Site icon NTV Telugu

Yuzvendra Chahal Divorce : స్టార్ స్పిన్నర్ చాహల్, నటి ధనశ్రీ విడాకులపై క్లారిటీ వచ్చేసింది..

Yuzvendra Chahal

Yuzvendra Chahal

యుజ్వేంద్ర చాహల్, భారత క్రికెట్ జట్టులో అద్భుతమైన స్పిన్నర్. ఐపీఎల్‌లో తన మాయాజాలంతో ఆకట్టుకుంటారు. స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ చాలా కాలంగా టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు. చాహల్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను ఆగస్టు 2023లో ఆడాడు. తాజా మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ రూ. 18 కోట్ల భారీ ధరకు చాహల్‌ను కొనుగోలు చేసింది. రాజస్థాన్ రాయల్స్ నుంచి పంజాబ్ కింగ్స్‌కు మారడంతో చాహల్ అభిమానుల్లో సరికొత్త ఆసక్తి రేకెత్తించాడు. యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకుంటారని గతంలో పుకార్లు వ్యాపించాయి.

READ MORE: CM Revanth Reddy: నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం సమావేశం.. కీలక ఆదేశాలు

తాజాగా వాళ్లిద్దరు విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు మరోసారి ఊపందుకున్నాయి. యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ‘అన్‌ఫాలో’ చేసుకున్నారు. ఇద్దరూ విడిపోయేందుకు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది! ఎక్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో ధనశ్రీతో ఉన్న అన్ని చిత్రాలను కూడా చాహల్ తొలగించాడు. కానీ.. ధనశ్రీ మాత్రం చాహల్‌తో ఉన్న ఏ చిత్రాన్ని డిలీట్ చేయలేదని తెలుస్తోంది.

READ MORE: Delhi: ఢిల్లీలో దారుణం.. పాఠశాలలో గొడవ.. 7వ తరగతి విద్యార్థి హత్య

కాగా.. 2020లో ధనశ్రీ, చాహల్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీళ్లిద్దరూ యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు పెడుతూ.. అభిమానుల్ని అలరిస్తూ ఉంటారు. ధనశ్రీ అయితే, తరచూ రీల్స్ చేస్తూ ఉంటుంది. చాహల్ తోటి ఆటగాళ్లతోనూ కలిసి డ్యాన్స్ చేస్తుంటుంది. ఆ వీడియోలు ఆమెకి మరింత క్రేజ్ తెచ్చిపెడుతున్నాయి.

Exit mobile version