NTV Telugu Site icon

YV Subba Reddy: అలర్ట్ అయిన వైసీపీ..! రంగంలోకి వైవీ సుబ్బారెడ్డి..

Yv Subbareddy

Yv Subbareddy

YV Subba Reddy: గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ (GVMC) కార్పొరేటర్లతో వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.. మేయర్ పీఠంపై కూటమి కన్నేయడంతో అలర్ట్ అయిన వైసీపీ.. వైవీని రంగంలోకి దింపింది.. కార్పొరేటర్లలో కొంత మంది టీడీపీ, జనసేనకు టచ్ లో వున్నారని విస్తృత ప్రచారం నేపథ్యంలో.. వైవీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.. ఎటువంటి అపోహలకు, ప్రలోభాలకు ఆస్కారం ఇవ్వవద్దని కార్పొరేటర్లకు సూచించారు సుబ్బారెడ్డి.. ఈ సమావేశంలో మాజీమంత్రి అమర్నాథ్ పాల్గొన్నారు.

Read Also: Kalki 2898 AD : ‘కల్కి’ కాన్వాయ్ మాములుగా లేదుగా

ఇక, మీడియాతో వైవీ సుబ్బా రెడ్డి మాట్లాడుతూ.. కార్పొరేషన్ లు, స్థానిక సంస్థలలో ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉంది.. అలాంటి ప్రలోభాలకు లొంగకుండా అందరం కలిసి సమిష్టి సమీక్షలు నిర్వహిస్తున్నాం అన్నారు. దాడులకు కూడా భయపడ వద్దని, పార్టీ ఆదుకుంటుందని శ్రేణులకు భరోసా ఇస్తున్నాం.. కార్యకర్తలకు అన్నీ విధాలుగా పార్టీ అందుబాటులో ఉంటుంది, ఆదుకుంటుంది అన్నారు. ఎన్డీఏకు కూడా పూర్తి స్థాయి మెజారిటీ లేని పరిస్థితుల్లో పార్లమెంట్ సమావేశాలు కీలకం కానున్నాయన్న ఆయన.. పార్లమెంట్ లో వైఎస్ఆర్సీపీ కి 15 మంది ఎంపీలు ఉన్నారు.. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాం అని ప్రకటించారు వైవీ సుబ్బారెడ్డి.