Yuzvendra Chahal: టీమ్ ఇండియా అనుభవజ్ఞుడైన లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం ఇంగ్లిష్ గడ్డపై కౌంటీ క్రికెట్‌లో రికార్డులు సృష్టిస్తున్నాడు. అక్కడ నార్తాంప్టన్ షైర్ జట్టులో భాగంగా యుజ్వేంద్ర చాహల్ ఉన్న సంగతి తెలిసిందే. డెర్బీషైర్ తో జరిగిన మ్యాచ్‌లో అతను అద్భుతమైన ప్రద్రర్శన చేసాడు. జట్టు కోసం, అతను మొదటి ఇన్నింగ్స్‌లో 16.3 ఓవర్లు బౌలింగ్ చేసి 45 పరుగులు ఇచ్చి 5 వికెట్లు సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ అతని మ్యాజిక్ కనిపించింది. అతను జట్టు కోసం మొత్తం 18 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అందులో, 54 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. చాహల్ అద్భుత ప్రదర్శన కారణంగా నార్తాంప్టన్‌షైర్ జట్టు డెర్బీషైర్‌పై 133 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
Duleep Trophy 2024: శ్రేయస్ డకౌట్.. సంజూ కూడా విఫలం! ఇలా అయితే కష్టమే
డెర్బీషైర్‌పై యుజ్వేంద్ర చాహల్ 9 వికెట్లు తీసి ప్రత్యేక ఘనత సాధించాడు. ఫస్ట్ క్లాస్‌లో 100 వికెట్లు తీసిన ప్రత్యేక బౌలర్ల జాబితాలో చేరిపోయాడు. 34 ఏళ్ల చాహల్ ఇప్పటివరకు మొత్తం 38 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. అతను 60 ఇన్నింగ్స్‌లలో 33 సగటుతో 106 వికెట్లు సాధించాడు. ఇందులో 4 సార్లు 4 వికెట్లు, 3 సార్లు 5 వికెట్లు తీసిన ఘనత కూడా సాధించాడు. ఇక యుజ్వేంద్ర చాహల్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ గురించి చూస్తే., అతను ఇప్పటివరకు భారతదేశం కోసం మొత్తం 72 ODI మ్యాచ్‌లు, 80 T20 మ్యాచ్‌లు ఆడాడు. ODIలో 69 ఇన్నింగ్స్‌లలో 27.13 సగటుతో 121 వికెట్లు, 79 T20 ఇన్నింగ్స్‌లలో 25.09 సగటుతో 96 వికెట్లు సాధించాడు.
– Five wicket haul in 1st innings.
– Four wicket haul in 2nd innings.
– Completed 100 wickets in FC.YUZVENDRA CHAHAL SHOW IN COUNTY CRICKET, The Magician of India. 💪 pic.twitter.com/TlOWoaf7HL
— Johns. (@CricCrazyJohns) September 11, 2024