Site icon NTV Telugu

YV Subba Reddy: బురదజల్లే పనిలో జనసేన.. వారి విమర్శలకు సమాధానం ఇవ్వాల్సిన పనిలేదు..!

Yv Subbareddy

Yv Subbareddy

YV Subba Reddy: జనసేన నాయకుల విమర్శలకు సమాధానం ఇవ్వాల్సిన పని లేదని కొట్టిపారేశారు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి.. విశాఖపట్నం పర్యటనలో ఉన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలపై, కార్యక్రమాలపై బురద జల్లే పనిలో జనసేన ఉంది.. వారి విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.. ఇక, సాధికారిక బస్సు యాత్ర తొలి విడత విజయవంతం అయ్యింది.. 175 నియోజక వర్గాల్లో ఈ రోజు నుంచి నవంబర్ 30వ తేదీ వరకు రెండో విడత బస్సు యాత్రలు సాగుతాయన్నారు.. ఈ రోజు నరసన్నపేట నుంచి రెండో విడత యాత్ర మొదలవుతుందని వెల్లడించారు. నాలుగున్నర ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు ప్రజల దృష్టికి తీసుకువెళ్తాం.. 70 శాతం పథకాలు, బీసీ, ఎస్టీ, ఎస్సీ సామాజిక వర్గాల ప్రజలకు ఈ ప్రభుత్వం అందించిందన్నారు.

Read Also: Loki 2: మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ కి ప్రాణం వచ్చింది…

మరోవైపు ఈ నెల 23వ తేదీన సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో పర్యటిస్తారని వెల్లడించారు వైవీ సుబ్బారెడ్డి.. వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర తొలి దశలో పెద్ద ఎత్తున ప్రజలు నీరాజనం పలికారు. సామాజిక సాధికారిక యాత్రలో నాడు నేడు పనులను పరిశీలిస్తున్నాం.. ఎక్కడైనా లోపాలుంటే సరి చేయాలని చెబుతున్నాం. కానీ, నాడు-నేడుపై బురద జల్లే పనిలో జనసేన పార్టీ ఉంది.. జనసేన నాయకుల విమర్శలకు సమాధానం ఇవ్వాల్సిన పని లేదన్నారు.. ఇక, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా.. పొత్తులు పెట్టుకున్నా.. రానున్న ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడం ఖాయం.. మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సేవలు కొనసాగిస్తారు.. సంక్షేమ పథకాలను అందిస్తారని తెలిపారు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి.

Exit mobile version