NTV Telugu Site icon

YV Subbareddy: పవన్‌ సినిమా డైలాగ్‌లు చెప్పినంత ఈజీ కాదు..

Yv Subbareddy

Yv Subbareddy

YV Subbareddy: ముఖ్యమంత్రి జగన్‌ కాపుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని ఎస్సార్‌సీపీ రీజినల్‌ కో ఆర్డినేటర్‌, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కాపులకు రూ.25 కోట్లు కేటాయించడమే ఇందుకు నిదర్శనమన్నారు. విశాఖలో కాపు సామాజిక భవనం భూమి పూజా కార్యక్రమంలో సుబ్బారెడ్డితో పాటు పలువురు కీలక నేతలు పాల్గొని మాట్లాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కాపులది కీలక పాత్ర అని ఆయన వెల్లడించారు. కాపులతో పాటు యాదవుల సామాజిక భవనం నిర్మాణం కోసం కూడా 50 సెంట్ల భూమి కేటాయించారు. రాజ్యసభ నిధుల నుంచి కాపు, యాదవ సామాజిక భవనాలకు కోటి రూపాయలు ఖర్చు చేస్తాను అని ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

Read Also: Ambati Rambabu: పవన్‌ రాజకీయాలకు పనికొచ్చే మనిషి కాదు.. అంబటి సంచలన వ్యాఖ్యలు

మరోవైపు పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు. వైసీపీని అధఃపాతాళానికి తొక్కమనండి చూద్దాం.. పవన్ కల్యాణ్ సినిమా డైలాగ్‌లు చెప్పినంత ఈజీ కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో జరిగేది క్లాస్ వార్.. క్యాస్ట్ వార్ కాదన్నారు. మాది చీటింగ్ టీమ్‌ కాదన్న ఆయన.. జనసేన, టీడీపీలు లూటీ టీమ్ అని విమర్శించారు. ఏపీని లూట్ చేసిన దానికి స్కిల్ స్కాం ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. అభ్యర్థులు లేక పోవడం కాదు 175 సీట్లు గెలవడం కోసమే వైసీపీ మార్పులు చేస్తోందని వైవీ సుబ్బారెడ్డి వివరించారు.