Loki 2: మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ కి ప్రాణం వచ్చింది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2019లో అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి టిల్ డేట్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ ఎండ్ గేమ్ రేంజులో రెస్పాన్స్ తెచ్చుకోలేదు. ఫేజ్ 4 అండ్ ఫేజ్ 5 కంప్లీట్ అవ్వడానికి వచ్చాయి కానీ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ మాత్రం ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడంలో ఫెయిల్ అవుతూనే ఉంది. యూనివర్స్ అభిమానులని ఎగ్జైట్ చేసే థీమ్ లేకపోవడం, రెగ్యులర్ స్క్రీన్ ప్లేతో సినిమాలు వస్తూనే ఉండడంతో మార్వెల్ యూనివర్స్ రోజురోజుకి డౌన్ ఫాల్ అవుతూ వచ్చింది. సినిమాల్లో హీరోకి ఆయుధం దొరికినట్లు, గ్లోరీని కోల్పోతున్న మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ కి కొత్త ఊపిరి పోసాడు ‘లోకీ’.
థార్ తమ్ముడిగా ఆస్గార్డ్ దేవుడిగా ఇన్ని రోజులు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో కనిపించాడు లోకీ. ఈ గ్రే షేడ్ క్యారెక్టర్ ని టామ్ అకా థామస్ విలియమ్ సూపర్బ్ గా ప్లే చేస్తూ వచ్చాడు. లోకీ క్యారెక్టర్ ని మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ మొత్తంలోనే మోస్ట్ పవర్ ఫుల్ క్యారెక్టర్ గా మారుస్తూ లోకీ సీజన్ 2 బయటకి వచ్చింది. ఇప్పటివరకూ జరిగిన మార్వెల్ కథ మొత్తాన్ని మార్చగల శక్తివంతమైన హీరోగా లోకీ నిలిచాడు. అక్టోబర్ 5న లోకీ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రీమియర్ అయ్యింది. మొత్తం ఆరు ఎపిసోడ్స్ ఉన్న ఈ సీరీస్ లో లాస్ట్ ఎపిసోడ్ నవంబర్ 9న ప్రీమియర్ అయ్యింది. ఈ ఎండ్ ఎపిసోడ్ లోకీని ‘గాడ్’గా మార్చేసింది. చెట్టుగా మారిపోయిన లోకీ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ కి ఇంట్రెస్టింగ్ గా మార్చాడు. ఇక ఇప్పుడు లోకీని థార్ ని ఎప్పుడు కలుపుతున్నారు? ఎండ్ గేమ్ రూపాన్ని లోకీ మార్చగలడా? ఐరన్ మాన్ ని తిరిగి ప్రాణాలతో తీసుకోని రాగలడా అనే చర్చ మొదలయ్యింది. లోకీ ఇప్పుడు గాడ్ కాబట్టి ఇకపై ఏమైనా జరగొచ్చు. మరి దాదాపు మూడున్నర ఏళ్ల తర్వాత పూర్వవైభవాన్ని తెచ్చుకుంటున్న మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఇక్కడి నుంచి తమ టైమ్ లైన్ ని ఎలా డిజైన్ చేస్తారు అనేది చూడాలి.
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!