NTV Telugu Site icon

YV Subba Reddy: పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత లేదు.. వ్యక్తిగత కారణాల వల్లే కొంత మందికి అసంతృప్తి..

Yv Subba Reddy

Yv Subba Reddy

YV Subba Reddy: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఇంఛార్జ్‌ల మార్పు కొన్ని ప్రాంతాల్లోని నేతలు అసంతృప్తి వ్యక్తం చేసేలా చేసింది.. అంతేకాదు.. కొందరు నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పారు.. ఇతర పార్టీలో చేరుతున్నారు.. ఈ నేపథ్యంలో వైసీపీ రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ఇంఛార్జీల మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని యాత్రలు చేసిన నారా చంద్రబాబు నాయుడును మరోసారి నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని తెలిపారు. బీసీ డిక్లరేషన్ , గ్యారెంటీలు ప్రజలను మోసం చేయడానికే అనే దుయ్యబట్టారు. ఇక, కొంతమంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకతకు అనేక కారణాలు ఉన్నాయని.. సామాజిక సమీకరణాలు కొన్ని చోట్ల, ఆర్థిక వ్యవహారాలు మరికొన్ని చోట్ల.. ఎమ్మెల్యేలపై వ్యతిరేకతకు కారణంగా చెప్పుకొచ్చారు..

Read Also: Hemant Soren Big Announcement: వృద్ధాప్య పెన్షన్‌పై జార్ఖండ్‌ సీఎం సంచలన నిర్ణయం

అయితే, ప్రజల్లో పార్టీపై వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. కానీ, వ్యక్తిగత కారణాల వల్లే కొంత మంది పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇక, వైసీపీ ఎమ్మెల్యే వంశీ.. జనసేన పార్టీలో చేరడంపై స్పందిస్తూ.. ఎమ్మెల్సీ వంశీకి పోటీ చేసే అవకాశం ఇస్తే భారీ తేడాతో ఓటమి పాలయ్యారని వ్యాఖ్యానించారు వైసీపీ రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి. కాగా, తొలి జాబితాలో మంత్రులు సహా 11 మంది స్థానాలు మార్చిన వైసీపీ అధిష్టానం.. రెండో జాబితా సిద్ధం చేస్తోంది.. రెండో జాబితాలో ఏకంగా 30 మందిని మార్చే అవకాశం ఉందనే చర్చ సాగుతోన్న విషయం విదితమే.