India Changed to Bharat: ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే చర్చ.. ఇండియా పేరు భారత్‌గా మారనుందా? దీనినిపై విపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి.. కొందరు ప్రముఖులు, ఎన్డీఏకు అనుకూలంగా ఉన్న పక్షాలు మాత్రం ఈ చర్యను స్వాగతిస్తున్నాయి.. అయితే, ఇండియా పేరుని భారత్‌గా మార్పు చేస్తే తప్పు లేదని, దేశ ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని అంటున్నారు టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి.. గతంలో కూడా పలు దేశాలు పేర్లు మార్చుకున్నాయని గుర్తు చేశారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి.. ఈ కామెంట్లు చేశారు.. ఇక, యువగళంలో కావాలని రెచ్చ గొడుతున్నారని నారా లోకేష్‌పై ఆరోపణలు గుప్పించారు.. ప్రజలు సమన్వయం పాటించాలని విజ్ఞప్తి చేశారు.. ఇదే సమయంలో.. జమిలి ఎన్నికలే కాదు ఎప్పుడు.. ఏ ఎన్నికలు వచ్చినా మేం సిద్ధంగానే ఉన్నామని అన్నారు. ప్రభుత్వ ప్రథకల వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని 175 నియోజక వర్గాల్లో గెలిచి తీరుతామంటున్నారు. ఇక, చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలను గతంలో కలుపుకుని ఝలక్ తిన్నారని, మళ్లీ ఇప్పుడు మా ఎమ్మెల్యేలు చేరితారని అంటే ఝలక్ తింటారని విమర్శించారు.. అంతేకాదు.. వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లే ఛాన్సే లేదన్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి.
Read Also: Maldives: మాల్దీవుల ఎన్నికల్లో ఇండియా వర్సెస్ చైనా.. ఎందుకంత కీలకం..