Divorce: భారత స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ తాజాగా విడాకులు తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. 2020లో వివాహం చేసుకున్న ఈ జంట, ఐదేళ్లలోపు విడిపోవాలని నిర్ణయించుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. వీరి మధ్య విభేదాలకు ప్రధాన కారణం ఏమిటనేది తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్ జర్నలిస్ట్ విక్కీ లాల్వానీ నివేదిక ప్రకారం.. చాహల్, ధనశ్రీ విడాకులకు ప్రధాన కారణం ముంబైకి మారాలన్న విషయంపై వచ్చిన అభిప్రాయ భేదాలేనని తెలుస్తోంది. ధనశ్రీ తన వృత్తి కారణంగా ముంబైలో స్థిరపడాలని భావించింది. అయితే, చాహల్ తన కుటుంబంతో హర్యానాలో ఉండాలని కోరుకున్నాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ వివాదాలు చోటుచేసుకున్నాయి.
Read Also: Mythri Movie Makers: ప్రదీప్ రంగనాథన్ మైత్రి మూవీ మేకర్స్.. #PR04 గ్రాండ్ లాంచ్
వివాహం తర్వాత ధనశ్రీ చాహల్ కుటుంబంతో హర్యానాలో నివసిస్తూ, అవసరమైనపుడు మాత్రమే ముంబై వెళ్లేది. కానీ.. కాలక్రమేణా ముంబైలో ధనశ్రీ వృత్తి ప్రాధాన్యత పెరిగింది. తరచూ ప్రయాణించడం కష్టమవుతుండడంతో ఆమె పూర్తిగా ముంబైకి మారాలని నిర్ణయించుకుంది. దీనికి చాహల్ అంగీకరించకపోవడంతో, వారి మధ్య దూరం పెరిగింది. చివరికి ఇది విడాకుల వరకు దారితీసింది. వీరి విడాకులు 2025 ఐపీఎల్ ప్రారంభానికి కేవలం రెండు రోజుల ముందు మంజూరు అయ్యాయి. యుజ్వేంద్ర చాహల్ విడాకుల భరణంగా రూ.4.75 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. ఇందులో ధనశ్రీకు చాహల్ రూ.2.37 కోట్లు చెల్లించినట్లు సమాచారం. యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. వ్యక్తిగత జీవితం ఎంతగానో మారిపోయినప్పటికీ, క్రికెట్‌లో తన ప్రదర్శనపై ప్రభావం పడకుండా చాహల్ తన ఆటపై పూర్తిగా దృష్టి పెట్టాడు.