చంద్రబాబు, పవన్ పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ప్రతి పక్షాలు ఎలా వచ్చినా మేము సిద్దమని ఆయన అన్నారు. వివేకా హత్య కేసులో వెనుక ఎవరు ఉన్నారు అనే వాస్తవాలను న్యాయస్ధానాలు నిగ్గు తేలుస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా న్యాయ స్ధానాలపై మాకు నమ్మకం ఉందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గూగుల్ టేకవుట్ మొదటి నుండి ఎందుకు లేదు.. మధ్యలో సీబీఐ ఎందుకు బయటకు తీసుకువచ్చారని ఆయన అన్నారు. న్యాయస్ధానాలను పక్కదారి పట్టించేలా గతంలో సీబీఐ వ్యవహరించిందని గతంలో ఆధారాలతో సహ కోర్టుకు సమర్పించామని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా.. పవన్ పబ్లిసిటీ కోసమే వాలంటీర్లపై ఆరోపణలు చేస్తున్నారు అంటూ విమర్శించారు వైవీ సుబ్బారెడ్డి.
Also Read : Cyber Fords: ఇన్వెస్ట్‌మెంట్ డబుల్ అన్నారు.. కట్ చేస్తే రూ.712 కోట్లు కొట్టేశారు
ఎవరో రాసిన స్క్రిప్టును పవన్ చదువుతున్నారని..వాలంటీర్లపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజలకు సేవ చేస్తున్న వలంటీర్లపై ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకోంఅంటూ హెచ్చరించారు.వచ్చే సెప్టెంబర్ నెలలు జగన్ విశాఖ పట్నంలో పర్యటిస్తారని తెలిపారు. బీజేపీఅంటే జగన్ కు ప్రాణం అని అన్నారు. వైసీపీ నమ్ముకున్నఅందరికి జగన్ న్యాయం చేశారని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జగన్ వైపే ప్రజలు ఉన్నారని అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీచేస్తాయనే ప్రచారం జరుగుతోంది జగన్ ను గద్దె దింపాలంటే ఈ మూడుపార్టీలు ఏకం కావాలా? అంటే జగన్ అంత స్ట్రాంగ్ అని తెలుస్తోందన్నారు.
Also Read : NTR: రక్తపాతం సృష్టిస్తున్న సముద్ర వీరుడు…