఒక బాక్స్‌ను కొనుగోలు చేసి, వాటిని ఒక్కొక్కటిగా ₹250కి విక్రయిస్తున్నాడు అని నితిన్ కామత్ ట్విట్టర్ పోస్ట్ లో రాసుకొచ్చారు.

Also Read : IPL 2023 : కోల్ కతాకు భారీ టార్గెట్ ఇచ్చిన పంజాబ్ కింగ్స్

2007లో తన కూతురిని పెళ్లి చేసుకోవడానికి అనుమతిని కోరినప్పుడు అతను నన్ను ప్రభుత్వ ఉద్యోగం చేయమని అడిగారు.. కానీ నేను చివరి వరకు ఆరోగ్యాన్ని పెంచుకోవడం.. మంచి జీవితాన్ని ఎలా జీవించాలనే దాని గురించి ఆలోచిస్తున్నాను అని కామత్ అన్నాడు. డబ్బుతో ఆరోగ్యం, శారీరకంగా చురుకుగా ఉండలేమని తన మామ వెల్లడించారని నితిన్ కామత్ చెప్పుకొచ్చారు.

Show comments